2022 MG Gloster । మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్ SUVగా లాంచ్ అయిన గ్లోస్టర్!
MG మోటార్ తమ ప్రీమియం రేంజ్ SUV గ్లోస్టర్ కారును మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్లో విడుదల చేసింది. ఈ సరికొత్త 2022 MG Gloster ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 32 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. మరిన్ని వివరాలు చూడండి.
వాహన తయారీదారు MG మోటార్ భారతదేశపు మొట్టమొదటి 'అటానమస్' ప్రీమియం SUV గ్లోస్టర్ (2022 MG Gloster) ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఇది అడ్వాన్స్‌డ్ వెర్షన్ గ్లోస్టర్, ఈ వాహనంలో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా పలు సరికొత్త అప్‌డేట్‌లను అందిస్తున్నారు. ముఖ్యంగా భద్రత ఫీచర్లు మరింత మెరుగుపరిచారు. ఇందులో భాగంగా డోర్ ఓపెన్ వార్నింగ్ (DOW), రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ (RCTA), లేన్ చేంజ్ అసిస్ట్ (LCA) వంటి ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్‌లు ఉన్నాయి. వీటితో పాటు 30 రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కొత్త గ్లోస్టర్‌ను సురక్షితమైన వాహనంగా నిలుపుతాయి.
సరికొత్త MG Gloster కార్ 6- సీట్లు లేదా 7-సీట్ల ఎంపికలో లభిస్తుంది. అలాగే 2 Wheel Drive, 4 Wheel Drive వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇక, కలర్ ఆప్షన్స్ పరిశీలిస్తే డీప్ గోల్డెన్, మెటల్ బ్లాక్, వార్మ్ వైట్, మెటల్ యాష్ అనే నాలుగు ఆకర్షణీయమైన పెయింట్ స్కీములలో ఇది లభ్యమవుతోంది.
2022 MG Gloster ఎక్స్-షోరూమ్ వద్ద ధర రూ. రూ. 31.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్- ఎండ్ మోడల్ రూ. 40.77 లక్షలకు లభిస్తుంది. ఈ ప్రీమియం SUVలో ఇంకా ఎలాంటి స్పెక్స్ ఉన్నాయి, ఇంజన్ సామర్థ్యం మొదలైన అంశాలను ఈ కింద పరిశీలించండి.
2022 MG Gloster ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
సరికొత్త MG గ్లోస్టర్‌లో కూడా అదే పాత 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 161bhp శక్తిని, 375Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగా, ట్విన్-టర్బో వెర్షన్ ఇంజన్ 215bhp శక్తిని 480Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లో లభిస్తుంది.
MG గ్లోస్టర్ వాహనంలో సాటిలేని ప్రీమియం లగ్జరీ, ఉత్తమ క్లాస్ ఇంటీరియర్ స్పేస్‌ను అందిస్తుంది. ఇందులో భాగంగా డ్యూయల్ పనోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12-వార్ పవర్ అడ్జస్ట్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ మసాజ్, వైర్‌లెస్ ఛార్జింగ్, షార్ట్‌పీడియా న్యూస్ యాప్, గానా సాంగ్ సెర్చ్, 31.2 సెం.మీ టచ్‌స్క్రీన్‌తో ఆల్-టెర్రైన్ సిస్టమ్, 12 స్పీకర్‌లతో కూడిన హైక్వాలిటీ ఆడియో సిస్టమ్ తో పాటు వాయిస్ కమాండ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ అడ్వాన్స్‌డ్ వెర్షన్ 2022 MG Gloster SUV భారత రోడ్లపై టొయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఆల్టురాస్ G4, స్కోడా కొడియాక్, అలాగే జీప్ మెరిడియన్ వంటి వాహనాలకు పోటీగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్