BYD Atto 3 SUV launch : బీవైడీ అట్టో 3.. ఫీచర్స్​తో పాటు ధర కూడా ఎక్కువే!-in photos byd atto 3 electric suv launched in india s ev market ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Photos, Byd Atto 3 Electric Suv Launched In India's Ev Market

BYD Atto 3 SUV launch : బీవైడీ అట్టో 3.. ఫీచర్స్​తో పాటు ధర కూడా ఎక్కువే!

Nov 15, 2022, 07:15 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 15, 2022, 07:15 AM , IST

BYD Atto 3 SUV launch : బీవైడీ అట్టో 3 ఈవీ ఇండియాలో లాంచ్​ అయ్యింది. స్టైలిష్​ లుక్​తో వస్తున్న ఈ వాహనం ఎక్స్​షోరూం ధర రూ. 33.99లక్షలుగా ఉంది. ఈవీ మార్కెట్​లో ఈ కొత్త ఎంట్రీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

 చైనా ఆటో సంస్థ బీవైడీ(బిల్డ్​ యువర్​ డ్రీమ్స్​).. ఇండియాలో అట్టో 3 ఈవీని లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 33.99లక్షలుగా ఉంది. ఈ6 ఎంపీవీ తర్వాత.. ఇండియాలో బీవైడీ లాంచ్​ చేసిన రెండో మోడల్​ ఈ అట్టో 3.

(1 / 7)

చైనా ఆటో సంస్థ బీవైడీ(బిల్డ్​ యువర్​ డ్రీమ్స్​).. ఇండియాలో అట్టో 3 ఈవీని లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 33.99లక్షలుగా ఉంది. ఈ6 ఎంపీవీ తర్వాత.. ఇండియాలో బీవైడీ లాంచ్​ చేసిన రెండో మోడల్​ ఈ అట్టో 3.(https://bydautoindia.com/byd-atto3)

ఈ బీవైడీ అట్టో 3కి సంబంధించిన బుకింగ్స్​ అక్టోబర్​ 11 నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1,500 బుకింగ్స్​ వచ్చినట్టు సంస్థ చెప్పింది. రూ. 50వేలు చెల్లించి కారును బుక్​ చేసుకోవచ్చు. 2023 జనవరి నుంచి వాహనాల డెలివరీ ప్రారంభమవుతుంది

(2 / 7)

ఈ బీవైడీ అట్టో 3కి సంబంధించిన బుకింగ్స్​ అక్టోబర్​ 11 నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1,500 బుకింగ్స్​ వచ్చినట్టు సంస్థ చెప్పింది. రూ. 50వేలు చెల్లించి కారును బుక్​ చేసుకోవచ్చు. 2023 జనవరి నుంచి వాహనాల డెలివరీ ప్రారంభమవుతుంది(https://bydautoindia.com/byd-atto3)

బౌల్డర్​ గ్రే, పార్కౌర్​ రెడ్​, స్కై వైట్​, సర్ఫ్​ బ్లూ రంగుల్లో ఈ ఈవీ అందుబాటులో ఉంది.. ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, హ్యుందాయ్​ కోనాకు ఇది గట్టి పోటినిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

(3 / 7)

బౌల్డర్​ గ్రే, పార్కౌర్​ రెడ్​, స్కై వైట్​, సర్ఫ్​ బ్లూ రంగుల్లో ఈ ఈవీ అందుబాటులో ఉంది.. ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, హ్యుందాయ్​ కోనాకు ఇది గట్టి పోటినిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.(https://bydautoindia.com/byd-atto3)

ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇంటీరియర్​ యునీక్​గా కనిపిస్తోంది. డోర్​ మౌంటెడ్​ స్పీకరస్​, స్టైలిష్​ ఎయిర్​ కాన్​ వెంట్స్​, 12.8 ఇంచ్​ రొటేటింగ్​ సెంట్రల్​ స్క్రీన్​ ఉన్నాయి. స్క్రీన్​కు ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే సపోర్ట్​ లభిస్తుంది. అట్టో 3 ఈవీలో పానారోమిక్​ సన్​రూఫ్​, పవర్డ్​ టెయిల్​గేట్​, పవర్డ్​ ఫ్రెంట్​ డ్రైవర్​- ప్యాసింజర్​ సీట్లు ఉంటాయి.

(4 / 7)

ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇంటీరియర్​ యునీక్​గా కనిపిస్తోంది. డోర్​ మౌంటెడ్​ స్పీకరస్​, స్టైలిష్​ ఎయిర్​ కాన్​ వెంట్స్​, 12.8 ఇంచ్​ రొటేటింగ్​ సెంట్రల్​ స్క్రీన్​ ఉన్నాయి. స్క్రీన్​కు ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే సపోర్ట్​ లభిస్తుంది. అట్టో 3 ఈవీలో పానారోమిక్​ సన్​రూఫ్​, పవర్డ్​ టెయిల్​గేట్​, పవర్డ్​ ఫ్రెంట్​ డ్రైవర్​- ప్యాసింజర్​ సీట్లు ఉంటాయి.(https://bydautoindia.com/byd-atto3)

ఇందులో 60.48కేడబ్ల్యూహెచ్​ బ్లేడ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 521కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. టై2 7కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​తో 10 గంటల్లో ఛార్జింగ్​ పూర్తవుతుందని, 80కేడబ్ల్యూ డీసీ ఛార్జర్​తో 50 నిమిషాల్లో ఛార్జ్​ అయిపోతుందని అంటోంది

(5 / 7)

ఇందులో 60.48కేడబ్ల్యూహెచ్​ బ్లేడ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 521కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. టై2 7కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​తో 10 గంటల్లో ఛార్జింగ్​ పూర్తవుతుందని, 80కేడబ్ల్యూ డీసీ ఛార్జర్​తో 50 నిమిషాల్లో ఛార్జ్​ అయిపోతుందని అంటోంది(https://bydautoindia.com/byd-atto3)

ఈ బీవైడీ అట్టో 3లోని ఎలక్ట్రిక్​ మోటార్​.. 201హెచ్​పీ, 310 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఫలితంగా ఈ వాహనం.. 0-100 కి.మీల వేగాన్ని కేవలం 7.3సెకన్లలో అందుకుంటుంది!

(6 / 7)

ఈ బీవైడీ అట్టో 3లోని ఎలక్ట్రిక్​ మోటార్​.. 201హెచ్​పీ, 310 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఫలితంగా ఈ వాహనం.. 0-100 కి.మీల వేగాన్ని కేవలం 7.3సెకన్లలో అందుకుంటుంది!(https://bydautoindia.com/byd-atto3)

ఈ అట్టో 3 ఈవీ బ్యాటరీపై 8ఏళ్లు లేదా 1.6లక్షల కి.మీల ప్రయాణం వరకు వారెంటీని ఇస్తోంది బీవైడీ. ఎలక్ట్రిక్​ మోటార్​పై కూడా ఇదే తరహాలో వారెంటీని ఇస్తోంది. మొత్త వాహనానికి మాత్రం.. 6ఏళ్లు లేదా 1.5లక్షల కి.మీల ప్రయాణాన్ని వారెంటీగా ఇస్తోంది.

(7 / 7)

ఈ అట్టో 3 ఈవీ బ్యాటరీపై 8ఏళ్లు లేదా 1.6లక్షల కి.మీల ప్రయాణం వరకు వారెంటీని ఇస్తోంది బీవైడీ. ఎలక్ట్రిక్​ మోటార్​పై కూడా ఇదే తరహాలో వారెంటీని ఇస్తోంది. మొత్త వాహనానికి మాత్రం.. 6ఏళ్లు లేదా 1.5లక్షల కి.మీల ప్రయాణాన్ని వారెంటీగా ఇస్తోంది. (https://bydautoindia.com/byd-atto3)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు