Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. ఎప్పటినుంచంటే!-maruti suzuki to hike prices across models due to cost pressure ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Price Hike : మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. ఎప్పటినుంచంటే!

Maruti Suzuki price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. ఎప్పటినుంచంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 03, 2022 07:30 AM IST

Maruti Suzuki price hike : తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2023 జనవరి నుంచి వాహనాల ధరల్లో భారీ మార్పులు ఉండనున్నాయి!

మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. ఎప్పటినుంచంటే!
మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. ఎప్పటినుంచంటే! (REUTERS)

Maruti Suzuki price hike : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. వినియోగదారులకు మళ్లీ షాక్​ ఇచ్చింది! తమ కంపెనీకి చెందిన అన్ని మోడళ్ల ధరలను మరోమారు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ధరలు.. వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పులు లేవని, అందుకే వాహనాల ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది.

"ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీకి ఖర్చులు పెరిగాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ.. ధరల పెంపు భారాన్ని కస్టమర్లకు పంచక తప్పడం లేదు. 2023 జనవరి నుంచి మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరుగుతాయి. మోడల్​ బట్టి ధరల పెంపు ఆధారపడి ఉంటుంది," అని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది మారుతీ సుజుకీ.

Maruti Suzuki price hike news : ఈ ఏడాదిలో ఇప్పటికే అనేకమార్లు వాహనాల ధరలను పెంచింది మారుతీ సుజుకీ. టాటా మోటార్స్​, హ్యుందాయ్​, హోండా, ఎం అండ్​ ఎం, కియా వంటి సంస్థలు కూడా కార్ల ధరలను భారీగా పెంచేశాయి. ఉదాహరణకు.. కియా క్యారెన్స్​ ఎంపీవీ ధర రూ. 50వేలు పెరిగింది. క్రేటా, వెన్యూ, ఐ20 ధరలను గత సెప్టెంబర్​లోనే పెంచింది హ్యుందాయ్​. ఆ తర్వాత పండుగ సీజన్​ రావడంతో ధరల పెంపునకు కాస్త బ్రేక్​ పడింది. పండుగ సీజన్​ ముగిసిన వెంటనే.. బాదుడు మొదలైంది. వాహనాల ధరలను పెంచుతున్నట్టు గత నెలలోనే ప్రకటించేసింది టాటా మోటార్స్​. అంతేకాకుండా.. ఆడీ, మెర్సిడెస్​ బెంజ్​ వంటి లగ్జరీ కార్ల ధరలు కూడా మరింత పెరిగాయి.

ఇలా ధరలను పెంచుకుంటూ పోతే.. వాహనాల కొనుగోళ్ల జోరు తగ్గుతుందన్నది వాస్తవమే. కానీ.. అనేక సంస్థల ఆర్డర్​ బుక్​ శక్తివంతంగా ఉంది. ఎన్నో వాహనాలు ఇప్పటికీ వెయిటింగ్​ పీరియడ్​లోనే ఉన్నాయి. కొన్ని కార్లకు 2 నుంచి 18 నెలల వరకు వెయిటింగ్​ నడుస్తోంది. ధరలు పెంపు విషయం వీటిని ప్రభావితం చేస్తాయి.

కొనుగోళ్ల జోరు..

శంలో అక్టోబర్​తో పండుగ సీజన్​ ముగిసింది. కానీ ఆటో ఇండస్ట్రీకి మాత్రం ఇప్పటికీ పండుగ సీజన్​ కొనసాగుతోంది. నవంబర్​ కార్ల విక్రయాల డేటాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే.. విక్రయాల పరంగా ఆటో పరిశ్రమకు ఇదే ది బెస్ట్​ నవంబర్​గా నిలవడం విశేషం.

Maruti Suzuki November car sales data : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. నవంబర్​ నెల 1,39,306 వాహనాలను విక్రయించింది. 2021 నవంబర్​లో అది 1,17,791గా ఉంది. అంటే 18శాతం పెరిగినట్టు. బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్​ విటారాతో కూడిన యుటిలిటీ సెగ్మెంట్​లో 32,563 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇది 24,574గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం