Mahindra Thar 2WD launch : తక్కువ ధరతో మహీంద్రా థార్ కొత్త మోడల్.. లాంచ్ ఎప్పుడంటే!
Mahindra Thar 2WD launch : మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ మోడల్ త్వరలో లాంచ్ కానుందని సమాచారం. ఇది థార్‌లోనే చౌకైన మోడల్ అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Mahindra Thar 2WD launch : మహీంద్రా థార్ సరికొత్త మోడల్.. త్వరలో ఇండియా మార్కెట్లోకి రాబోతోంది! ఈ వెహికిల్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని డీలర్షిప్ యార్డ్‌లకు చేరుకుందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. థార్ మోడల్స్‌లో ఇదే చౌకైన వాహనంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ వాహనంలో 1.5లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. థార్‌కు చెందిన ఇతర మోడల్స్‌లో.. 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్స్ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Mahindra Thar 2WD price in India : మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టెమ్ ఉండకపోవచ్చు. ఇది టూ వీల్ డ్రైవ్ వర్షెన్‌లో వస్తోందని.. స్పై షాట్స్ సూచిస్తున్నాయి. ఎక్స్‌యూవీ300లో ఉపయోగించే ఇంజిన్నే మహీంద్రా థార్‌లో కూడా వాడుతున్నారు.!కాకపోతే.. ఇందులో ఆడ్బ్లూ ఫ్లూయిడ్‌ని కూడా వినియోగిస్తున్నారు. ఈ 1,497సీసీ 1.5లీటర్ డీజిల్ ఇంజిన్.. 3500 ఆర్పీఎం వద్ద 116బీహెచ్పీ పవర్‌ను, 1750-2500 ఆర్పీఎం వద్ద 300ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇతర మోడల్స్‌తో పోల్చుకుంటే.. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ పవర్ ఔట్పుట్ 15బీహెచ్పీ తగ్గింది. టార్క్ ఔట్పుట్ మాత్రం మారలేదు. ఇందులో 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఆటోమెటిక్ వర్షెన్‌ను ఇవ్వడం లేదు.
థార్ 4డబ్ల్యూడీతో పోల్చుకుంటే.. థార్ 2డబ్ల్యూడీ బరువు కూడా తక్కువగా ఉంటుంది. 4డబ్ల్యూడీ సిస్టెమ్ లేకపోవడం, ఇంజిన్ బరవు తగ్గడమే ఇందుకు కారణం. ఫలితంగా పర్ఫార్మెన్స్ పరంగా కొత్త మహీంద్రా థార్‌లో అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Mahindra Thar 2WD vs 4WD : ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా ఈ మహీంద్రా థార్ 22డబ్ల్యూడీని తీసుకొస్తున్నారు. ఇందులో ఆటో స్టార్ట్/ స్టాప్, లాక్/ అన్‌లాక్ బటన్లు ఉంటాయి. మిగిలిన ఫీచర్స్ అన్ని సేమ్ ఉండొచ్చు. లుక్స్ విషయంలోనూ.. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ.. థార్ 4డబ్ల్యూడీని పోలి ఉండొచ్చు. 4X4 బ్యాడ్జ్ మిస్ అవుతుంది. ఈ వెహికిల్ ధర, ఫీచర్స్‌తో పాటు పూర్తి వివరాలను ఆటో సంస్థ ప్రకటించాల్సి ఉంది.
మీడియా కథనాల ప్రకారం.. మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ 1.5లీటర్ డీజిల్, 2.0 టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు 2023 జనవరి రెండో భాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో లాంచ్ అవుతుంది మారుతీ సుజుకీ 5 డోర్ జిమ్నీకి ఈ మహీంద్రా థార్ 2డీడబ్ల్యూ గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ట్యాక్స్ కట్‌తో..
Mahindra Thar 2WD : మహీంద్రా థార్ ధర తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది. ఇటీవలే ముగిసిన జీఎస్టీ మండలి భేటీలో.. ఎస్యూవీ నిర్వచనాన్ని మార్చింది ప్రభుత్వం. ఫలితంగా ఈ మహీంద్రా థార్ ఎస్యూవీ సెగ్మెంట్ నుంచి బయటకొచ్చింది. ఈ క్రమంలోనే మహీంద్రా థార్‌పై ట్యాక్స్ తగ్గింది.
సంబంధిత కథనం