GST Council defines SUV: ఇవి ఉంటేనే అది SUV; ఆ వాహనాలపై మాత్రమే 50% పన్ను-what is suv gst council sets criteria to define it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst Council Defines Suv: ఇవి ఉంటేనే అది Suv; ఆ వాహనాలపై మాత్రమే 50% పన్ను

GST Council defines SUV: ఇవి ఉంటేనే అది SUV; ఆ వాహనాలపై మాత్రమే 50% పన్ను

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 10:59 PM IST

GST Council meet: ఈ సమావేశంలో జీఎస్టీ విధింపునకు సంబంధించి పలు నిర్ణయాలను తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

GST Council meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ (sports utility vehicles - SUV) లపై విధించే పన్నుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

SUV నిర్వచనం

ఈ GST Council సమావేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ (sports utility vehicles - SUV)ని నిర్వచించారు. ఏ పేరామీటర్లు ఉంటే ఆ వాహనాన్ని ఎస్ యూవీగా పరిగణించాలో నిర్ధారించారు. ఆ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సమానంగా పన్ను విధించాలని సూచించారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా SUVలపై పన్ను వసూలు చేస్తున్నారు. దాంతో కార్ల ఉత్పత్తి దారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ ను తొలగించడానికి శనివారం జరిగిన GST Council సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంశాల ఆధారంగా sports utility vehicles - SUV ని నిర్వచించారు.

ఈ నాలుగు ఉంటేనే.. అది SUV, వాటికే 50% పన్ను

ఒక వాహనాన్ని ఎస్ యూవీ(SUV)గా నిర్ధారించడానికి కచ్చితంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని GST Council సమావేశంలో నిర్ణయించారు. అవి

  • 1) అది SUV గా పాపులర్ అయి ఉండాలి.
  • 2) ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీకి మించి ఉండాలి.
  • 3) గ్రౌండ్ క్లియరెన్స్ కనీసం 170 మిమీ లు ఉండాలి.
  • 4) వాహనం పొడవు 4000 మిమీల కన్నా ఎక్కువ ఉండాలి.

ఈ పేరామీటర్లన్నీ ఉన్న వాహనాలను మాత్రమే SUV లుగా పరిగణించాలని GST Council స్పష్టం చేసింది. ఈ వాహనాలపై 28% జీఎస్టీ(GST), 22% కంపెన్సేషన్ సెస్(compensation cess), మొత్తంగా 50% పన్ను విధించాలని ఆదేశించింది. ఈ పేరామీటర్లు లేని వాహనాలపై 22% కన్నా తక్కువ కంపెన్సేషన్ సెస్ విధించాలని స్పష్టం చేసింది.

MUVs లు ఏ కేటగిరీలో..

జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో కొన్ని రాష్ట్రాలు మరో అంశాన్ని లేవనెత్తాయి. సెడాన్ వాహనాలకు ఏ కేటగిరీ కింద పన్ను విధించాలో స్పష్టత ఇవ్వాలని కోరాయి. దీనిపై నిర్మల సీతారామన్ స్పందిస్తూ, ఎంవీయూ (multi utility vehicles -MUV) వాహనాలకు సంబంధించి పేరామీటర్లను త్వరలో నిర్ధారిస్తామని తెలిపారు.

Whats_app_banner