Volkswagen exchange carnival : వోక్స్వ్యాగన్ ఎక్స్ఛేంజ్ కార్నివాల్ షురూ..!
Volkswagen India exchange carnival : ఎక్స్ఛేంజ్ కార్నివాల్‌తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది వోక్స్వ్యాగన్ ఇండియా. వీటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.
Volkswagen India exchange carnival : న్యూ ఇయర్ నుంచి వాహనాల ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్న ఆటో సంస్థలు.. ఇయర్ ఎండింగ్లో మాత్రం కస్టమర్లను ఆకర్షించే విధంగా డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. వోక్స్వ్యాగన్ ఇండియా అయితే.. ఏకంగా 'ఏక్స్ఛేంజ్ కార్నివాల్'నే మొదలుపెట్టేసింది. వోక్స్వ్యాగన్ ఇండియా ఎక్స్ఛేంజ్ కార్నివాల్‌తో కస్టమర్లకు ఏ విధంగా లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాము.
ఎక్స్ఛేంజ్ కార్నివాల్..
శుక్రవారం ప్రారంభమైన ఈ వోక్స్వ్యాగన్ ఇండియా ఎక్స్ఛేంజ్ కార్నివాల్.. ఆదివారం వరకు కొనసాగుతుంది. ప్యాన్ ఇండియా రేంజ్లో దేశవ్యాప్తంగా 157 సేల్స్ టచ్ పాయింట్స్‌లో ఈ ఎక్స్ఛేంజ్ కార్నివాల్‌ను ఏర్పాటు చేసింది ఈ ఆటో సంస్థ. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు తమ సంస్థ కారును కొనుగోలు చేయాలని భావిస్తున్న వారందరినీ ఈ ఎక్స్ఛేంజ్ కార్నివాల్‌కు ఆహ్వానించింది వోక్స్వ్యాగన్ ఇండియా. టైగన్, వర్టూస్, టిగువాన్ వంటి బెస్ట్ సెల్లర్ వాహనాల టెస్ట్ డ్రైవ్‌ను ప్రొవైడ్ చేస్తోంది. అంతేకాకుండా.. ఇయర్ ఎండ్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ వెహికిల్ హోం ఇవాల్యువేషన్, ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలను కస్టమర్లకు ఇస్తోంది ఈ సంస్థ. పూర్తి వివరాల కోసం సమీప వోక్స్వ్యాగన్ డీలర్షిప్ షోరూంకు వెళ్లాల్సి ఉంటుంది.
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్..
Volkswagen exchange carnival : వోక్స్వ్యాగన్ సంస్థ.. టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 33.50లక్షలుగా ఉంది. ప్యూర్ వైట్, ఆక్సీ వైట్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంది. టిగువాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసి ఏడాది ముగిసిన సందర్భంగా ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది వోక్స్వ్యాగన్ సంస్థ. ఇందుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.
టిగువాన్‌తో పోల్చుకుంటే.. టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో సెబ్రింగ్ 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. వీల్స్ మధ్యలో ఉన్న 'వీడబ్ల్యూ' లోగో డైనమిక్‌గా కనిపిస్తుంది. రేర్ లోడ్ సిల్ ప్రొటెక్షన్‌తో పాటు బీ- పిల్లర్ మీద ఎక్స్‌క్లూజివ్ అనే బ్యాడ్జ్ కూడా వస్తుంది. సాధారణంగా.. టిగువాన్‌లో ఏడు రంగులు ఉంటాయి. కానీ టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌కు కేవలం రెండు ఆప్షన్స్(పర్ల్ వైట్, ఓరిక్స్ వైట్)నే ఇచ్చింది వోక్స్వ్యాగన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సేఫ్టీ టెస్ట్..
Volkswagen crash test results : ఈ నెలలో మేడ్ ఇన్ ఇండియా వోక్స్వ్యాగన్ వర్టూస్ సేఫ్టీ టెస్ట్ జరిగింది. ఈ 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్సీ వాహనం.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 92.35శాతం స్కోరు నమోదు చేసింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 91.84శాతం స్కోరు నమోదు చేసింది. ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్, విప్లాష్, పెడిస్ట్రియన్ ప్రొటెక్షన్, ఆటోనోమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిటీ అండ్ ఇటర్అర్బన్, ఈఎస్సీ వంటి అంశాల్లోనూ టెస్టింగ్ జరిగింది. వీటి ఫలితాలు మెరుగ్గానే వచ్చాయి.
సంబంధిత కథనం