Top Cars Launched In 2022 : రూ. 10లక్షలలోపు ధరతో.. ఈ ఏడాది లాంచ్ అయిన టాప్ కార్స్ ఇవే!
Top Cars Launched In 2022 : ఈ ఏడాది బడ్జెట్ కార్స్‌కు మంచి డిమాండ్ కనిపించింది. ఈ క్రమంలో రూ. 10లక్షలలోపు ధరతో ఈ ఏడాది లాంచ్ అయిన టాప్ కార్స్‌ను ఓసారి చూద్దాం..
Top Cars Launched In 2022 under ₹10lakhs : ఆటో పరిశ్రమకు 2022 కలిసివచ్చిందనే చెప్పుకోవాలి! కొత్త కొత్త లాంచ్‌లు, కస్టమర్ల తాకిడితో షోరూమ్‌లు కళకళలాడిపోయాయి. ముఖ్యంగా పండుగ సీజన్లో డిమాండ్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా.. బడ్జెట్లో వచ్చిన లేటెస్ట్ లాంచ్‌లపై కస్టమర్లు ఈ ఏడాది ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి 2022 ముగింపు దశకు చేరుకోవడంతో.. రూ. 10లక్షలలోపు ధరతో ఈ ఏడాది లాంచ్ అయిన టాప్ కార్స్‌పై ఓ లుక్కేద్దాం..
మారుతీ బలెనో ఫేస్‌లిఫ్ట్..
Maruti Baleno Facelift price : మారుతీ బలెనో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 23న లాంచ్ అయ్యింది. ఇందులో 1.2లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్/ ఆటోమెటిక్ వేరియంట్స్‌లో ఈ మారుతీ బలెనో ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉంది. ఇది 90పీఎస్ పవర్‌ను, 113ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వెహికిల్ ధర రూ. 6.49లక్షలు- రూ. 9.71లక్షల మధ్యలో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టయోటా గ్లాన్జా ఫేస్‌లిఫ్ట్..
Toyota Glanza Facelift : టయోటా గ్లాన్జా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఈ ఏడాది మార్చ్ 15న లాంచ్ అయ్యింది. ఇందులో 1.2లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ టయోటా గ్లాన్జా ఫేస్‌లిఫ్ట్.. మారుతీ బలెనో ఫేస్‌లిఫ్ట్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ను పోలి ఉంటుంది. ధర రూ. 6.59లక్షలు- రూ. 9.99లక్షల మధ్యలో ఉంటుంది.
హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్..
Hyundai Venue Facelift price : హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ జూన్ 16న లాంచ్ అయ్యింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1లీటర్ టర్బో పెట్రోల్, 1.5లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.2పెట్రోల్ ఇంజిన్‌లో 5 స్పీడ్ మేన్యువల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లో 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంటాయి. కాగా.. 1లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రం 6 స్పీడ్ ఐఎంటీ/ 7స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉన్నాయి. ధర రూ. 5.73లక్షలు- రూ. 12.72లక్షల మధ్యలో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మారుతీ బ్రెజా..
Maruti Brezza new model : మారుతీ బ్రెజా న్యూ మోడల్ జూన్ 30న లాంచ్ అయ్యింది. ఇందులో 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంది. 5స్పీడ్ మేన్యువల్/ సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి. 103పీఎస్ పవర్, 137ఎన్ఎం టార్క్‌ను ఇది జనరేట్ చేస్తుంది. ధర రూ. 7.99లక్షలు- రూ. 13.96లక్షల మధ్యలో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిట్రోయెన్ సీ3..
Citroen C3 price Hyderabad : ఇండియా మార్కెట్లో సిట్రోయెన్ సీ3 జులై 20న లాంచ్ అయ్యింది. ఇందులో 1.2లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్(5స్పీడ్ మేన్యువల్), 1.2లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్(6స్పీడ్ మేన్యువల్) ఉన్నాయి. మొదటిది.. 82పీఎస్ పవర్, 115ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండో ఇంజిన్ 110పీఎస్ పవర్, 190ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ధర రూ. 5.88లక్షలు- రూ. 8.15లక్షల మధ్యలో ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మారుతీ ఆల్టో కే10..
Maruti Alto K10 price: మారుతీ ఆల్టో కే10 ఈ ఏడాది ఆగస్టు 18న లాంచ్ అయ్యింది. ఇందులో 1 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5స్పీడ్ మేన్యువల్/ 5స్పీడ్ ఆటోమెటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇది 67పీఎస్ పవర్‌ను, 89ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ధర రూ. 3.99లక్షలు- రూ. 5.95లక్షల మధ్యలో ఉంటుంది.
టాటా టియాగో ఈవీ..
Tata Tiago EV range : ఈ ఏడాది సెప్టెంబర్ 28న లాంచ్ అయిన టాటా టియాగో ఈవీలో 19.2కేడబ్ల్యూహెచ్, 24కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. మొదటి బ్యాటరీ రేంజ్ 250కీ.మీ.. రెండోది 315కీ.మీగా ఉంది. ధర రూ. 8.49లక్షలు- రూ. 11.79లక్షల మధ్యలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* పైన చెప్పినవి అన్నీ ఎక్స్‌షోరూం ధరలే.
సంబంధిత కథనం