Maruti Suzuki Grand Vitara : మార్కెట్​లోకి గ్రాండ్​ విటారా- ధర ఎంతంటే..!-maruti suzuki grand vitara released check price and other details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maruti Suzuki Grand Vitara : మార్కెట్​లోకి గ్రాండ్​ విటారా- ధర ఎంతంటే..!

Maruti Suzuki Grand Vitara : మార్కెట్​లోకి గ్రాండ్​ విటారా- ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu
Sep 26, 2022 03:02 PM IST

Maruti Suzuki Grand Vitara : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా వేరియంట్స్​, ధరల వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు, ఫీచర్స్​ కోసం ఇక్కడ చూడండి.

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా
మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా (AFP)

Maruti Suzuki Grand Vitara : దేశీయ మార్కెట్​లోకి అడుగుపెట్టింది మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా. నెక్సా నుంచి వస్తున్న ఈ మోడల్​ ధరను మారుతీ సుజుకీ ఎట్టకేలకు ప్రకటించింది. మిడ్​ సైజ్​ ఎస్​యూవీగా ఉన్న ఈ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా బేస్​ వేరియంట్​ ధర రూ. 10.45లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉంది.

Maruti Suzuki Grand Vitara price : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాకు చెందిన వివిధ మోడల్స్​, వాటి ధరలను ఇక్కడ తెలుసుకోండి:

<p>మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ధర వివరాలు..</p>
మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ధర వివరాలు.. (Mint)

Maruti Suzuki Grand Vitara features : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఫీచర్స్​..

ఈ ఎస్​యూవీ ఎక్స్​టీరియర్​ డిజైన్​.. డైనమిక్​గా, అగ్రెసివ్​గా కనిపిస్తుంది. ఇంటీరియర్​ కూడా సొఫెస్టికేటెడ్​గా ఉంటుంది. ఈ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా లోపల సాంకేతికతతో కూడిన సెఫ్టీ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. 'కే' సిరీస్​ 1.5 లీటర్​ డ్యూయెల్​ జెట్​, డ్యూయెల్​ వీవీటీ ఇంజిన్​ ఇందులో ఉంది. లీటరుకు 21.11కి.మీల మైలేజ్​ ఇస్తుందని తెలుస్తోంది. ఇందులో 5 స్పీడ్​ మ్యాన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లు ఉన్నాయి. ఇక స్మార్ట్​ హైబ్రీడ్​ వేరియంట్​లో డ్యుయెల్​ బ్యాటరీ సెటప్​, బ్రేక్​ ఎనర్జీ రీజెనరేషన్​ లభిస్తుంది.

మొత్తం మీద మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ధర రూ. 10.45లక్షల నుంచి రూ. 17.05లక్షల మధ్యలో ఉంది.

Maruti Suzuki Grand Vitara : అడ్వాన్స్​డ్​ గ్రాంట్​ విటారా ఇంటెలిజెంట్​ ఎలక్ట్రిక్​ హైబ్రిడ్​లో 1.5లీటర్​ ఇంజిన్​ ఉంటుంది. ఈవీ, ఎకో, పవర్​, నార్మల్​ డ్రైవ్​ మోడ్స్​ ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రిక్​ హైబ్రీడ్​ మీద 8ఏళ్లు లేదా 1,60,000కి.మీల వారెంటీ లభిస్తుంది. ఈ-సీవీటీ ట్రాన్స్​మీషన్​తో లీటరుకు 27.97కి.మీల మైలేజీ లభించే అవకాశం ఉండటం విశేషం.

<p>మారతీ సుజుకీ గ్రాండ్​ విటారా</p>
మారతీ సుజుకీ గ్రాండ్​ విటారా

మారుతీ గ్రాండ్​ విటారా ఇంటెలిజెంట్​ ఎలక్ట్రిక్​ హైబ్రీడ్​లో జెటా+, ఆల్ఫా+ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర రూ. 17.99లక్షలు- రూ. 19.65లక్షలుగా ఉన్నాయి.

హెడ్స్​-అప్​ డిస్​ప్లే, 360డిగ్రీ పార్కింగ్​ కెమెరా సిస్టెమ్​, వెంటిలేటెడ్​ సీట్స్​.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాలోని కొన్ని ఫీచర్స్​. ఇందులో ఆల్​గ్రిప్​ సెలక్ట్​ టెక్నాలజీ ఉండటం విశేషం.

Maruti Suzuki Grand Vitara Colour variants : ఇక సెఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాలో 6ఎయిర్​బ్యాగ్​లు, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రొగ్రామ్​, హిల్​ హోల్డ్​ అసిస్ట్​, 3 పాయింట్​ ఈఎల్​ఆర్​ సీట్​ బెల్ట్​, ఏబీఎస్​+ ఈబీడీతో కూడిన ఫ్రంట్​ అండ్​ రేర్​ డిస్క్​ బ్రేక్స్​, హిల్​ డీసెంట్​ కంట్రోల్​, టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టమ్​లు ఉన్నాయి.

<p>మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా&nbsp;</p>
మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా&nbsp;

మొత్తం మీద మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా.. 3 డ్యూయెల్​ టోన్​, 6 మోనోట్​ కలర్​ ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో నెక్సా బ్లూ కలర్​ కూడా ఉంది.

సంబంధిత కథనం