Maruti Suzuki Q3 results : క్యూ3లో దూసుకెళ్లిన మారుతీ సుజుకీ.. రెండింతల లాభం నమోదు!
Maruti Suzuki Q3 results : ఎఫ్వై2023 క్యూ3లో మారుతీ సుజుకీ దుమ్మురేపింది. సంస్థ నెట్ ప్రాఫిట్ రెండింతలు వృద్ధిచెందింది.
Maruti Suzuki Q3 results : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. 2022-23 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. మారుతీ సుజుకీ క్యూ3 ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి! ప్యాసింజర్ కార్స్ సెగ్మెంట్లో మంచి డిమాండ్ కనిపిస్తుండటం ఇందుకు కారణం.
లాభం రెండింతలు..!
క్యూ3లో మారుతీ సుజుకీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ. 2,315కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే (రూ. 1,011కోట్లు) అది రెండింతలు ఎక్కువ! సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 1,881కోట్లుగా నమోదవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.
Maruti Suzuki Q3 results 2023 : ఇక దిగ్గజ ఆటో సంస్థ రెవెన్యూ కూడా 25శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ రూ. 23,246కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం అది రూ. 29,044కోట్లుగా నమోదైంది. సంస్థ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ. 2,123కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 919కోట్లుగా ఉండేది.
క్యూ3లో మొత్తం 4,65,911 వాహనాలను విక్రయించింది మారుతీ సుజుకీ. వీటిల్లో 4,03,929 యూనిట్లను దేశీయంగాను, 61,982 యూనిట్లను విదేశాల్లో సేల్ చేసింది. గతేడాది ఇదే త్రైమసికంలో 4,30,668 యూనిట్లను సేల్ చేసింది. ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ కొరత కారణంగా మరో 46వేలకుపైగా వాహనాలను డెలివరీ చేయలకేపోయింది.
Maruti Suzuki results : 2022 క్యాలెండర్ ఇయర్లో సంస్థ చరిత్రలోనే అత్యధిక సేల్స్ చేసినట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. ఇండియాలో 19,40,067 యూనిట్లను విక్రయించగా.. విదేశాలకు 2,63,068 వాహనాలను ఎగుమతి చేసింది.
మారుతీ సుజుకీ షేర్ ప్రైజ్..
Maruti Suzuki share price : అంచనాలకు మించి ఫలితాలు వెలువడటంతో మారుతీ సుజుకీ షేర్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతీ సుజుకీ స్టాక్.. ప్రస్తుతం దాదాపు 3శాతం లాభంతో 8,618 వద్ద ఉంది.
గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో మారుతీ సుజుకీ షేర్ ధర 2శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.89శాతం వృద్ధిని నమోదు చేసింది. నెల రోజుల్లో 4.71శాతం వృద్ధి చెందింది. ఏడాదిలో ఏకంగా 7.4శాతం పెరిగింది.
వాహనాల ధరలు పెంపు..
Maruti Suzuki price hike : మరోవైపు తమ వాహనాల ధరలను ఇటీవలే పెంచింది మారుతీ సుజుకీ. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చాయి. మోడల్‌పై వేరియంట్‌కు తగ్గట్టు ధరలను గరిష్ఠంగా 1.1శాతం పెంచింది. పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం