Reliance Retail Q3 results: రిలయన్స్ రిటైల్ Q3 ఫలితాలు-reliance retail profit up 6 2 acquires centro footwear ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Retail Q3 Results: రిలయన్స్ రిటైల్ Q3 ఫలితాలు

Reliance Retail Q3 results: రిలయన్స్ రిటైల్ Q3 ఫలితాలు

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 09:32 PM IST

Reliance Retail Q3 results: రిలయన్స్ గ్రూప్ లోని రిలయన్స్ రిటైల్ (Reliance Retail) Q3 ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ (Reliance Retail) ఆదాయం ఈ Q3లో రూ. 60,096 కోట్లకు చేరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

Reliance Retail Q3 results: గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3)తో పోలిస్తే, ఈ Q3లో రిలయన్స్ రిటైల్ ఆదాయం 18.6% పెరిగి, రూ. 60,096 కోట్లకు చేరింది. అలాగే, సంస్థ నికర లాభాలు ఈ Q3 లో రూ. 2,400 కోట్లకు చేరాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరం Q3తో పోలిస్తే, 6.2% ఎక్కువ.

Reliance Retail Q3 results: నెట్ వర్క్ విస్తృతి

రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ఈ సంవత్సరం భారీగా విస్తరించింది. కొత్తగా 789 స్టోర్లను ప్రారంభించారు. మౌలిక వసతులపై పెట్టుబడులను పెంచింది. సంస్థ వేర్ హౌజ్ కెపాసిటీ 22 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య కూడా 4.18 లక్షలకు చేరింది.

Reliance Retail Q3 results: ఈ కామర్స్ లో వృద్ధి

అలాగే, డిజిటల్ కామర్స్ విభాగంలోనూ గణనీయ వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం Q3తో పోలిస్తే, ఈ సంవత్సరం ఈ విభాగంలో 38% వృద్ధి నమోదైంది. రిలయన్స్ రిటైల్ (Reliance Retail) లో ఎలక్ట్రానిక్స్, ఫుట్ వేర్, గ్రోసరీ, అపారెల్ మొదలైన ఉప విభాగాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3) లో దక్షిణ భారత దేశంలో పాపులర్ అయిన సెంట్రో ఫుట్ వేర్ (Centro Footwear) ను రిలయన్స్ రిటైల్ (Reliance Retail) సొంతం చేసుకుంది. అలాగే, జర్మన్ మేజర్ రిటైలర్ మెట్రో ఏజీ(Metro AG) భారతీయ విభాగాన్ని కూడా కైవసం చేసుకుంది. మెట్రో ఏజీకి భారత్ లో 31 స్టోర్స్ ఉన్నాయి. అలాగే, జియో మార్ట్ (JioMart) నాన్ గ్రోసరీ విభాగంలో మంచి వృద్ధి కనబర్చింది. ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో (Ajio) కస్టమర్ బేస్ 33% పెరిగింది. గ్రోసరీ బిజినెస్ లో ఉన్న రిలయన్స్ స్మార్ట్ (Reliance Smart) ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3) లో, గత ఆర్థిక సంవత్సరం Q3 కన్నా 65% పెరిగింది.

Whats_app_banner