Electric Vehecles sales: ఎలక్ట్రిక్ వాహనాలదేనా భవిష్యత్తు?
Electric Vehecles sales: ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. క్రమంగా పెరుగుతున్న విద్యుత్ వాహనాల అమ్మకాలే అందుకు సాక్ష్యం.
Electric Vehecles sales: విద్యుత్ వాహనాల (Electric Vehecles sales) అమ్మకాలు 2022లో గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం వాహనాల అమ్మకాల్లో 10% విద్యుత్ వాహనాల (Electric Vehecles) అమ్మకాలే ఉన్నాయి. విద్యుత్ వాహనాలు (Electric Vehecles) 10% అనే మైలురాయికి చేరడం ఇదే ప్రథమం.
Electric Vehecles sales: చైనాలో ప్రతీ నాలుగు వాహనాల్లో ఒకటి ఈవీ
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, చైనా, యూరోప్ దేశాల్లో విద్యుత్ వాహనాల (Electric Vehecles) అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోనూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (fully electric vehicles) అమ్మకాలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 78 లక్షలకు పెరిగింది. ఇది గత సంవత్సరం కన్నా 68% అధికం. రానున్న సంవత్సరాలలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు విద్యుత్ వాహనాల (Electric Vehecles) అమ్మకాలు పెరగడంతో పాటు, మరోవైపు,పెట్రోల్, డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గడం కూడా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం చైనాలో అమ్ముడైన ప్రతీ నాలుగు వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వెహికిల్ (Electric Vehecles). ఈ సంవత్సరం అమ్ముడయ్యే ప్రతీ మూడు వాహనాల్లో ఒకటి విద్యుత్ వాహనమవుతుందని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి సంప్రదాయ వాహన సేల్స్ ను ఎలక్ట్రిక్ వాహన (Electric Vehecles) సేల్స్ దాటేస్తాయని భావిస్తున్నారు.
Electric Vehecles sales: యూరోప్ లోనూ..
యూరోప్ లో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాల (fully electric vehicles) షేరు 11 శాతానికి పెరిగింది. చైనాలో ఇది 19%. హైబ్రిడ్ వాహనాలను కూడా కలిపితే ఆ షేరు యూరోప్ లో 20.3 శాతానికి పెరుగుతుంది. చైనా, యూరోప్ లతో పోలిస్తే, అమెరికా ఈ విషయంలో వెనుకబడింది. కానీ, అమెరికాలోనూ గత సంవత్సరం 8,07,180 పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలు (Fully Electric Vehecles) అమ్ముడయ్యాయి. ఇది మొత్తం వాహనాల అమ్మకాల్లో 5.8%. 2021లో ఇది 3.2% మాత్రమే. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ఇప్పటికీ టెస్లా (Tesla) నే నెంబర్ వన్. మోటారు వాహనాల ఉత్పత్తిలో పేరు గాంచిన జర్మనీలో 2022లో ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో విద్యుత్ వాహనాల వాటా 25%. 2022 డిసెంబర్ నెలలో ఇక్కడ సంప్రదాయ ఇంధన వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి.
Electric Vehecles sales: తగ్గిన అమ్మకాలు
మొత్తంగా చూస్తే, గత సంవత్సరం వాహనాల అమ్మకాలు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 1% తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 8 కోట్ల 6 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. వాహనాల అమ్మకాలు, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, అమెరికాలో 8%, యూరోప్ లో 7% తగ్గాయి. ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన ధరలు పెరగడం, ఆర్థిక మాంద్యం తదితర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వాహనాల సేల్స్ తగ్గాయి.