తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti Suzuki eVX electric car: 2025లో మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉంటుందంటే..!: ఫొటోలు
- Maruti Suzuki eVX electric car: ప్రముఖ సంస్థ మారుతీ సుజుకీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు 2025లో లాంచ్ కానుంది. ఈవీఎక్స్ (eVX) పేరిట రూపొందించనున్న ఈ కారు కాన్సెప్ట్‌ను ఇటీవల ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) ఈవెంట్‍లో మారుతీ సుజుకీ ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్‌కు సంబంధించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.

(1 / 6)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను మారుతీ సుజుకీ ప్రపంచానికి పరిచయం చేసింది. దీని తర్వాత తీసుకొచ్చే ఎలక్ట్రిక్ కార్లు కూడా ఈ కారు టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటాయి. (HT Auto)
(2 / 6)
పూర్తిగా కొత్త ప్లాట్‍ఫామ్‍పై eVX ఎలక్ట్రిక్ కారును మారుతీ సుజుకీ రూపొందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ కూడా అదిరిపోయేలా ఉంది.(HT Auto)
(3 / 6)
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కిలోవాట్ హవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‍తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది.(HT Auto)
(4 / 6)
ప్రస్తుతం eVX electric car కాన్సెప్ట్‌ను మాత్రమే మారుతీ సుజుకీ ప్రదర్శించింది. 2025లో కారును లాంచ్ చేయనుంది. ఆలోగా తయారీలో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. (HT Auto)
(5 / 6)
22025లో మార్కెట్‍లోకి తన తొలి ఎలక్ట్రిక్ కారు eVXను తీసుకురావాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(HT Auto)
ఇతర గ్యాలరీలు