Maruti Alto K10 Xtra Edition : ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ వచ్చేస్తోంది..!-maruti suzuki alto k10 xtra edition revealed check major updates and price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Alto K10 Xtra Edition : ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ వచ్చేస్తోంది..!

Maruti Alto K10 Xtra Edition : ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ వచ్చేస్తోంది..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 29, 2023 08:00 AM IST

Maruti Suzuki Alto K10 Xtra Edition : ఆల్టో కే10కు ఎక్స్​ట్రా ఎడిషన్​ను తీసుకొచ్చింది మారుతీ సుజుకీ. ఈ వెహికిల్​ను ఇటీవలే ఆవిష్కరించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ వచ్చేసింది..!
ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ వచ్చేసింది..! (HT AUTO)

Maruti Suzuki Alto K10 Xtra Edition : మరో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​కు 'ఎక్స్​ట్రా ఎడిషన్​' తీసుకొచ్చింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ! ఈ మేరకు.. మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ను ఆవిష్కరించింది. సాధారణ మోడల్​తో పోల్చుకుంటే.. కాస్మొటిక్​పరంగా ఇందులో మంచి అప్డేట్స్​ వచ్చాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​..

మారుతీ సుజుకీకి.. వన్​ అఫ్​ ది బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది 'ఆల్టో. 2000లో లాంచ్​ అయినప్పటి నుంచి 43లక్షలకుపైగా యూనిట్​లు అమ్ముడుపోయాయి. ఈ హ్యాచ్​బ్యాక్​కు ఇప్పటికీ మంచి డిమాండ్​ కనిపిస్తుండటంతో.. దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్​ చేస్తుంది మారుతీ సుజుకీ. గతేడాదే.. మారుతీ సుజుకీ ఆల్టో కే10 అప్డేట్​ అయ్యింది. కొద్దిగా స్టైల్​ మారడంతో పాటు డ్యూయెల్​జెట్​ కే-సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ కూడా వచ్చింది.

Maruti Suzuki Alto K10 extra Edition features : ఇక ఇప్పుడు.. మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ను ఆవిష్కరించారు. ఇది త్వరలోనే ఇండియా మార్కెట్​లో లాంచ్​ అవ్వొచ్చు.

మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​- ఫీచర్స్​..

మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​లో బానొట్​ మస్క్యులర్​ లుక్​ను ఇస్తోంది. హెక్సాగొనల్​ హానీకూంబ్​ మెష్​ గ్రిల్​, స్వెప్ట్​బ్యాక్​ హాలోజెన్​ హెడ్​ల్యాంప్స్​, బ్లాక్​డ్​-ఔట్​ స్కిట్​ ప్లేట్స్​ హైలైట్​గా నిలుస్తున్నాయి. బంపర్​ మోంటెడ్​ ఫాగ్​ ల్యాంప్స్​ కూడా లభిస్తుండటం విశేషం.

ఆరెంజ్​ కలర్డ్​ ఓఆర్​వీఎం, బాడీ కలర్డ్​ డోర్​ హ్యాండిల్స్​, స్టీల్​ వీల్స్​, వ్రాప్​ అరౌండ్​ టెయిల్​గేట్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​ వంటివి ఈ వెహికిల్​ రేర్​ ఎండ్​లో లభిస్తున్నాయి.

Maruti Suzuki S- Presso Xtra edition పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక సరికొత్త మారుతీ సుజుకీ ఆల్టో కే10లో 5 సీటర్​ క్యాబిన్​ స్పేషియెస్​గా కనిపిస్తోంది. డాష్​బోర్డ్​ డిజైన్​ను లైట్​గా మార్చారు. డ్యూయెల్​-టోన్​ ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, పవర్​ విండోస్​, మేన్యువల్​ ఏసీ, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, 7 ఇంచ్​ స్మార్ట్​ప్లే ప్రో ఇన్​ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ వంటి ఫీచర్స్​ లభిస్తున్నాయి.

డ్యూయెల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏబీఎస్​తో పాటు మరిన్ని సేఫ్టీ ఫీచర్స్​ ఈ వెహికిల్​లో ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​- ఇంజిన్​.. ధర..

Maruti Suzuki Alto K10 Xtra Edition price : మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​లో 1.0 లీటర్​ కే10సీ, డ్యూయెల్​జెట్​, డ్యూయెల్​ వీవీటీ, కే-సిరీస్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటాయి. 5 స్పీడ్​ మెన్యువల్​ గేర్​బాక్స్​ దీని సొంతం. ఇది 67 హెచ్​పీ పవర్​ను, 89ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఇక మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. లాంచ్​ డేట్​తో పాటు ధర వివరాలను ఆటో సంస్థ ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఈ మోడల్​.. ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 3.99లక్షలుగా ఉంటుందని మార్కట్​లో అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner