Maruti Suzuki Fronx bookings : ఫ్రాంక్స్, జీమ్నీ- కొత్త ఎస్‌యూవీలతో మారుతీ సుజుకీ హిట్ కొట్టిందా?
Maruti Suzuki Fronx booking : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, జిమ్నీ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. వీటి బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
Maruti Suzuki Fronx booking : ఎస్యూవీ సెగ్మెంట్లో తన బలాన్ని పెంచుకునేందుకు గత కొంతకాలంగా కృషిచేస్తోంది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ. శ్రమకు తగిన ఫలితం లభిస్తున్నట్టు కనిపిస్తోంది! ఆ సంస్థ ఇటీవలే ఆవిష్కరించిన మారుతీ ఫ్రాంక్స్, మారుతీ జిమ్నీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. బుకింగ్స్ పరంగా ఈ రెండు వాహనాలు దూసుకెళుతుండటం విశేషం.
ఎస్యూవీ సెగ్మెంట్ హిట్..!
బ్రెజా, గ్రాండ్ విటారా వంటి ఎస్యూవీ మోడల్స్‌ను ఇప్పటికే విక్రయిస్తోంది మారుతీ సుజుకీ. కాగా.. ఆటో ఎక్స్పో 2023లో ఫ్రాంక్స్, జిమ్నీ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మారుతీ సుజుకీ జిమ్నీకి 11వేలకుపైగా బుకింగ్స్ వచ్చాయి. రోజుకు సుమారు 1000 బుకింగ్స్ లభిస్తున్నట్టు సంస్థ చెప్పింది. ఇక మారుతీ ఫ్రాంక్స్‌ను దాదాపు 4వేల మంది ఇప్పటికే బుక్ చేసుకున్నట్టు స్పష్టం చేసింది.
Maruti Suzuki Jimny price : "జిమ్నీ, ఫ్రాంక్స్‌కు గొప్ప డిమాండ్ కనిపిస్తోంది. రోజుకు 1000 వరకు జిమ్మీకి బుకింగ్స్ వస్తున్నాయి. జిమ్మీ బుకింగ్స్ సంఖ్య 11వేలు దాటింది," అని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు.
డిమాండ్‌తో పాటు వెయిటింగ్ పీరియడ్ కూడా!
మారుతీ జమ్నీ, మారుతీ ఫ్రాంక్స్లు ఈ ఏడాదిలో లాంచ్కానున్నాయి. అయితే.. ఇప్పటికే మారుతీ సుజుకీ ఆర్డర్ బుక్‌లో చాలా కార్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక కొత్త ఎస్‌యూవీలకు లభిస్తున్న డిమాండ్‌తో 'పెండింగ్' ఇంకా ఎక్కువగా పెరగనుంది. ఫలితంగా పలు వాహనాల వెయిటింగ్ పీరియడ్ ఇంక పెరగొచ్చు!
Maruti Suzuki Fronx price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్, 5 వేరియంట్లు ఉంటాయి. 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్.. 6000 ఆర్పీఎం వద్ద 88 బీహెచ్పీ పవర్‌ను, 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్/ 5 స్పీడ్ ఏఎంటీ ఉంటుంది. 1లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్.. 5500 ఆర్పీఎం వద్ద 98 బీహెచ్పీ పవర్‌ను, 147 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది.
థార్‌కు పోటీగా మారుతీ జిమ్నీ..
Maruti Suzuki Jimny price in Hyderabad : 5 డోర్ జిమ్నీపై మారుతీ భారీగా ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే డిమాండ్ కనిపిస్తుండటం విశేషం. ఇందులో 1.5 లీటర్ కే15బీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 బీహెచ్పీ పవర్‌ను ,134ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్, 4 స్పీట్ టార్క్ కన్వర్ట్ ఆటోమెటిక్ ట్రాన్సిమిషన్ ఉంటుంది. ఈ మారుతీ సుజుకీ జిమ్నీ.. మహీంద్రా థార్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Maruti Jimny vs Mahindra Thar : మారుతీ జిమ్నీ వర్సెస్ మహీంద్రా థార్.. ది బెస్ట్ ఏది? అన్న విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం