Maruti Jimny vs Mahindra Thar : మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్​.. ది బెస్ట్​ ఏది?-maruti suzuki jimny vs mahindra thar check detailed comparison of specifications features and prices here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Jimny Vs Mahindra Thar : మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్​.. ది బెస్ట్​ ఏది?

Maruti Jimny vs Mahindra Thar : మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్​.. ది బెస్ట్​ ఏది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 15, 2023 07:03 AM IST

Maruti Jimny vs Mahindra Thar : అటు మారుతీ సుజుకీ జిమ్నీ.. ఇటు మహీంద్రా థార్​. వీటి మధ్య పోటీ ఓ రేంజ్​లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి.. ది బెస్ట్​ ఏదనేది తెలుసుకుందాము..

మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్​.. ది బెస్ట్​ ఏది?
మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్​.. ది బెస్ట్​ ఏది?

Maruti Jimny vs Mahindra Thar : 5 డోర్​ జిమ్నీని ఎట్టకేలకు ఆవిష్కరించింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ. మారుతీ సుజుకీ జిమ్నీ కోసం కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ 5 డోర్​ జిమ్నీకి గట్టి పోటీనిచ్చేందుకు మహీంద్రా థార్​ సిద్ధమవుతోంది! మహీంద్రా థార్​కు ఇప్పటికే ఆటో మార్కెట్​లో మంచి క్రేజ్​ ఉంది. చౌకైన థార్​ ఇటీవలే లాంచ్​ అవ్వడంతో.. డిమాండ్​ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటిని పోల్చి.. ది బెస్ట్​ ఏదో తెలుసుకుందాము..

మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్- డైమెన్షన్స్​..

Maruti Suzuki Jimny Dimensions : మారుతీ జిమ్నీ పొడవు 3,985ఎంఎం, వెడల్పు 1645 ఎంఎం, ఎత్తు 1720ఎంఎం. దీని వీల్​బేస్​ 2,590ఎంఎం. వెడల్పు, ఎత్తు విషయంలో జమ్నీ కన్నా మహీంద్రా థార్​ డైమెన్షన్స్​ ఎక్కువ. మహీంద్రా థార్ పొడవు 3,985ఎంఎం, వెడల్పు 1,820ఎంఎం, ఎత్తు 1,850ఎంఎం.

వీల్​బేస్​ విషయంలో మాత్రం​ థార్​ కన్నా జిమ్నీ 145ఎంఎం ఎక్కువ ఉంటుంది. ఇక గ్రౌండ్​ క్లియరెన్స్​లో జిమ్నీ కన్నా థార్​లో 226ఎంఎం ఎక్కువ ఉంటుంది.

మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్- స్పెసిఫికేషన్స్​..

Mahindra Thar specifications : మారుతీ సుజుకీ జిమ్నీలో 1.5 లీటర్​ కే158 పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. ఇది 103 బీహెచ్​పీ పవర్​ను 134 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​ లేదా 4 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటాయి. ఇదొక 4 వీల్​ డ్రైవ్​ వెహికిల్​.

Tata Harrier vs MG Hector : టాటా హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​.. ది బెస్ట్​ ఏదని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక మహీంద్రా థార్​లో 3 ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి 1.5 లీటర్​ డీజిల్​, 2.0 లీటర్​ టర్బో పెట్రోల్​, 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​లు. 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​.. 113 బీహెచ్​పీ పవర్​ను, 300 ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉంటుంది. ఇదొక రేర్​ వీల్​ డ్రైవ్​ వెహికిల్​.

Maruti Jimny price in Hyderabad : 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​.. 128 బీహెచ్​పీ పవర్​ను, 300 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 2.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 148 బీహెచ్​పీ పవర్​ను.. 320 ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్​లలోనూ 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇవి 4 వీల్​ డ్రైవ్​ వెహికిల్స్​.

మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్- ఆఫ్​ రోడ్​ యాంగిల్స్​..

ఇలాంటి వాహనాల్లో ఆఫ్​ రోడ్​ యాంగిల్​ అనేది చాలా కీలకం! ఆఫ్​ రోడ్​లో వెళుతున్నప్పుడు డ్రైవింగ్​కు ఇది ముఖ్యమవుతుంది. థార్​లో అప్రోచ్​ యాంగిల్​ మెరుగ్గా ఉండగా.. జిమ్నీలో డిపార్చర్​ యాంగిల్​ బాగుంది. ఇక వీల్​బేస్​ తక్కువగా ఉండటంతో.. థార్​లో మంచి బ్రేక్​ ఓవర్​ యాంగిల్​ ఉంది.

మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్- ఫీచర్స్​..

Mahindra Thar on road price in Hyderabad : మారుతీ సుజుకీ జిమ్నీ అనేది ఒక 5డోర్​ వేరియంట్​. మహీంద్రా థార్​ అనేది 3 డోర్​ మోడల్​. కాగా.. 5 డోర్​ థార్​పై మహీంద్రా అండ్​ మహీంద్రా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. రెండింట్లోనూ క్రూయిజ్​ కంట్రోల్​, మల్టీ- ఫంక్షన్​ స్టీరింగ్​ వీల్​, టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, రేర్​ పార్కింగ్​ సెన్సార్స్​, హిల్​ హోల్డ్​ కంట్రోల్​, ఈఎస్​పీ అండ్​ హిల్​ డిసెంట్​ కంట్రోల్​ ఫీచర్స్​ ఉన్నాయి.

థార్​లో టైర్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, అడ్వెంచర్​ స్టాటిస్టిక్స్​, 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, డ్రైవర్​ సీట్​ కోసం హైట్​ అడ్జస్ట్​మెంట్​, రూఫ్​ మౌంటెడ్​ స్పీకర్​, 7 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ విత్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే సపోర్ట్​ లభిస్తుంది.

మారుతీ జిమ్నీలో 6 ఎయిర్​బ్యాగ్స్​, స్టార్ట్​/ స్టాప్​ పుష్​ బటన్​, హెడ్​ల్యాంప్​ వాషర్స్​, ఆటోమెటిక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, 9 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ విత్​ వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లేలు లభిస్తున్నాయి.

మారుతీ జిమ్నీ వర్సెస్​ మహీంద్రా థార్- ధర..

Mahindra Thar 2WD variant price : మహీంద్రా థార్ రేర్​ వీల్​ డ్రైవ్​ వేరియంట్​​ రూ. 9.99లక్షల ఎక్స్​షోరూం ప్రైజ్​కు ప్రారంభమవుతోంది. ఇక 4 వీల్​ డ్రైవ్​ వేరియంట్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 13.59లక్షలుగా ఉంది.

మారుతీ సుజుకీ జిమ్నీ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అయితే.. దీనిని రూ. 10లక్షలు- రూ. 12లక్షల మధ్యలో లాంచ్​ చేసే అవకాశం ఉంది. జిమ్నీ బుకింగ్స్​ను మారుతీ సుజుకీ ప్రారంభించింది. నెక్సా డీలర్​షిప్​ షోరూంలలో రూ. 11వేలతో బుకింగ్​ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం