Mahindra Thar 2WD launched : మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ లాంచ్.. ధర ఎంతంటే!
Mahindra Thar 2WD launched in India : థార్ 2డబ్ల్యూడీ వేరియంట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. దీని ధరతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Mahindra Thar 2WD launched in India : మహీంద్రా థార్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్! థార్ రేంజ్‌లోనే అతి తక్కువ ధరతో ఓ మోడల్ బయటకొచ్చింది. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ మోడల్.. ఇండియాలో సోమవారం అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలు- రూ. 13.49లక్షల మధ్యలో ఉంది. అయితే.. ఇవి కేవలం ఇంట్రొడక్టరీ ప్రైజ్‌లు మాత్రమే. తొలి 10వేల బుకింగ్స్కే ఈ ధరలు వర్తిస్తాయని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీని థార్ ఆర్డబ్ల్యూడీ అని కూడా పిలుస్తున్నారు. ఆర్డబ్ల్యూడీ అంటే.. రేర్ వీల్ డ్రైవ్ అని అర్థం.
Mahindra Thar 2WD price in India : మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో డీ117 సీఆర్డీఈ ఇంజిన్ ఉంటుంది. మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో.. ఈ వెహికిల్ 117 బీహెచ్పీ పవర్‌ను, 300ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 150 బీహెచ్పీ పవర్‌ను, 320 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ వంటి రంగుల్లో ఈ థార్ లభిస్తోంది. ఈ కొత్త కలర్స్‌తో థార్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.
18 ఇంచ్ అలోయ్ వీల్స్, ఆల్- టెర్రైన్ టైర్స్, ఈఎస్పీ మౌల్డ్డెడ్ ఫుట్‌స్టెప్స్, క్రూయిజ్ కంట్రోల్, బ్లాక్ బంపర్స్, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్స్, ఫాగ్ లైట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, రూఫ్- మౌంటెడ్ స్పీకర్స్ కూడా ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో ఉంటాయని తెలుస్తోంది.
తక్కువ ధరకు తీసుకొస్తుండటంతో.. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ మోడల్‌కు డిమాండ్ ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. అంతేకాకుండా.. మహీంధ్రా థార్ 4డబ్ల్యూడీ వేరియంట్‌కు పలు మార్పులు కూడా చేసింది.
Mahindra Thar 2WD : "థార్‌లో రైడ్ చేయాలనుకునే వారి కోసం ధరలు తగ్గించి కొత్త మోడల్‌ను తీసుకొచ్చాము. ఇక థార్ 4డబ్ల్యూడీ వేరియంట్‌కు అదనంగా కొన్ని మార్పులు చేశాము. వీటితో మీ రైడ్ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందని మేము నమ్మకంగా ఉన్నాము," అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నాక్ర తెలిపారు.
మహీంద్రా థార్ 4డబ్ల్యూడీ వేరియంట్.. 2020లో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు.. ఈ మోడల్‌కు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ సిస్టెమ్‌ను ఇచ్చింది ఈ దిగ్గజ సంస్థ.
డిఫరెన్షియల్ సిస్టెమ్‌ను ఇచ్చింది ఆ దిగ్గజ ఆటో సంస్థ.
సంబంధిత కథనం