Mahindra Thar 2WD launch : సరికొత్త మహీంద్రా థార్​ లాంచ్​ డేట్​ ఇదే..!-mahindra thar 2wd launch on january 9 check full details of leaked feature and more here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar 2wd Launch : సరికొత్త మహీంద్రా థార్​ లాంచ్​ డేట్​ ఇదే..!

Mahindra Thar 2WD launch : సరికొత్త మహీంద్రా థార్​ లాంచ్​ డేట్​ ఇదే..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 06, 2023 10:44 AM IST

Mahindra Thar 2WD launch date : మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ లాంచ్​కు సిద్ధమవుతోంది. లాంచ్​ డేట్​తో పాటు ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఈ నెల 9న మహీంద్రా థార్​ లాంచ్​..!
ఈ నెల 9న మహీంద్రా థార్​ లాంచ్​..!

Mahindra Thar 2WD launch date : ఇండియా ఆటో మార్కెట్​లో మహీంద్రా థార్​కు ఉన్న క్రేజే వేరు! ఇక ఇప్పుడు.. సరికొత్త థార్​ను మహీంద్రా అండ్​ మహీంద్రా లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అది కూడా తక్కువ ధరకే! థార్​ మోడల్స్​లోనే అత్యంత చౌకైన 2డబ్ల్యూడీ.. ఈ నెల 9న లాంచ్​ కానున్నట్టు తెలుస్తోంది. అయితే.. లాంచ్​కి ముందే ఈ మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. వాటిని ఓసారి చూద్దాం..

ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​ ఇవే..!

లీక్స్​ ప్రకారం.. మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీలో ఎవరెస్ట్​ వైట్​, బ్లేజింగ్​ బ్రాంజ్​ అనే రెండు రంగులు ఉంటాయి. ఈ కొత్త కలర్స్​తో థార్​ లుక్​ మరింత ఆకర్షణీయంగా మారనుంది. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న థార్​ 4డబ్ల్యూడీ మోడల్స్​కి కూడా వీటిని తీసుకొస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

All new Mahindra Thar 2WD launch : డిజైన్​ పరంగా.. ఈ మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ.. 4డబ్ల్యూడీతో పోలి ఉంటుంది. కాకపోతే.. రేర్​లో 4X4 బ్యాడ్జీ ఉండదు. ఆటో స్టార్ట్​-స్టాప్​ ఆప్షన్​ కూడా కొత్తగా వస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీలో 1.5లీటర్​ టర్బో డీజిల్​ ఇంజిన్​ ఉంటుందని తెలుస్తోంది. ఇదే ఇంజిన్​ను మహీంద్రా అండ్​ మహీంద్రా ఎక్స్​యూవీ300లో వినియోగిస్తోంది. ఇది 118.5హెచ్​పీ పవర్​ను, 300ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ ఉండనుంది. ఈ మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ వర్షెన్​లో 2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఉంటుందని సమాచారం. ఇది 152హెచ్​పీ టార్క్​ను.. 300ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటే.. 320 ఎన్​ఎం టార్క్​ కూడా జనరేట్​ అవుతుంది. ఇందులో 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉంటాయి.

Mahindra Thar 2WD features : 18 ఇంచ్​ అలోయ్​ వీల్స్​, ఆల్​- టెర్రైన్​ టైర్స్​, ఈఎస్​పీ మౌల్డ్​డెడ్​ ఫుట్​స్టెప్స్​, క్రూయిజ్​ కంట్రోల్​, బ్లాక్​ బంపర్స్​, ఎలక్ట్రిక్​ ఓఆర్​వీఎమ్స్​, ఫాగ్​ లైట్స్​, టచ్​ స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, రూఫ్​- మౌంటెడ్​ స్పీకర్స్​ కూడా ఈ మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీలో ఉంటాయని లీక్స్​ ద్వారా తెలుస్తోంది.

మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ ధర..

ఎస్​యూవీపై జీఎస్​టీ మండలి సూచించిన నిర్వచనం కారణంగా.. మహీంద్రా థార్​పై పన్ను తగ్గింది. ఫలితంగా ఈ వెహికిల్​ ధర కూడా తగ్గనుంది. ఇక కొత్తగా లాంచ్​కు సిద్ధమవుతున్న మహీంద్రా థార్​ 2డబ్ల్యూడీ ప్రారంభ ధర రూ. 11లక్షలుగా (ఎక్స్​షోరూం) ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Mahindra Thar 2WD price : లాంచ్​ నేపథ్యంలో ఈ వాహనంపై మరింత సమాచారాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత కథనం