Tata Harrier vs MG Hector : టాటా హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​.. ది బెస్ట్​ ఏది?-tata harrier vs mg hector check out the comparison of price features and more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tata Harrier Vs Mg Hector, Check Out The Comparison Of Price, Features And More Details

Tata Harrier vs MG Hector : టాటా హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​.. ది బెస్ట్​ ఏది?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 17, 2022 08:03 AM IST

Tata Harrier vs MG Hector : టాటా హారియర్​, ఎంజీ హెక్టార్​లలో ఏది కొనుగోలు చేయాలో మీకు అర్థం కావడం లేదా? అయితే.. ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏది అనేది ఇక్కడ తెలుసుకోండి.

టాటా హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​.. ది బెస్ట్​ ఏది?
టాటా హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​.. ది బెస్ట్​ ఏది?

Tata Harrier vs MG Hector : దేశంలో ఇప్పుడు ఎస్​యూవీ సెగ్మెంట్​కు విపరీతమైన క్రేజ్​ లభిస్తోంది. ఒక్కప్పుడు సెడాన్​ను ఇష్టపడే వారు.. ఇప్పుడు ఎస్​యూవీలపై మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో టాటా హారియర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. దీనిని 2019లో లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. అయితే.. కొన్ని లోపాలు ఉండటంతో.. వాటిని పరిష్కరించి 2020లో కస్టమర్లను మరింత ఆకర్షించింది. ఈ టాటా హారియర్​కు ఎంజీ హెక్టార్​ నుంచి గట్టి పోటీ ఎదురవుతంది. 2019లో లాంచ్​ అయినప్పటి నుంచి.. హారియర్​కు పోటీనిస్తోంది హెక్టార్​. ఈ క్రమంలో.. ఈ రెండింటినీ పోల్చి, వీటిల్లో ది బెస్ట్​ ఏది? అనేది తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

టాట హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​- లుక్స్​..

లుక్స్​ పరంగా చూస్తే.. ఈ రెండింటికీ మంచి రోడ్​ ప్రెసెన్స్​ ఉంది. ఈ రెండింట్లోనూ స్ప్లిట్​ హెడ్​ల్యాంప్​ సెటప్​ ఉంటుంది. హారియర్​ అనేది లాండ్​ రోవర్​కు చిన్న వర్షెన్​లా కనిపిస్తుంది. అయితే.. హారియర్​ కాస్త పెద్దగా ఉంటుంది.

ఇన్నోవా హైక్రాస్​- కియా కార్నివాల్.. ది బెస్ట్​ ఏది అనేది తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాట హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​- స్పెసిఫికేషన్స్​..

Tata Harrier facelift : టాటా హారియర్​, ఎంజీ హెక్టార్​లో 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 168బీహెచ్​పీ పవర్​, 350 పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

టాటా హారియర్​లో 6స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ కూడా ఉంది. ఎంజీ హెక్టార్​లో మాత్రం ఎలాంటి ఆటోమెటిక్​ డీజిల్​ వేరియంట్​ లేదు. కానీ ఎంజీ హెక్టార్​లో 1.5లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్​ ఉంది. ఇది 141బీహెచ్​పీ పవర్​, 250ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 48వీ మైల్డ్​ హైబ్రీడ్​ సిస్టెమ్​, 8 స్పీడ్​ సీవీటీ ఆటోమెటిక్​ క్రాన్స్​మీషన్​ ఆప్షన్స్​ ఈ పెట్రోల్​ వేరియంట్​తో వస్తున్నాయి.

టాటా హారియర్​లో ఎలాంటి పెట్రోల్​ వేరియంట్​ లేదు.

టాట హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​- ఫీచర్స్​..

MG Hector price in Hyderabad : ఫీచర్స్​ విషయంలో ఈ రెండు వాహనాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. రెండింట్లోనూ.. పానారోమిక్​ సన్​రూఫ్​, టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, మల్టీ- ఇన్ఫర్మెషన్​ డిస్​ప్లే, క్రూయిజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, ప్రీమియం సౌండ్​ సిస్టెమ్​, వెంటిలేటెడ్​ ఫ్రంట్​ సీట్స్​, వయర్​లెస్​ ఛార్జర్​తో పాటు మరికొన్ని ఫీచర్స్​ ఉన్నాయి.

టాట హారియర్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​- ధర..

టాటా హారియర్​ ధర రూ. 14.80లక్షలు- రూ. 22.25లక్షల మధ్యలో ఉంటుంది. ఎంజీ హెక్టార్​ ధర రూ. 14.43లక్షలు- 20.36లక్షల మధ్యలో ఉంటుంది. ఇవి ఎక్స్​షోరూం ధరలు.

Tata Harrier price in Hyderabad : ఇక హెక్టార్​కు అప్డేటెడ్​ వర్షెన్​ను త్వరలో లాంచ్​ చేయనుండి ఎంజీ మోటార్స్​. దీని ధర కాస్త ఎక్కువే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు హారియర్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ తీసుకురావాలని టాటా మోటార్స్​ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇది వచ్చే ఏడాది లాంచ్​ అవ్వొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం