2023 MG Hector : ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’​.. లాంచ్​ ఎప్పుడంటే!-2023 mg hector gets a launch date in india check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Mg Hector : ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’​.. లాంచ్​ ఎప్పుడంటే!

2023 MG Hector : ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’​.. లాంచ్​ ఎప్పుడంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 13, 2022 01:16 PM IST

2023 MG Hector launch in India : ఇండియాలో సరికొత్త ఎస్​యూవీని లాంచ్​ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది ఎంజీ హెక్టర్​. ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బయటకొచ్చింది.

ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’​.. లాంచ్​ ఎప్పుడంటే!
ఇండియాలో సరికొత్తగా ‘ఎంజీ హెక్టర్’​.. లాంచ్​ ఎప్పుడంటే!

2023 MG Hector launch in India : ఇండియాలో నెక్స్ట్​ జనరేషన్​ ఎంజీ హెక్టర్​ కోసం అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. సరికొత్త వెహికిల్​కి సంబంధించిన కీలక ప్రకటన.. వాస్తవానికి ఈ నవంబర్​లోనే రావాల్సి ఉంది. కాగా.. ఇందుకు సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్​ వచ్చింది. సరికొత్త ఎంజ్​ హెక్టర్​ ఎస్​యూవీని వచ్చే ఏడాది జనవరిలో లాంచ్​ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. 2023 జనవరి 5న లాంచ్​ ఈవెంట్​ను కూడా ఈ ఆటో సంస్థ ఫిక్స్​ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

నెక్స్ట్​ జనరేషన్​ ఎంజీ హెక్టర్​ గురించి ఇప్పటికే అనేకమార్లు టీజ్​ చేసింది ఈ ఆటో సంస్థ. ఫలితంగా మార్కెట్​లో ఈ కొత్త ఎస్​యూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

New MG Hector launch date in India : 2023 ఎంజ్​ హెక్టర్​లో.. సరికొత్త​ ఫ్రంట్​ బంపర్​, రీమోడల్డ్​ ఎయిర్​ డామ్​తో కూడిన డైమెండ్​ మెష్​ గ్రిల్​ ఉంటుంది. ఈ డైమెండ్​ మెష్​ గ్రిల్​తో ఎస్​యూవీ లుక్​ మరింత బోల్డ్​గా, కమాండింగ్​, పవర్​ఫుల్​గా ఉంటుందని సంస్థ చెబుతోంది. డైమెండ్​ మెష్ ​గ్రిల్​ చివర్లో హెక్టర్​ మార్క్​ డీఆర్​ఎల్​లు ఉంటాయి. ఎస్​యూవీని ఇవి మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి.

ఇక నెక్స్ట్​ జనరేషన్​ ఎంజీ హెక్టర్​ లోపల 14 ఇంచ్​ హెచ్​డీ పోట్రెయిట్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉంటుంది. యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటోని ఇది సపోర్ట్​ చేస్తుంది. అంతేకాకుండా.. నెక్స్ట్​- జెన్​- ఐ-స్మార్ట్​ను కూడా ఇది సపోర్ట్​ చేస్తుంది. ఫలితంగా జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింద. ఫుల్​ డిజిటల్​ 7 ఇంచ్​ కన్ఫిగరేబుల్​ క్లస్టర్​ సెటప్​ ఇందులో ఉండనుంది.

New MG Hector price : సరికొత్త ఎస్​యూవీ ఇంటీరియర్​ను "సింఫొని ఆఫ్​ లగ్జరీ"గా అభివర్ణించింది ఎంజీ హెక్టర్​. ఎస్​యూవీ ఇంటీరియర్​లో సినిమానిట్​ ఎక్స్​పీరియన్స్​ లభిస్తుందని అంటోంది.

అయితే.. ఇంజిన్​ విషయానికొస్తే.. కొత్త మోడల్​కు, ప్రస్తుతం ఉన్న ఎస్​యూవీ మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంజీ హెక్టర్​లో 1.5లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​ మోటర్​, 2.0లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక లాంచ్​ తర్వాత.. ఈ సరికొత్త ఎంజీ హెక్టర్​ ఎస్​యూవీ.. టాటా హారియర్​, జీప్​ కంపాస్​కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఈ వాహనానికి సంబంధించిన ధర, ఫీచర్స్​తో పాటు పూర్తి వివరాలను 2023 జనవరి 5న సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం