Toyota Innova Hycross vs Kia Carnival : ఇన్నోవా హైక్రాస్​- కియా కార్నివాల్.. ది బెస్ట్​ ఏదంటే!-toyota innova hycross vs kia carnival check detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Toyota Innova Hycross Vs Kia Carnival, Check Detailed Comparison Here

Toyota Innova Hycross vs Kia Carnival : ఇన్నోవా హైక్రాస్​- కియా కార్నివాల్.. ది బెస్ట్​ ఏదంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 06, 2022 11:16 AM IST

Toyota Innova Hycross vs Kia Carnival : టయోటా ఇన్నోవా హైక్రాస్​ లాంచ్​ అయిన తర్వాత.. కియా కార్నివాల్​కు గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు వెహికిల్స్​ను పోల్చి.. ది బెస్ట్​ ఏదో తెలుసుకుందాము.

టయోటా ఇన్నోవా హైక్రాస్​
టయోటా ఇన్నోవా హైక్రాస్​

Toyota Innova Hycross vs Kia Carnival : ఆటో మార్కెట్​లో ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్​ హాట్​ టాపిక్​గా మారింది. ఈ ఎంపీవీని సంస్థ ఎప్పుడెప్పుడు లాంచ్​ చేస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న వాహనాలతో టయోటా ఇన్నోవా హైక్రాస్​ను కంపేర్​ చేయాలని కస్టమర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నోవా హైక్రాస్​.. కియా కార్నివాల్​ కార్ల ఫీచర్స్​తో పాటు ఇతర అంశాలు పోల్చి చుద్దాము..

ట్రెండింగ్ వార్తలు

డైమెన్షన్స్​..

టయోటా ఇన్నోవా హైక్రాస్​తో పోల్చుకుంటే.. ఎత్తు, వెడల్పు, వీల్​బేస్​ విషయంలో కియా కార్నివాల్​ చాలా పెద్దగా ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్​ పొడవు 4,755ఎంఎం కాగా.. కియా కార్నివాల్​కి అది 5,115ఎంఎంగా ఉంది. ఇన్నోవా హైక్రాస్​ వెడల్పు 1,850ఎంఎం. కియా కార్నివాల్​ వెడల్పు 1,755ఎంఎం. మరోవైపు ఇన్నోవా హైక్రాస్​ వీల్​ బేస్​ 2,850ఎంఎం. కియా కార్నివాల్​ వీల్​ బేస్​ 3,060ఎంఎం.

Toyota Innova HyCross specifications : ఇక హైట్​ విషయానికొస్తే.. కియా కార్నివాల్​ హైట్​ 1,755ఎంఎంగా ఉండగా.. ఇన్నోవా హైక్రాస్​కు అది 1,795ఎంఎంగా ఉంది.

ఇంజిన్​..

టయోటా ఇన్నోవా హైక్రాస్​లో 2.లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్(ఈ-సీవీటీ)​, 2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్(సీవీటీ)​ వేరియంట్లను.. కియా కార్నివల్​ 2.2 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ 8 స్పీడ్​ ఆటోమెటిక్​ వేరియంట్​తో పోల్చి చూద్దాం. 2 లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​ 186పీఎస్​ పవర్​ను, 206ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ 174 పవర్​ను, 205ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇక కియా కార్నివాల్​ 200పీఎస్​ పవర్​ను, 440ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

మరోవైపు ఇన్నోవా హైక్రాస్​ పెట్రోల్​ హైబ్రీడ్​ వేరియంట్​ 21.1కేఎంపీహెచ్​ మైలేజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది. కియా కార్నివాల్​ మాత్రం 13.9 కేఎంపీహెచ్​ మైలేజ్​ను ఇస్తోంది.

మొత్తం మీద.. కార్నివాల్​ డీజిల్​ మోటర్​ పవర్​ఫుల్​గా ఉంటుంది. ఇందులో టార్క్​ ఎక్కువగా ఉండటం కారణంగా.. కొండ ప్రాంతాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. కానీ మైలేజ్​ పరంగా హైక్రాస్​ ముందంజలో ఉందని గుర్తుపెట్టుకోవాలి.

ఇన్నోవా హైక్రాస్​ వర్సెస్​ ఎక్స్​యూవీ700.. ఫీచర్స్​తో ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఫీచర్స్​..

Toyota Innova HyCross features : టయోటా ఇన్నోవా హైక్రాస్​- కియా కార్నివాల్​లో కొన్ని ఫీచర్స్​ సేమ్​ ఉన్నాయి. అవి.. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ ఏసీ, ఎలక్ట్రికల్లీ ఎడ్జస్టెబుల్​ డ్రైవర్స్​ సీట్​, వయర్​లెస్​ ఛార్జింగ్​, పవర్డ్​ టెయిల్​గేట్​, 6 ఎయిర్​బ్యాగ్స్​, ఫ్రంట్​ అండ్​ రేర్​ సన్సార్స్​, హిల్​ హోల్డ్​ కంట్రోల్​, టీపీఎంఎస్​, ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​.

వీటికి తోడు హైక్రాస్​లో.. పానారోమిక్​ సన్​రూఫ్​, డ్యూయెల్​ జోన్​ ఏసీ, పవర్డ్​ సెకండ్​ రో, ఆట్టామన్​ సీట్స్​ విత్​ లెగ్​ రెస్ట్​, వెంటిలేటెడ్​ ఫ్రంట్​ సీట్స్​, 10 ఇంచ్​ టచ్​స్క్రీన్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, 9 స్పీకర్​ జేబీఎల్​ సౌండ్​ సిస్టెమ్​, 7 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, పాడిల్​ షిఫ్టర్​, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్​ ఫీచర్స్​ ఉన్నాయి.

కామన్​ ఫీచర్స్​తో పాటు కియా కార్నివాల్​లో డ్యూయెల్​ పేన్​ సింగిల్​ సన్​రూఫ్​, ట్రై జోన్​ ఏసీ, మేన్యువల్లీ ఆపరేటెడ్​ సెకెండ్​ రో వీఐపీ సీట్స్​(లెగ్​ రెస్ట్​తో సహా), వెంటిలేటెడ్​ డ్రైవర్స్​ సీట్​, 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​ సిస్టెమ్​, యాండ్రాయిడ్​ ఆటో- యాపిల్​ కార్​ప్లే, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ, 8 స్పీకర్​ హార్మన్​ కార్డన్​ సౌండ్​ సిస్టెమ్​, డ్యూయెల్​ 10.1ఇంచ్​ రేర్​ సీట్​ టచ్​స్క్రీన్​ డిస్​ప్లే, ఆటోమెటిక్​ హెడ్​ల్యాంప్స్​, ఎయిర్​ ప్యూరిఫయర్స్​ ఉన్నాయి.

Kia Carnival features : ఫీచర్స విషయంలో కియా కార్నివాల్​ మెరుగ్గా ఉంది. కానీ సేఫ్టీ విషయంలో మాత్రం టయోటా ఇన్నోవా హైక్రాస్​కు కియా కార్నివాల్​ అసలు పోటీనివ్వలేకపోతుంది. ఇన్నోవా హైక్రాస్​లో సేఫ్టీ ఫీచర్స్​ అధికంగా ఇచ్చింది టయోటా.

ధరలు..

Kia carnival price : మార్కెట్​లో ప్రస్తుతం కియా కార్నివాల్​ ధర రూ. 30.99లక్షలు- 35.49లక్షల(ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది. టయోటా ఇన్నోవా హైక్రాస్​ ధర అధికారికంగా బయటకు రాలేదు. కాగా.. ఈ ఎంపీవీ రూ. 20లక్షలు- 30లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel