Innova HyCross vs XUV700 : ఇన్నోవా హైక్రాస్ వర్సెస్ ఎక్స్‌యూవీ700.. ది బెస్ట్ ఏదంటే!
Toyota Innova HyCross vs Mahindra XUV700 : టయోటా ఇన్నోవా హైక్రాస్.. మహీంద్రా ఎక్స్‌యూవీ700కి పోటీనిస్తోంది. ఈ రెండింటి గురించి డీటైల్‌గా తెలుసుకుందాము.
Toyota Innova HyCross vs Mahindra XUV700 : ఇండియాలో త్రీ సీటర్ రో కార్లు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి టయోటా ఇన్నోవా హైక్రాస్ కూడా వచ్చి చేరింది. వాస్తవానికి ఇదొక ఎంపీవి కారే అయినా.. దీని డిజైన్ చూస్తుంటే ఎస్‌యూవీల కనిపిస్తుంది. పైగా.. ఇది స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్లోనూ వస్తోంది. ఫలితంగా.. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ గట్టి పోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు కార్ల ఫీచర్స్‌తో పాటు మరిన్ని వివరాలను పోల్చి చూద్దాము..
టయోటా ఇన్నోవా హైక్రాస్ వర్సెస్ మహీంద్రా ఎస్యూవీ700- స్పెసిఫికేషన్స్..
Toyota Innova HyCross specifications : సైజు విషయానికొస్తే.. ఎక్స్‌యూవీ700 కన్నా ఇన్నోవా హైక్రాస్ పెద్దగా ఉంటుంది. ఎక్స్‌యూవీ700 కన్నా ఇన్నోవా హైక్రాస్ 95ఎంఎం పొడవు ఎక్కువగా ఉంటుంది. కానీ వెడల్పు విషయంలో 44ఎంఎం తక్కువగా ఉంటుంది. ఇక ఎత్తు విషయంలో.. ఎక్స్‌యూవీ700 కన్నా ఇన్నోవా హైక్రాస్ కాస్త పెద్దగా కనిపిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 బూట్ స్పేస్ కన్నా ఇన్నోవా హైక్రాస్ బూట్ స్పేసే చాలా ఎక్కువ!
టయోటా ఇన్నోవా హైక్రాస్ వర్సెస్ మహీంద్రా ఎస్యూవీ700- ఫీచర్స్..
Toyota Innova HyCross features : ఫీచర్స్ విషయంలో టయోటా ఇన్నోవా హైక్రాస్.. 'తగ్గేదే లే!' అని అంటోంది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెహికిల్‌ను కస్టమర్లకు అందిస్తోంది టయోటా. త్రీ రో ఎంపీవీలో తొలిసారిగా పానారోమిక్ సన్‌రూఫ్, 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్‌ను ఇస్తోంది. హైక్రాస్ సెకెండ్ రో ఇంకా అద్భుతంగా ఉంటుంది! త్రీ రో ఎంపీవి సెగ్మెంట్లోనే తొలిసారి గా అట్టామాన్ రిక్లైనింగ్ సీట్లు ఇస్తోంది. పవర్డ్ టెయిల్గేట్స్ కూడా ఉంటాయి.
ఇన్నోవా హైక్రాస్, ఎక్స్‌యూవీ700 రెండింట్లోనూ ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. యాపిల్ కార్ప్లే, యాండ్రాయిడ్ కార్ ప్లే వంటివి రెండింట్లోనూ ఉంటాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ వర్సెస్ మహీంద్రా ఎస్యూవీ700- ఇంజిన్..
Mahindra XUV700 : ఈ రెండూ కూడా.. 2లీటర్ పెట్రోల్ ఇంజిన్స్‌తో వస్తున్నాయి. అయితే.. ఎస్యూవీ700లో టర్బో యూనిట్ ఉంటుంది. టయోటాలో పెట్రోల్‌తో పాటు పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ ఉంటుంది.
2లీటర్ పెట్రోల్ ఇన్నోవా హైక్రాస్ ఇంజిన్.. 174పీఎస్ పవర్, 205ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయగలదు. 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ యూనిట్.. 186పీఎస్ పవర్, 206ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయగలదు. రెండు ఇంజిన్లు.. సీవీటీ లేదా ఈసీవీటీ ట్రాన్స్‌మీషన్ యూనిట్లకు జోడించి ఉంటాయి.
ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700లోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్.. 200పీఎస్ పవర్, 380ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6స్పీడ్ మేన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటాయి.
మైలేజ్..
టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ వేరియంట్‌కు సంబంధించి మైలేజ్ వివరాలు ఇంకా తెలియరాలేదు. హైబ్రీడ్ వేరియంట్ మాత్రం.. 21కేఎంపీహెచ్ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఇక ఎక్స్‌యూవీ700 పెట్రోల్ వేరియంట్లు 15-16కేఎంపీహెచ్ మైలేజ్‌ని ఇస్తాయి.
ధర..
Mahindra XUV700 price : టయోటా ఇన్నావో హైక్రాస్ ధరకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. మహీంద్రా ఎక్స్‌యూవీ700 రూ. 13.45లక్షల(ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమవుతుంది.
సంబంధిత కథనం