Toyota Innova HyCross launch : ఇండియాలోకి ఇన్నోవా హైక్రాస్- బుకింగ్స్ షురూ
Toyota Innova HyCross launch in India : ఇన్నోవా హైక్రాస్‌ను ఇండియాలో లాంచ్ చేసింది టయోటా సంస్థ. బుకింగ్స్‌ని కూడా మొదలుపెట్టింది.
Toyota Innova HyCross launch in India : ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ వచ్చేసింది! ఇన్నోవా హైక్రాస్‌ను శుక్రవారం ఇండియాలో ఆవిష్కరించింది టయోటా సంస్థ. దీనితో పాటు.. బుకింగ్స్‌ని కూడా మొదలుపెట్టింది. 2023 జనవరి మధ్య వారంలో నుంచి డెలివరీలు మొదలుపెడతామని స్పష్టం చేసింది.
జెనిక్స్తో పాటే హైక్రాస్..
ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా జెనిక్స్ పేరుతో ఈ వారంలో ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇక కొత్త ఇన్నోవా హైక్రాస్.. ఎస్యూవీ డిజైన్‌కు దగ్గరగా ఉంటుంది. బంపర్ వెడల్పుగా కనిపిస్తుంది. ఈ ఎంపీవీ పొడవు 4,755ఎంఎం. వెడల్పు 1,850ఎంఎం, ఎత్తు 1,795ఎంఎం. వీల్‌బేస్ 2,850ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 185ఎంఎంగా ఉంది. టయోటా ఇన్నోవా హైక్రాస్.. మోనోకోక్యూ ఛాసిస్‌పై తయారు చేశారు. ఫలితంగా సాధారణం కన్నా.. వాహనం బరువు 200కేజీల వరకు దిగొచ్చింది. హ్యాండ్లింగ్ మెరుగుపడటంతో పాటు.. బాడీ రోల్ అనేది తగ్గుతుంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా.. ఇన్నోవా హైక్రాస్ మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Toyota Innova HyCross bookings India : ఇక క్యాబిన్ చాలా స్టైలిష్‌గా ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సెటప్ ఈ ఇన్నోవా హైక్రాస్లో ఉంది. రిక్లైనింగ్ రేర్ సీట్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్, రెండో సీటులో కప్ హోల్డర్లు, ట్రేలు ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్, పవర్డ్ టెయిల్‌గేట్, మూడ్ లైటింగ్, ఆప్షనల్ 6 సీటర్వేరియంట్ విత్ క్యాప్టెన్ సీట్స్, పానారోమిక్ సన్‌రూఫ్, రూఫ్ మోంటెడ్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్స్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఈ వాహనం అందుబాటులోకి వస్తోంది. ఒక టయోటా కారుకు.. డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్ ఉండటం ఇదే తొలిసారి.
కాగా.. ఇన్నోవా హైక్రాస్లో డీజిల్ వేరియంట్ లేదు. రెండు పెట్రోల్, మూడు హైబ్రీడ్ వేరియంట్లలో దీనిని టయోటా రూపొందిస్తోంది. 2.0లీటర్ పెట్రోల్, 2.0 సీటల్ పెట్రోల్ హైబ్రీడ్ మోటార్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక ఫ్యూయెల్ ఏఫీషియన్సీ విషయాకి వస్తే.. లీటరుకు 21.1కేఎంపీఎల్ మైలేజీ వస్తుందని తెలుస్తోంది. అంటే.. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే.. 1,097కి.మీల వరకు ప్రయాణించవచ్చు.
Toyota Innova HyCross price in Inia : ఇండియాలో.. ఇన్నోవా హైక్రాస్ ధరకు సంబంధించిన వివరాలను టయోటా సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం