Toyota Innova Hycross vs Innova Crysta : టయోటా ఇన్నోవా హైక్రాస్..​ క్రిస్టాకు మించి..!-toyota innova hycross vs innova crysta new vs old check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Innova Hycross Vs Innova Crysta : టయోటా ఇన్నోవా హైక్రాస్..​ క్రిస్టాకు మించి..!

Toyota Innova Hycross vs Innova Crysta : టయోటా ఇన్నోవా హైక్రాస్..​ క్రిస్టాకు మించి..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 11:15 AM IST

Toyota Innova Hycross vs Innova Crysta : ఇండియాలో ఇన్నోవా హైక్రాస్​ త్వరలో లాంచ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఇన్నోవా క్రిస్టా- హైక్రాస్​ మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలుసుకుందాము.

టయోటా ఇన్నోవా హైక్రాస్​
టయోటా ఇన్నోవా హైక్రాస్​

Toyota Innova Hycross vs Innova Crysta : ఇన్నోవా జెనిక్స్​ను ఇండోనేషియా మార్కెట్​లో లాంచ్​ చేసింది దిగ్గజ ఆటో సంస్థ టయోటా. ఇది.. ఇన్నోవా హైక్రాస్​ పేరుతో ఈ నెల 25న ఇండియాలో లాంచ్​ అవ్వనుంది. వాస్తవానికి ఇన్నోవాకు ఇండియా మార్కెట్​లో మంచి క్రేజ్​ ఉంది. అందుకే.. ఇన్నోవా హైక్రాస్​ మీద భారతీయులకు భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో లాంచ్​ కానున్న ఇన్నోవా హైక్రాస్​కు.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఇన్నోవా క్రిస్టాకు మధ్య వ్యత్యాసాన్ని ఓసారి చూద్దాం.

ఎక్స్​టీరియర్​..

ఇన్నోవా క్రిస్టాతో పోల్చుకుంటే.. ఇన్నోవా హైక్రాస్​ డిజైన్​ చాలా భీన్నంగా ఉంది. రెండింట్లోనూ ఫ్రంట్​ గ్రిల్స్​ ఉన్నాయి. కానీ హైక్రాస్​లో ఫ్రంట్​ గ్రిల్​.. హనీకోంబ్​ ఆకారంలో ఉండగా.. క్రిస్టాలో అది మల్టిపుల్​ హారిజాంటల్​ స్లాట్స్​గా ఉంది. హైక్రాస్​ హెడ్​ల్యాంప్​లు.. క్రిస్టాతో పోల్చుకుంటే చాలా స్లిమ్​గా కనిపిస్తాయి.

Toyota Innova Hycross launch date : ఇన్నోవా హైక్రాస్​ ఫ్రంట్​ బంపర్​కి హారిజాంటల్​ ఎల్​ఈడీ లైట్స్​ అమర్చారు. ఫ్రంట్​ బంపర్​ కిందే.. థిన్​ ఎయిర్​ ఇంటేక్​ని ఏర్పాటు చేశారు. క్రిస్టాలో ఇది డిఫరెంట్​గా ఉంటుంది.

రేర్​లో.. హ్రైక్రాస్​కు వ్రాప్​ అరౌండ్​ టెయిల్​ ల్యాంప్స్​ ఉంటాయి. ఇండికేటర్​, రివర్స్​ ల్యాంప్స్​, టెయిల్​ ల్యాంప్స్​లు క్రోమ్​ స్ట్రిమ్​కి అటాచ్​ చేసి ఉంటాయి. క్రిస్టాలో టెయిల్​ ల్యాంప్స్​ కోసం ఇన్​వర్టెడ్​ ఎల్​-షేప్​ డిజైన్​ ఉంది. కింది భాగంలో ఇండికేటర్లు అమర్చి ఉంటాయి.

డైమెన్షన్స్​..

ఇన్నోవా క్రిస్టాతో పోల్చుకుంటే ఇన్నోవా హైక్రాస్​ డైమెన్షన్స్​ కాస్త ఎక్కుగా ఉన్నాయి.

 డైమెన్షన్స్ ఇన్నోవా హైక్రాస్​ (ఎంఎం) ఇన్నోవా క్రిస్టా (ఎంఎం)
 పొడవు 4,755 4,735
 వెడల్పు 1,850 1,830
 ఎత్తు 1,795 1,795
 వీల్​బేస్​ 2,850 2,750

ఇంటీరియర్​..

ఇన్నోవా క్రిస్టాతో పోల్చుకుంటే.. ఇన్నోవా హైక్రాస్​ ఇంటీరియర్​ డిజైన్​ చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా డాష్​బోర్డు పైన మీద ఫ్రీ స్టాండింగ్​ టచ్​స్క్రీన్​ అదనంగా ఉండటం విశేషం. వాటి కిందే సెంట్రల్​ ఎసీ వెంట్లు ఉన్నాయి. క్రిస్టాకి.. డాష్​బోర్డు సెంటర్​లో టచ్​స్క్రీన్​ ఉంటుంది. అక్కడే సెంట్రల్​ ఎసీ వెంట్లు ఉంటాయి.

Toyota Innova Hycross price : ఇన్నోవా క్రిస్టాకు​ ఏసీ సెటప్​లో నాబ్స్​, డయల్స్​ ఉండగా.. ఇన్నోవా హైక్రాస్​కు బటన్స్​ మాత్రమే ఇచ్చింది టయోటా. హైక్రాస్​లో.. డాష్​బోర్డుకు అటాచుడ్​గా గేర్​ బాక్స్​ ఉంటుంది. ఇన్నోవాకు గేర్​ రాడ్​.. ఫ్లోర్​ మీద ఉంటుంది. హైక్రాస్​లో యాంగ్యులర్​తో పాటు డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉన్నాయి. క్రిస్టాలో కేవలం యాంగ్యులర్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్​ ఇంటీరియర్​లోని రంగులు.. అర్బన్​ క్రూజర్​ హైరైడర్​తో(బ్లాక్​, బ్రౌన్​) పోలి ఉంటాయి. క్రిస్టాకు ఇంటీరియర్​లో బ్లాక్​ కలర్​ ఉంటుంది. ఇక స్టీరింగ్​ విషయానికొస్తే.. రెండు వాహనాల్లో చాలా భిన్నంగా ఉన్నాయి.

ఇంజిన్​ వివరాలు..

Toyota Innova Hycross features : ఇన్నోవా క్రిస్టా.. 2.7లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ అందుబాటులో ఉంది. 2.4లీటర్​ టర్బోఛార్జ్​డ్​ డీజిల్​ ఇంజిన్​ బుకింగ్స్​ను నిలిపివేసింది. ఇక హైక్రాస్​లో​.. 2.0లీటర్​ పెట్రోల్​, 2.0 లీటర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. హైబ్రీడ్​ ఇంజిన్​ 20-23కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుందని తెలుస్తోంది. స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వేరియంట్​లో.. ఈవీ ఓన్లీ మోడ్​ ఉండొచ్చు.