Toyota Innova hyCross: టయోటా ఇన్నోవా హైక్రాస్ సెకెండ్ టీజర్
Toyota Innova Hycross: టయోటా నుంచి సరికొత్తగా ఇన్నోవా హైక్రాస్ పేరుతో హైబ్రీడ్ మోడల్ రాబోతోంది. దీనికి సంబంధించి ఇదివరకు ఒక టీజర్ వదిలిన టయోటా.. ఇప్పుడు లాంఛింగ్‌కు ముందు మరో టీజర్ వదిలింది.
Toyota Innova hyCross: టయోటా నుంచి సరికొత్తగా ఊరిస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ మోడల్‌గా వస్తోంది. ఈ కంపెనీ నుంచి అర్బన్ క్రూయిజర్ హైరైడర్ తరువాత వస్తున్న మరో హైబ్రీడ్ ఎస్‌యూవీ ఇది. స్వచ్ఛ ఇంధనంతో కూడిన రవాణా ప్రణాళికల్లో భాగంగా టయోటా ఇన్నోవా హైక్రాస్ పేరుతో ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను తీసుకొస్తోంది. ఇండియాతో పాటు ఇండోనేషియాలో కూడా ఆవిష్కరించనుంది.
టయోటా కంపెనీ ఆవిష్కరించనున్న ఈ న్యూజనరేషన్ ఇన్నోవా హైక్రాస్ ఎస్‌యూవీ మోడల్ సిల్హౌట్ ప్రొఫైల్‌ను ఆవిష్కరించింది. లార్జ్ వీల్ ఆర్చెస్, సైడ్ ప్యానెల్ వెంబడి స్ట్రాంగ్ క్యారెక్టర్ లైన్స్ దర్శనమిచ్చాయి.
ఇదివరకు విడుదల చేసిన టీజర్‌లో టయోటా నుంచి రానున్న సరికొత్త ఇన్నోవా ప్రస్తుత ఇన్నోవా క్రిస్టా కంటే చాలా భిన్నంగా కనిపించింది.. గ్లోబల్ మార్కెట్లో విక్రయించే టయోటా కరోలా క్రాస్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందినట్టు స్పష్టమవుతోంది. హెగ్జాగోనల్ గ్రిల్, ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో పాటు ఉండే స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ట్రాంగ్ క్రీసెస్‌తో బానెట్ ఎస్‌యూవీని సరికొత్తగా చూపింది.
టయోటా కరోలా తరహాలోనే టీఎన్‌జీఏ-సీ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త ఇన్నోవా రానుంది. హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఇంట్రడ్యూస్ చేస్తోంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, హైరైడర్‌లో ఉపయోగించిన స్ట్రాంగ్ హైబ్రీడ్ పవర్‌ట్రైన్ దీనిలో ఉపయోగిస్తారు.
ఈ సరికొత్త టయోటా ఇన్నోవా టెస్టింగ్ దశలో పలు చోట్ల కనిపించింది. అయితే వాటికి సంబంధించిన ఫోటోల్లో లార్జ్ అలాయ్ వీల్స్ సంబంధిత దృశ్యాలు తప్ప వేరేవీ కనిపించలేదు. ఈ నెలలోనే ఈ కార్‌ను లాంఛ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఇన్నోవా హైక్రాస్ మార్కెట్లోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది.
5 ఏళ్ల తరువాత ఈ కొత్త సంవత్సరంలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ కారు ధర, ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న మోడల్స్‌తో పోలిస్తే రానున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా సరికొత్త ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ తదితర ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.