Toyota Urban Cruiser Hyryder: మిడ్‌సైజ్ సెగ్మెంట్‌లో అర్బన్ క్రూయిజర్ హైరైడర్-toyota kirloskar forays into mid size suv segment unveils urban cruiser hyryder ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Toyota Urban Cruiser Hyryder: మిడ్‌సైజ్ సెగ్మెంట్‌లో అర్బన్ క్రూయిజర్ హైరైడర్

Toyota Urban Cruiser Hyryder: మిడ్‌సైజ్ సెగ్మెంట్‌లో అర్బన్ క్రూయిజర్ హైరైడర్

HT Telugu Desk HT Telugu
Jul 01, 2022 02:29 PM IST

Toyota Urban Cruiser Hyryder: మిడ్‌సైజ్ సెగ్మెంట్‌లో టయోటా కార్ల సంస్థ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను లాంఛ్ చేసింది.

<p>టయోటా అర్బన్ క్రూూయిజర్ హైరైడర్‌ను ఆవిష్కరిస్తున్న టయోటా కిర్లోస్కర్ ఎండీ మసకజు యోషిమురా, వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్</p>
టయోటా అర్బన్ క్రూూయిజర్ హైరైడర్‌ను ఆవిష్కరిస్తున్న టయోటా కిర్లోస్కర్ ఎండీ మసకజు యోషిమురా, వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ (PTI)

న్యూఢిల్లీ, జూలై 1: టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) శుక్రవారం తన తాజా మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను ఆవిష్కరించడంతో అత్యంత పోటీతత్వంతో కూడిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది.

రాబోయే పండుగ సీజన్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఈ మోడల్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీపడనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్‌షిప్‌లలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ మోడల్ బుకింగ్‌లను ప్రారంభించినట్లు టయోటా తెలిపింది.

హైరైడర్ నియో డ్రైవ్, సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో కూడిన రెండు పవర్‌ట్రెయిన్‌లతో వస్తోంది.

నియో డ్రైవ్ గ్రేడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్జీ) టెక్నాలజీతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 75కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) అమర్చిన నియో డ్రైవ్ ట్రిమ్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటాయి.

‘కార్బన్ న్యూట్రల్ సొసైటీని సాకారం చేయాలనే దృక్పథంతో పరిశుభ్రమైన, పచ్చటి భవిష్యత్తును సృష్టించే బాధ్యతను సమిష్టిగా కలిగి ఉండాలని మేం  విశ్వసిస్తున్నాం. ఈ లక్ష్యాలకు అనుగుణంగా 'మేక్ ఇన్ ఇండియా', 'మాస్ ఎలక్ట్రిఫికేషన్' కార్యక్రమాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించి, తద్వారా 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊపును అందించేందుకు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది..’ అని టయోటా వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ ఇక్కడ మోడల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో టీకేఎం మేనేజింగ్ డైరెక్టర్ మసకాజు యోషిమురా మాట్లాడుతూ 20 లక్షలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లతో కూడిన భారతదేశంలో కంపెనీ దృష్టి అధునాతన ఉత్పత్తుల పరిచయంపై ప్రధానంగా ఉంటుందని వివరించారు.

‘కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం ఎల్లప్పుడూ మా ముందున్న అతిపెద్ద సవాలు. దీని కోసం కార్బన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి బహుళ సాంకేతిక మార్గాలు అవసరం. మా తాజా సమర్పణ ఆ దిశలో మరొక అడుగు’ అని ఆయన పేర్కొన్నారు.

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టయోటా అధునాతన గ్రీన్ టెక్నాలజీని ప్రతిబింబించే సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌ను అందిస్తుందని చెప్పారు.

‘సుజుకితో టయోటా కూటమిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ మోడల్ కర్ణాటకలోని టీకేఎం ప్లాంట్‌లో తయారవుతోంది. ఈ వాహనం ప్రపంచ స్థాయి మోటరింగ్ అనుభవాన్ని అందిస్తుందని మేం గట్టిగా నమ్ముతున్నాం..’ అని అన్నారు.

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టయోటా మోడల్ కార్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని యోషిమురా పేర్కొన్నారు.

ఎస్‌యూవీ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక ఫీచర్లతో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టయోటా వస్తోంది. 55కి పైగా కనెక్ట్ అయి ఉన్న ఫీచర్లు దీనిలో ఉంటాయి.

Whats_app_banner

టాపిక్