Scorpio N waiting period : స్కార్పియో-ఎన్​, ఎక్స్​యూవీ700 డెలివరీలు.. ఇప్పట్లో కష్టమే!-mahindra scorpio n and xuv700 waiting period could get longer see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mahindra Scorpio N And Xuv700 Waiting Period Could Get Longer, See Details

Scorpio N waiting period : స్కార్పియో-ఎన్​, ఎక్స్​యూవీ700 డెలివరీలు.. ఇప్పట్లో కష్టమే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 01:11 PM IST

Scorpio N waiting period : ఆటో సంస్థలు లాంచ్​ చేస్తున్న కొత్త మోడల్స్​ సూపర్​గా ఉంటున్నాయి. కానీ వాటి డెలివరీ విషయానికొస్తేనే పరిస్థితులు దారణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మహీంద్రా స్కార్పియో ఎన్​, ఎక్స్​యూవీ700 డెలివరీలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

స్కార్పియో-ఎన్​, ఎక్స్​యూవీ700 డెలివరీ మరింత ఆలస్యం!
స్కార్పియో-ఎన్​, ఎక్స్​యూవీ700 డెలివరీ మరింత ఆలస్యం!

Scorpio N waiting period : కొత్త కొత్త లాంచ్​లతో దూసుకెళుతున్న దేశీయ ఆటో సంస్థలు.. డెలివరీ విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి! ఓవైపు బుకింగ్​ ఆర్డర్స్​ పెరిగిపోతుంటే.. మరోవైపు డెలివరీ కోసం వెయిటింగ్​ పీరియడ్​కు మించిన సమయం తీసుకుంటున్నాయి. ఈ జాబితాలోకి దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా కూడా చేరినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా.. డిమాండ్​ ఎక్కువగా ఉన్న స్కార్పియో ఎన్​, ఎక్స్​యూవీ700 వంటి వాహనాలు ఇప్పట్లో కస్టమర్ల చేతికి వెళ్లకపోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో వివిధ మోడల్స్​కు సంబంధించిన పెండింగ్​ ఆర్డర్స్​ను తాజాగా ప్రకటించింది ఎం అండ్​ ఎం. దేశంలో అత్యధిక వెయిటింగ్​ పీరియడ్​ ఉన్న వాహనాల్లో ఒకటిగా ఉన్న స్కార్పియో ఎన్​, ఎక్స్​యూవీ700ల ఆర్డర్లు భారీ మొత్తంలో ఇప్పటికీ పెండింగ్​లో ఉన్నాయి. పెండింగ్​ ఆర్డర్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని సంస్థ చెబుతున్నా.. ఆయా వాహనాల వెయిటింగ్​ పీరియడ్​ మరింత పెరగడం ఖాయంగా తెలుస్తోంది.

XUV700 waiting period : ఎం అండ్​ ఎం ప్రకారం.. 1,30,000 మంది కస్టమర్లు స్కార్పియో ఎన్​ ఎస్​యూవీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కేవలం 13శాతం(17000) మంది అక్టోబర్​లో బుకింగ్​ చేసుకున్నారు. గతంలోని అంచనాల ప్రకారం స్కార్పియో ఎన్​కు 21 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. రూ. 15.45లక్షల ప్రారంభ ధరలో ఈ ఏడాదిలో లాంచ్​ అయిన ఈ స్కార్పియో ఎన్​.. తక్కువ సమయంలోనే లక్షకుపైగా బుకింగ్స్​ను సొంతం చేసుకుంది. కానీ డెలివరీలు మాత్రం సమయానికి జరగడం లేదు.

మహీంద్రా ఎక్స్​యూవీ700 పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం ఈ వాహనానికి 18నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. 80,000కుపైగా ఓపెన్​ బుకింగ్స్​ ఉన్నాయి. ప్రతి నెల 11,000మంది ఈ వాహనాన్ని బుక్​ చేసుకుంటున్నారు. డీజిల్​ వేరియంట్ల పెండింగ్​ డెలివరీ చాలా ఎక్కువగా ఉంది. కానీ కొన్ని పెట్రోల్​ వేరియంట్ల డెలివరీలు కాస్త తొందరగానే అవుతున్నట్టు తెలుస్తోంది.

Mahindra Thar waiting period : ఇక మహీంద్రా థార్​ ఎస్​యూవీ విషయానికొస్తే.. ఈ వాహనానికి 20,000కుపైగా బుకింగ్స్​ పెండింగ్​లో ఉన్నాయి. బోలేరో, ఎక్స్​యూవీ300కు 13వేలకుపైగా యూనిట్ల డెలివరీ పెండింగ్​లో ఉన్నాయి.

పెండింగ్​ డెలివరీలను పూర్తి చేయాలంటే ఎం అండ్​ ఎం.. ప్రొడక్షన్​ను భారీ స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కొత్త మోడల్స్​ లాంచ్​ అయితే.. ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా దారుణంగా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఎక్స్​యూవీ400 ఈవీ ఎస్​యూవీకి ఇప్పటికే క్రేజ్​ విపరీతంగా ఉంది. వచ్చే ఏడాది జనవరిలో బుకింగ్స్​ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. సంస్థ పెండింగ్​ ఆర్డర్ల జాబితా మరింత ఎక్కువగా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం