Kia Carens price increased : భారతీయులకు షాక్ ఇచ్చింది కియా మోటార్స్. త్రీ రో ఎంపీవీ క్యారెన్స్ ధరలను మళ్లీ పెంచింది. క్యారెన్స్ ధరలను కియా పెంచడం.. 8 నెలల్లో ఇది రెండోసారి. వేరియంట్ ఆధారంగా.. రూ. 50,000 వరకు ధరలను పెంచింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15న క్యారెన్స్ను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసింది కియా. అప్పుడు దాని ధర(ఎక్స్‌షోరూం) రూ. 8.99లక్షలుగా ఉండేది. ఆ తర్వాత కొన్ని వారలకే ధరలను పెంచింది. నాడు పలు వేరియంట్లపై రూ. 70,000 వరకు హైక్ తీసుకుంది.
Kia Carens price hike : తాజా లెక్కల ప్రకారం.. కియా క్యారెన్స్ టాప్ ఎండ్ డీజిల్ 6ఏటీ లగ్జరీ ప్లస్ 7 సీటర్ ధర రూ. 17.99లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది. ధరల పెంపునకు ముందు అది రూ. 16.99లక్షలుగా ఉండేది.
ఇక 1.5 6ఎంటీ ప్రెస్టీజ్ 7 సీటర్, 1.5 6ఎంటీ ప్రీమియం 7 సీటర్ వేరింట్ ధరలు కూడా పెరిగాయి. ఆ ధరలు (ఎక్స్‌షోరూం) రూ. 11.30లక్షలు- 14లక్షల మధ్యలో ఉన్నాయి.
కియా క్యారెన్స్లోని డీజిల్ సెగ్మెంట్ టాప్ వేరియంట్లపై రూ. 30వేలు పెరిగింది. అయితే.. లగ్జరీ మేన్యువల్ 7 సీటర్‌కు మాత్రం రూ. 35వేలు పెరిగాయి.
ఇక కియా క్యారెన్స్ 1.4 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ వేరియంట్స్‌పై రూ. 10,000- రూ. 20,000 మధ్యలో రేట్లు పెరిగాయి.
Kia Carens waiting period : కియా మోటర్స్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న వాహనాల్లో క్యారెన్స్ ఒకటి. సెల్టోస్, సోనెట్ తర్వాత మూడో స్థానంలో ఉంది కియా క్యారెన్స్. గత నెలలో 5,479 క్యారెన్స్ కార్లు అమ్ముడుపోయాయి. ఇక ఈ కియా క్యారెన్స్కు సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. కొన్ని వేరియంట్లకు అత్యధికంగా 75వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ప్రెస్టీజ్ 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌కు 74-75 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. లగ్జరీ, లగ్జరీ ప్లస్ 7 వేరియంట్లకు 18-19 వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.
కియా మోటార్స్ వాహనాల వెయిటింగ్ పీరియడ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కియా క్యారెన్స్‌లో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5లీటర్ పెట్రోల్ వేరియంట్.. 115పీఎస్, 144 ఎన్ఎం టర్క్‌ను జనరేట్ చేస్తుంది. 1.5లీటర్ డీజిల్ ఇంజిన్.. 250ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయగలదు. .14లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 140పీఎస్, 242ఎన్ఎం టార్క్‌ను జనరేచ్ చేస్తుంది.
హుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, మారుతీ సుజుకీ ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, ఇన్నోవా క్రిస్టాకు.. ఈ కియా క్యారెన్స్ గట్టి పోటీనిస్తోంది.
సంబంధిత కథనం