Kia cars waiting period : ‘కియా’ కార్ల వెయిటింగ్​ పీరియడ్​కి.. మైండ్​ పోవాల్సిందే!-booked kia carens this is how long you have to wait to get it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Cars Waiting Period : ‘కియా’ కార్ల వెయిటింగ్​ పీరియడ్​కి.. మైండ్​ పోవాల్సిందే!

Kia cars waiting period : ‘కియా’ కార్ల వెయిటింగ్​ పీరియడ్​కి.. మైండ్​ పోవాల్సిందే!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2022 05:07 PM IST

Kia cars waiting period : కియా కారెన్స్​, సెల్టోస్​, సోనెట్​.. ఇలా అన్ని మోడల్స్​కు భారీగా వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. ఒక్కోసారి అది 75వారాలుగా ఉండటం గమనార్హం.

<p>కియా కార్ల వెయిటింగ్​ పీరియడ్​ చూస్తే.. మైండ్​ పోవాల్సిందే</p>
<p>కియా కార్ల వెయిటింగ్​ పీరియడ్​ చూస్తే.. మైండ్​ పోవాల్సిందే</p>

Kia cars waiting period : కొవిడ్​ సంక్షోభం నుంచి ఆటో రంగం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ల లభ్యత పెరుగుతుండటం సానుకూల విషయం. అయినప్పటికీ.. అనేక వాహనాల వెయిటింగ్​ పీరియడ్​ చాలా దారుణంగా ఉంటోంది! ముఖ్యంగా ఇండియాలో కియా మోటార్స్​ కార్ల వెయిటింగ్​ పీరియడ్​ గురించి తెలిస్తే మైండ్​ పోవాల్సిందే. ఆ సంస్థ తాజాగా లాంచ్​ చేసిన కియా కారెన్స్​కు ఏకంగా 75వారాల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తుండటం గమనార్హం.

సాధారణంగా.. ఎంపీవీలకు పెద్దగా డిమాండ్​ ఉండదు. కానీ ఎంపీవీ అయిన కియా కారెన్స్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఫలితంగా బుక్సింగ్​ వెల్లువెత్తుతున్నాయి. కానీ అందుకు తగ్గట్టు డెలివరీలు ఉండటం లేదు. కియా కారెన్స్​లోని కొన్ని వేరియంట్లకు 75వారాల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. కియా కారెన్స్​ బేస్​ వేరియంట్​ ధర(ఎక్స్​షోరూమ్​) రూ. 9.6లక్షలుగా ఉంది. టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 17.70లక్షలు.

కియా కారెన్స్​ 1.5లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​, మ్యాన్యువల్​ గేర్​బాక్స్​ వేరియంట్​ వెయిటింగ్​ పీరియడ్​ 74-74వారాల మధ్యలో ఉంది. కియా కారెన్స్​ లగ్జరీ, లగ్జరీ ప్లస్​ 7 వేరియంట్ల వెయిటింగ్​ పీరియడ్​ 18-19 వారాల మధ్యలో ఉంది.

కియా సోనెట్​ కూడా..

Kia Sonet waiting period : ఇక ఎస్​యూవీ సెగ్మెంట్​లో దూసుకెళుతున్న సోనెట్​ కథ కూడా ఇంతే! కియా సోనెట్​ హెచ్​డీఎక్స్​ డీసీటీ ట్రిమ్​ వేరియంట్​ వెయిటింగ్​ పీరియడ్​ 40-41 వారాల మధ్య నడుస్తోంది. డీజిల్​ ఇంజిన్​తో కూడిన హెచ్​టీఎక్స్​ ఏఈ, హెచ్​టీఎక్స్​ ఏఈ ఏటీ వేరియంట్లు, హెచ్​టీఎక్స్​ డీసీటీ ఏఈ వేరియంట్లకు వెయిటింగ్​ పీరియడ్​ 13-14 వారాలుగా ఉంది. ఇదే అత్యల్పం కావడం గమనార్హం.

కియా సోనెట్​ బేస్​ వేరియంట్​ ఎక్స్​ షోరూం ధర రూ. 7.49లక్షలుగా ఉంది. టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 13.99లక్షలుగా ఉంది.

కియా సెల్టోస్​కు 14 వారాలు..!

Kia Seltos waiting period : కియాలో బెస్ట్​ సెల్లింగ్​ మోడెల్​గా గుర్తింపు పొందిన సెల్టోస్​కి కూడా వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువగానే ఉంది. జీటీఎక్స్​ ప్లస్​, జీటీఎక్స్​ఓ, జీటీఎక్స్​ ప్లస్​ ఏటీ ఎక్స్​-లన్​, హెచ్​టీకే ప్లస్​, హెచ్​టీకే ప్లస్​, హెచ్​టీకే ప్లస్​ ఐఎంటీ, హెచ్​టీఎక్స్​ ప్లస్​ వేరియంట్లకు ఏకంగా 13-14 వారాల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. ఇక హెచ్​టీఈ వేరియంట్​కు అత్యధికంగా 32-33 వారాల డెలివరీ పీరియడ్​ ఉంది.

కియా సెల్టోస్​ బేస్​ వేరియంట్​ ధర రూ. 10.49లక్షలుగాను, టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 18.65లక్షలుగాను ఉంది.

Kia motors : కారెన్స్​, సోనెట్​, సెల్టోస్​తో పాటు కార్నివాల్​ను కూడా సేల్​ చేస్తుంది కియా. ఇది ప్రీమియం ఎంపీవీ మోడల్​.

ఇక ఇండియాలో కియా మోటర్స్​ అద్భుతంగా రాణిస్తోంది. సెప్టెంబర్​లో 25,827 యూనిట్లను విక్రయించింది. ఒక నెలలో ఇంత మొత్తంలో కార్లు అమ్మడం కియాకు ఇదే తొలిసారి! వీటిల్లో కియా సెల్టోస్​ అత్యధికంగా అమ్ముడుపోయింది.

సంబంధిత కథనం