Jeep India price hike : భారీగా పెరగనున్న 'జీప్' ఎస్‌యూవీల ధరలు!
Jeep India price hike : వాహనాల ధరలను భారీగా పెంచాలని జీప్ ఇండియా ఫిక్స్ అయ్యింది. 2023 జనవరి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
Jeep India price hike : 2023 తొలినాళ్లల్లో వాహనాల ధరలు పెంచుతున్న ఆటో సంస్థల జాబితాలో జీప్ ఇండియా కూడా చేరింది. మోడల్, వేరియంట్‌ను బట్టి.. 2-4శాతం వరకు ధరలను పెంచాలని నిర్ణయించుకుంది ఈ ఆటో సంస్థ. జీప్ కంపాస్, మెరీడియన్, వ్రాంగ్లన్తో పాటు కొత్త లాంచ్ అయిన జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్యూవీపైనా ఈ భారం పడనుంది.
జీప్ ఇండియా తీసుకున్న ధరల పెంపు నిర్ణయం.. 2023 జనవరి నుంచే అమల్లోకి రానుంది. వాస్తవానికి జీప్ కంపాస్ ధర నవంబర్లోనే పెరిగింది. సంస్థకు ఎంట్రీ లెవెల్ వెహికిల్‌గా భావిస్తున్న కంపాస్ ధర అప్పుడే.. ఏకంగా రూ. 1.20లక్షలు పెరగడం గమనార్హం. హ్యుందాయ్ టుక్సన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్ వంటి వెహికిల్స్‌కు ఈ జీప్ కంపాస్ గట్టిపోటీనిస్తోంది.
రీసెంట్గా లాంచ్ అయిన మోడల్స్‌పై ధరలు పెంచడం చాలా అరుదు. కానీ ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన జీప్ గ్రాండ్ చెరోకీపైనా ధరలు పెరగడం గమనార్హం. గత నెలలో రూ. 77.50లక్షల(ఎక్స్‌షోరూం) వద్ద లాంచ్ అయ్యింది ఈ ఎస్యూవీ.
జీప్ గ్రాండ్ చెరోకీ ఫీచర్స్..
Jeep Grand Cherokee price in India : ఈ జీప్ గ్రాండ్ చెరోకీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇందులో డీజిల్ ఇంజిన్ లేదు. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 268బీహెచ్పీ పవర్‌ను, 400ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టెమ్ దీని సొంతం. ఆటో, స్పోర్ట్, మడ్, స్నో వంటి మోడ్స్ ఇందులో ఉన్నాయి.
ఈ జీప్ గ్రాండ చెరోకీలో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 10 ఇంచ్ హెచ్యూడీ యూనిట్, వయర్లెస్ ఛార్జింగ్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, ఫ్రెంట్ ప్యాసింజర్ల కోసం 10.1 ఇంచ్ స్క్రీన్, రేర్ ప్యాసింజర్స్ కోసం ఎంటర్నైన్మెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. పవర్డ్ టెయిల్‌గేట్, పానారోమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్ కూడా ఉన్నాయి.
Tata motors price hike : టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హోండా, హ్యుందాయ్, సిట్రోయెన్‌తో పాటు అనేక సంస్థల వాహనాల ధరలు 2023 జనవరి నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు సంస్థలు ఇప్పటికే ప్రకటనలు చేసేశాయి. ద్రవ్యోల్బణం, ముడిసరకు ధరలు పెరగడం వంటి కారణాలతో వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని ఆటో సంస్థలు చెబుతూనే ఉన్నాయి. కొత్తగా ఆర్డర్ చేసిన లేదా వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్న వాహనాలపై ఈ ప్రభావం పడనుంది.