Jeep Grand Cherokee launch : ఇండియాలో జీప్​ గ్రాండ్​ చెరోకీ లాంచ్​.. ధర ఎంతంటే!-jeep grand cherokee launched in india see price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jeep Grand Cherokee Launch : ఇండియాలో జీప్​ గ్రాండ్​ చెరోకీ లాంచ్​.. ధర ఎంతంటే!

Jeep Grand Cherokee launch : ఇండియాలో జీప్​ గ్రాండ్​ చెరోకీ లాంచ్​.. ధర ఎంతంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 07:59 AM IST

Jeep Grand Cherokee launched in India : జీప్​ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ఎస్​యూవీ గ్రాండ్​ చెరోకీ.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ వాహనం ధరతో పాటు మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

జీప్​ గ్రాండ్​ చెరోకీ...
జీప్​ గ్రాండ్​ చెరోకీ... (HT AUTO)

Jeep Grand Cherokee launched in India : జీప్​ గ్రాండ్​ చెరోకీ.. ఇండియా మార్కెట్​లోకి వచ్చేసింది! గురువారం జరిగిన ఓ ఈవెంట్​లో.. గ్రాండ్​ చెరోకీని లాంచ్​ చేసింది జీప్​ ఇండియా సంస్థ. దీని ఎక్స్​షోరూం ధర రూ. 77.5లక్షలుగా ఉంది. ఓ అమెరికా ఆటోమొబైల్​ సంస్థ.. ఇండియాలో లాంచ్​ చేస్తున్న అత్యంత ఖరీదైన ఎస్​యూవీ ఇదే! అంతర్జాతీయ మార్కెట్​లో ఇప్పటికే లాంచ్​ అయిన జీప్​ గ్రాండ్​ చెరోకీ.. ఇప్పుడు ఇండియా రోడ్ల మీద కూడా చక్కర్లు కొట్టనుంది. అంతేకాకుండా.. జీప్​ గ్రాండ్​ చెరోకీకి రైట్​ హ్యాండ్​ డ్రైవింగ్​ మోడల్​ లభిస్తుండటం ఇదే తొలిసారి.

డెలివరీ ఎప్పటి నుంచంటే..!

ఈ ఎస్​యూవీ డిజైన్​ బోల్డ్​గా, అగ్రెసివ్​గా ఉంది. హైలీ పవర్​ పాక్డ్​ పర్ఫార్మెన్స్​ను జనరేట్​ చేసే విధంగా.. ఈ జీప్​ గ్రాండ్​ చెరోకీలో సరికొత్త టెక్నాలజీని వినియోగించారు. ఇండియాలో ఈ ఎస్​యూవీ డెలివరీలు ఈ నెల చివరి నుంచి ప్రారంభంకానున్నట్టు సంస్థ వెల్లడించింది.

Jeep Grand Cherokee price in India : ఇక జీప్​ గ్రాండ్​ చెరోకీ డిజైన్​ విషయానికొస్తే.. ఇందులో సెవెన్​ స్లాట్​ ఫ్రంట్​ గ్రిల్​ ఉంది. దీనికి క్రోమ్​ ట్రిమ్ ఫినిషింగ్​ లభించింది. ఫ్రంట్​ గ్రిల్​కి హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ యూనిట్స్​ ఉన్నాయి. బంపర్​ని కూడా రీడిజైన్​ చేసినట్టు కనిపిస్తోంది. 5స్పోక్​ మెషిన్డ్​ అలోయ్​ వీల్స్​ ఇందులో ఉంటాయి.

2022 జీప్​ గ్రాండ్​ చెరోకీలో 533ఎంఎం వాటర్​ వేడింగ్​ కేపబులిటీ, 215 ఎంఎం గ్రౌండ్​ క్లియరెన్స్​ ఉంది. ఆఫ్​రోడ్​లో సులువుగా డ్రైవింగ్​ చేసే అనుభూతిని ఇది ఇస్తోంది. ఈ ఎస్​యూవీలో సరికొత్త క్వాడ్రాట్రాక్​ 4X4 సిస్టెమ్​ని అమర్చారు. కఠినమైన రోడ్ల మీద డ్రైవింగ్​ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Jeep Grand Cherokee India : 10.1 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍ను జీప్ గ్రాండ్ చెరోకీ కలిగి ఉంది. దీనికి ఇది ప్రధాన ఆకర్షణగా ఉంది. పూర్తి డిజిటలైజ్డ్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా ఉంటుంది. పనోరామిక్ సన్‍రూఫ్, డ్యాష్‍బోర్డుపై ప్యాసింజర్ స్క్రీన్ ఉన్నాయి. ఐదు సీటర్ల కన్‍ఫిగరేషన్‍తో ఈ ఎస్‍యూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ జీప్​ గ్రాండ్​ చెరోకీకి 1,076 లీటర్ల బూట్​ స్పేస్​ లభిస్తోంది. రెండో రో సీట్​ను దించితే.. ఈ బూట్​ స్పేస్​ మరింత పెరుగుతుంది.

జీప్​ గ్రాండ్​ చెరోకీ.. 2.0 లీటర్​ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్​ ఇంజిన్​ వర్షెన్​లో వస్తోంది. 270హెచ్​పీ పవర్​, 400ఎన్​ఎం మ్యాగ్జిమం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది.

జీప్ నుంచి దేశంలో ప్రస్తుతం కంపాస్, మెరిడియన్, వ్రాంగ్లర్ మోడల్స్ మోడల్స్ లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7మిలియన్​లకు పైగా ఎస్​యూవీలు అమ్ముడుపోయాయి.

ఇక ఈ జీప్​ గ్రాండ్​ చెరోకీ.. బీఎండబ్ల్యూ ఎక్స్​5, ఆడీ క్యూ7, మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​, రేంజ్​ రోవర్​ స్పోర్ట్​, వోల్వో ఎక్స్​సీ90 మొదలైన లగ్జరీ కార్లతో పోటీగా నిలువనుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

సంబంధిత కథనం

టాపిక్