Maruti Suzuki Grand Vitara CNG : గ్రాండ్ విటారా సీఎన్జీ లాంచ్.. ధర ఎంతంటే!
Maruti Suzuki Grand Vitara S CNG launched : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధరతో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Maruti Suzuki Grand Vitara S CNG launched : సీఎన్జీ లాంచ్‌లతో బిజీబిజీగా ఉంటున్న దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. మరో మోడల్‌తో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఫ్లాగ్షిప్ ఎస్యూవీ, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న గ్రాండ్ విటారాకు సీఎన్జీ వర్షెన్‌ను తీసుకొచ్చింది. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఎస్- సీఎన్జీని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఎస్- సీఎన్జీ డెల్టా వేరియంట్ ధర రూ. 12.85లక్షలు (ఎక్స్‌షోరూం). జీటా వేరియంట్ ధర రూ. 14.84లక్షలు (ఎక్స్‌షోరూం ప్రైజ్).
డెల్టా, జీటాతో పాటు సిగ్మా, ఆల్ఫా వేరియంట్లలో కూడా గ్రాండ్ విటారా అందుబాటులో ఉంది. కానీ ఆ రెండు వేరియంట్లకు సీఎన్జీ వర్షెన్‌ను ఇవ్వలేదు మారుతీ సుజుకీ. జీటా, ఆల్ఫాకు స్ట్రాంగ్ హైబ్రీడ్ ఆప్షన్ కూడా ఉంది.
ఇండియాలో త్వరలో లాంచ్‌కానున్న సీఎన్జీ వాహనాల వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
సీఎన్జీపై మారుతీ సుజుకీ దృష్టి..
Maruti Suzuki Grand Vitara CNG price : గ్రాండ్ విటారా ఎస్- సీఎన్జీ లాంచ్‌తో.. ఈ సెగ్మెంట్లో మారుతీ సుజుకీకి ఉన్న మోడల్స్ సంఖ్య 14కు పెరిగింది. సీఎన్జీతో కూడిన ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న ఏకైక వాహనం ఈ గ్రాండ్ విటారా. ఇందులో స్మార్ట్‌ప్లే ప్రో+, ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్-బిల్ట్ నెక్స్ట్ జెన్ సుజుకీ కనెక్ట్, 40+ కనెక్టెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
ఇక మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఎస్- సీఎన్జీలో కే సిరీస్ 1.5లీటర్ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వీవీటీ ఇంజిన్ ఉంటుంది. అనేక మారుతీ వాహనాల్లోనూ ఇదే ఇంజిన్ ఉంటుంది. ఇది.. 5,500 ఆర్పీఎం వద్ద 86.63బీహెచ్పీ పవర్‌ను, 4,200 ఆర్పీఎం వద్ద 121.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్ 26.6 కి.మీ/కేజీ అని మారుతీ సుజుకీ చెబుతోంది. ఎస్- సీఎన్జీ వేరియంట్లో 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ సెటప్ ఉంటుంది.
Maruti Suzuki Grand Vitara CNG features : పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ మాత్రం.. 6,000 ఆర్పీఎం వద్ద 88బీహెచ్పీ పవర్‌ను, 4,400 ఆర్పీఎం వద్ద 136ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక స్ట్రాంగ్ హైబ్రీడ్ వెర్షెన్.. 5,500 ఆర్పీఎం వద్ద 114బీహెచ్పీ పవర్‌ను, 4,400- 4,800 ఆర్పీఎం వద్ద 122ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఎస్యూవీ సెగ్మెంట్లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టెమ్ ఉన్న ఏకైక మోడల్ ఈ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా.