CNG price hike : మళ్లీ పెరిగిన సీఎన్జీ ధర.. వాహనదారులపై మరింత భారం!
IGL CNG price hike : సీఎన్జీ ధరలను పెంచుతున్నట్టు ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
IGL CNG price hike : దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరను మరోమారు పెంచింది ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్). ముడిసరకు ధరలు పెరగడం కారణంగా.. మళ్లీ సీఎన్జీ ధరలను పెంచినట్టు ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
"ఇన్పుట్ గ్యాస్ కాస్ట్ పెరగడంతో.. 17/12/2022 ఉదయం 6 గంటల నుంచి సీఎన్జీ రీటైల్ ధరను పెంచుతున్నాము," అని ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
తాజా పెంపుతో.. ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర రూ. 79.56కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్‌లో కేజీ సీఎన్జీ ధర రూ. 82.12కి పెరిగింది. గురుగ్రామ్‌లో కేజీ సీఎన్జీ ధర రూ. 87.89గా ఉంది.
ఇతర నగరాల్లో సీఎన్జీ ధరల వివరాలు..
- CNG price hike latest news : రేవారీలో కేజీ సీఎన్జీ ధర:- 89.57
- కర్నాల్- కైతాల్‌లో కేజీ సీఎన్జీ ధర:- రూ .88.22
- ముజాఫర్‌నగర్, షమ్లి, మీరట్‌లో కేజీ సీఎన్జీ ధర:- రూ. 86.79
- అజ్మేర్, పాలి, రాజసమంద్‌లో కేజీ సీఎన్జీ ధర:- రూ. 89.83
కాన్పూర్, ఫతేహ్పూర్, హమీర్‌పూర్‌లో కేజీ సీఎన్జీ ధరలో ఎలాంటి మార్పులు లేవు.
CNG price in Hyderabad : హైదరాబాద్‌లో కేజీ సీఎన్జీ ధర ప్రస్తుతం రూ. 95గా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఈ ధర రూ. 3 పెరిగింది.
ధరల పెంపుతో భారం..
పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సీఎన్జీవైపు అడుగులు వేశారు. కానీ ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా పెరగడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్‌లపై తీవ్ర భారం పడుతోంది. రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి.
సంబంధిత కథనం