Top CNG Cars Under 10 Lakh : రూ . 10లక్షలలోపు.. టాప్ సీఎన్జీ కార్లు ఇవే!
Top 10 CNG Cars Under ₹10 Lakh in India : రూ. 10లక్షల లోపు మంచి సీఎన్జీ కారును కొనాలని భావిస్తున్నారా? అయితే ఈ లిస్ట్‌పై ఓ లుక్కేయండి..
Top 10 CNG Cars Under ₹10 Lakh in India : సీఎన్జీ కారును కొనాలని మీరు భావిస్తున్నారా? మార్కెట్లో ఉన్న సీఎన్జీ ఆప్షన్స్‌లో ది బెస్ట్ ఏంటి? అని వెతుకుతున్నారా? అయితే.. ఇది మీకోసమే. మార్కెట్లో రూ. 10లక్షల లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్ సీఎన్జీ వాహనాల లిస్ట్‌పై మీరూ ఓ లుక్కేయండి..
మారుతీ ఆల్టో 800
Maruti Alto 800 CNG : మారుతీ ఆల్టో 800ని.. మోస్ట్ అఫార్డిబుల్ సీఎన్జీ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 41పీఎస్, 60ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్‌మీషన్ దీని సొంతం.
- మైలేజ్:- 31.59 కి.మీ/కేజీ
- వేరియంట్:- ఎల్ఎక్స్ఐ.
- ధర:- రూ. 5.55లక్షలు.
మారుతీ ఎస్ ప్రెస్సో..
Maruti S Presso CNG price : మారుతీ నుంచి మరో సీఎన్జీ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఈ ఎస్ ప్రెస్సో. ఇందులో 1 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 57పీఎస్, 82.1ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా 5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్మీషనే ఉంది.
- మైలేజ్:- 32.73 కి.మీ/కేజీ
- వేరియంట్లు:- ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ
- ధర:- రూ. 6.42లక్షలు- రూ. 6.82లక్షలు.
టాటా టియాగో..
Tata Tiago CNG : టియాగోతో.. సీఎన్జీ సెగ్మెంట్లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టింది దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్. 2022లోనే ఇది లాంచ్ అయ్యింది. సీఎన్జీ మోడ్‌లోనే స్టార్ట్ అయ్యే.. తొలి కారు ఇదే కావడం విశేషం. ఇందులో 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 73పీఎస్, 95ఎన్ఎం టార్క్‌ని ఇది జనరేట్ చేస్తుంది. 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ దీని సొంతం.
- మైలేజ్:- 26.49కి.మీ/కేజీ
- వేరియంట్లు:- ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌టీ, ఎక్స్జెడ్+, ఎక్స్జెడ్+ డీటీ.
- ధర:- రూ. 7.18లక్షలు- రూ. 8.86లక్షలు
మారుతీ వాగన్ ఆర్..
Maruti Wagon R CNG price : ప్రస్తుతం మార్కెట్లో.. మారుతీ వాగన్ ఆర్‌లో 1లీటర్, 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 1లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు మాత్రమే సీఎన్జీ కిట్‌ను ఇచ్చింది మారుతీ సంస్థ. ఇది 57పీఎస్, 82.1ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ దీని సొంతం.
- మైలేజ్:- 34.05కి.మీ/కేజీ
- వేరియంట్:- ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ
- ధర:- రూ. 7.20లక్షలు- 7.73లక్షలు
మారుతీ సెలేరియో..
Maruti Celerio CNG price : మారుతీ సెలేరియోకు చెందిన సింగిల్ వేరియంట్ సీఎన్జీ మోడల్ అందుబాటులో ఉంది. ఇందులో 1లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 57పీఎస్, 82ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ దీని సొంతం.
- మైలేజ్:- 35.6కి.మీ/కేజీ
- వేరియంట్:- వీఎక్స్ఐ
- ధర:- రూ. 7.51లక్షలు
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..
Hyundai Grand i10 Nios CNG variant : మొత్తం మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. ఇందులో 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 69పీఎస్, 95.2ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది.
- వేరియంట్లు:- మాగ్మా, స్పోర్ట్జ్, ఆస్టా
- ధర:- రూ. 8.13లక్షలు- రూ. 9.56లక్షలు
టాటా టిగోర్..
Tata Tigor CNG price : ఈ లిస్ట్‌లో.. అత్యధిక వేరియంట్లు ఉన్నవి టాటా టిగోర్కే. మొత్తం మీద టాటా టిగోర్‌లో 8 సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయి టాటా టిగోర్‌లో. ఈ సెడాన్ మోడల్‌కు 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 73పీఎస్, 95ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంది.
- మైలేజ్:- 26.49కి.మీ/కేజీ
- వేరియంట్లు:- ఎక్స్ఎం, ఎక్స్జెడ్, ఎక్స్జెడ్+, ఎక్స్జెడ్+ డీటీ, ఎక్స్జెడ్ + లెథరేట్ ప్యాక్, ఎక్స్జెడ్+ లెథరేట్ ప్యాక్ డీటీ.
- ధర:- రూ. 8.44లక్షలు- రూ. 9.91లక్షలు
మారుతీ స్విఫ్ట్..
Maruti Swift CNG model : ప్రముఖ స్వీఫ్ట్ మోడల్‌కు సీఎన్జీ ఆప్షన్ కూడా ఇచ్చింది మారుతీ. ఇది ఈ మధ్యే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 1.2లీటర్ డ్యుయెల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 77పీఎస్, 98.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది.
- మైలేజ్:- 30.90కి.మీ/కేజీ
- వేరియంట్లు:- వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ
- ధర:- రూ. 8.75లక్షలు- 9.49లక్షలు
మారుతీ డిజైర్..
Maruti Dzire CNG price :ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 77పీఎస్ పెట్రోల్+ సీఎన్జీ ఆప్షన్ ఇచ్చింది మారుతీ.
మైలేజ్:- 31.12కి.మీ/కేజీ
వేరియంట్లు:- వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ
ధర:- రూ. 9.22లక్షలు- 9.97లక్షలు
మారుతీ బలెనో..
Maruti Baleno CNG variants : బలెనోలో సీఎన్జీ ఆప్షన్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఇందులో 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 77.5పీఎస్, 98.5ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది.
- మైలేజ్:- 30.61కి.మీ/కేజీ
- వేరియంట్లు:- డెల్టా, జెటా
- ధర:- రూ. 9.29లక్షలు
* పైన చెప్పిన ధరలన్నీ ఆన్-రోడ్ ప్రైజ్‌లు. ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం సమీప డీలర్షిప్ షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్