Maruti Suzuki Baleno S-CNG : బలెనో, ఎక్స్​ఎల్​6కి 'సీఎన్​జీ' టచ్​.. ధరలు ఎంతంటే!-maruti suzuki baleno scng xl6 scng launched in india check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Baleno S-cng : బలెనో, ఎక్స్​ఎల్​6కి 'సీఎన్​జీ' టచ్​.. ధరలు ఎంతంటే!

Maruti Suzuki Baleno S-CNG : బలెనో, ఎక్స్​ఎల్​6కి 'సీఎన్​జీ' టచ్​.. ధరలు ఎంతంటే!

Maruti Suzuki Baleno S-CNG Launched in India : బలెనో, ఎక్స్​ఎల్​6 మోడల్స్​కు సీఎన్​జీ టచ్​ ఇచ్చింది మారుతీ సుజుకీ. వీటిని సోమవారం లాంచ్​ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బలెనో, ఎక్స్​ఎల్​6కి 'సీఎన్​జీ' టచ్​.. ధరలు ఎంతంటే!

Maruti Suzuki Baleno S-CNG Launched in India : బలెనో, ఎక్స్​ఎల్​6 మోడల్స్​కు సంబంధించిన సీఎన్​జీ వేరియంట్లను సోమవారం లాంచ్​ చేసింది మారుతీ సుజుకీ. నెక్సా రేంజ్​ నుంచి సీఎన్​జీ టెక్నాలజీతో వస్తున్న తొలి మోడల్స్​గా బలెనో, ఎక్స్​ఎల్​6 నిలిచాయి. కాగా.. మారుతీకి చెందిన ఎన్నో సీఎన్​జీ కార్లు ఇప్పటికే రోడ్డు మీద ఉన్నాయి.

ఎస్​-సీఎన్​జీ టెక్నాలజీతో..

సీఎన్​జీ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోందని మారుతీ పేర్కొంది. రన్నింగ్​ కాస్ట్​ కూడా తక్కువగా ఉంటుందని కస్టమర్లు ఆలోచిస్తున్నట్టు వివరించింది. అందుకే.. సీఎన్​జీ వాహనాలను లాంచ్​ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Maruti Suzuki Baleno S-CNG : మారుతీ సుజుకీ బలెనో ఎస్​- సీఎన్​జీ డెల్టా వేరియంట్​ ప్రారంభ ధర రూ. 8.28లక్షలుగా ఉంది. ఇక జెటా వేరియంట్​ ధర రూ. 9.21లక్షలుగా ఉంది. ఎక్స్​ఎల్​6 సీఎన్​జీ జెటా వేరియంట్​ ధర రూ. 12.24లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్​షోరూం ధరలు. అంటే.. బలెనో నుంచి రెండు సీఎన్​జీ వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఎక్స్​ఎల్​6 నుంచి ఒకటి మాత్రమే లభిస్తోంది.

డీజిల్​ ఇంజిన్​లకు ఇప్పటికే స్వస్తి చెప్పిన మారుతీ సుజుకీ.. సీఎన్​జీ కార్లకు ప్రాధాన్యత ఇస్తోంది. వాగన్​ఆర్​, ఆల్టో, ఈకో వేరియంట్లకు 2010లోనే సీఎన్​జీ టెక్నాలజీని ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. బలెనో, ఎక్స్​ఎల్​6 మోడల్స్​కు ‘ఎస్​-సీఎన్​జీ’ టెక్నాలజీని సమకూర్చింది. మొత్తం మీద ప్రస్తుతం మారుతీ వద్ద 12 సీఎన్​జీ మోడల్స్​ ఉన్నాయి.

Maruti Suzuki XL6 S-CNG హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​లో బలెనో, ప్రీమియం సెగ్మెంట్​లో ఎక్స్​ఎల్​6కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ రెండు మోడల్స్​కి అప్డేట్​ వర్షెన్​ను మార్కెట్​లో విడుదల చేసింది మారుతీ సుజుకీ.

ఇక బలెనో ఎస్​-సీఎన్​జీ.. 600 ఆర్​పీఎం వ్ద 77.49పీఎస్​, 4300 ఆర్​పీఎం 98.5ఎన్​ఎం టార్క్​ జనరేట్​ చేస్తుంది. ఎక్స్​ఎల్​6 ఎస్​ సీఎన్​జీ.. 5,500 ఆర్​పీఎం వద్ద 87.83పీఎస్​ను, 4,200 ఆర్​పీఎం వద్ద 121.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఈ రెండ వాహనాలను కొనుగోలు చేయకుండానే మీరు మీ సొంతం చేసుకోవచ్చు! బలెనో ఎస్​ సీఎన్​జీకీ నెలకు రూ. 18,403.. ఎక్స్​ఎల్​6 ఎస్​-సీఎన్​జీకి నెలకు రూ. 30,821 చెల్లించి సబ్​స్క్రిప్షన్​ మోడ్​లో కార్లను పొందవచ్చు.

త్రైమాసిక ఫలితాలు..

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(Q2)లో మారుతీ సుజుకీ వాహన శ్రేణి అమ్మకాల విలువ రూ. 28,543.5 కోట్లుగా తేలింది. అలాగే, లాభాలు గత సంవత్సరం Q2తో పోలిస్తే.. నాలుగు రెట్లు పెరిగాయి. మారుతీ సుజుకీ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం