Top SUVs in India : రూ. 10లక్షలలోపు టాప్-5 ఎస్‌యూవీలు ఇవే..!
Top SUVs in India under rs 10lakh : కొత్త కారు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. రూ. 10లక్షల లోపు అందుబాటులో ఉన్న ఈ టాప్-5 ఎస్‌యూవీలపై ఓ లుక్కేయండి..
Top SUVs in India under rs 10lakh in India : దేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆటో సంస్థలు కొత్త కొత్త ఎస్‌యూవీలతో కస్టమర్లను పలకరిస్తున్నాయి. అయితే.. ఈ ఎస్‌యూవీల ధరలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇండియాలో సరసమైన ధరల్లో కూడా ఎస్‌యూవీలు లభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హుందాయ్ వంటి సంస్థలకు చెందిన కొన్ని ఎస్‌యూవీలు.. రూ. 10లక్షల లోపే ఉంటున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో సీఎన్జీ..
Maruti Suzuki S-Presso CNG : ఈ వాహనం ప్రారంభ(ఎక్స్‌షోరూం) ధర రూ. 5.90లక్షలు. ఇందులో కే-సిరీస్ 1.0 లీటర్ ఇంజిన్ ఉంటుంది. 56బీహెచ్పీ మ్యాగ్జిమమ్ పవర్‌ను ఇది జనరేట్ చేస్తుంది. ఈ మారుతీ సుజుకీ ఎస్ప్రెస్సో సీఎన్జీ ఎల్ఎక్స్ఐ- వీఎక్స్ఐ వేరియంట్లలో లభిస్తుంది.
హుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్..
Hyundai Venue Facelift : పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, టైటాన్ గ్రే, ఫైరీ రెడ్, ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ వంటి రంగుల్లో ఈ ఎస్యూవీ అందుబాటులో ఉంది. ఇందులో డ్రైవ్ మోడ్.. చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ఇందులో నార్మల్, ఎకో, స్పోర్ట్ మోడ్స్ కూడా ఉన్నాయి. కప్పా 1.2ఎంపీఐ పెట్రోల్ వర్షెన్ హుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7,53,100గా ఉంది.
కియా సోనెట్..
Kia Sonet : కియా సోనెట్ ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధర రూ. 7.17లక్షలు. సైడ్ ఎయిర్‌బ్యాగ్, హైలైన్ టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి. ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న వాహనాల్లో కియా సోనెట్ ఒకటి. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబులిటీ మేనేజ్మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
రెనాల్ట్ ఖైగర్..
Renault Kiger : ఈ ఎస్యూవీ ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధర రూ. 5.84లక్షలు. దీనిని సీఎంఎఫ్‌ఏ+ ప్లాట్‌ఫాంపై నిర్మిస్తారు. మల్టీ సెన్స్ డ్రైవింగ్ మోడ్, గ్రేట్ రూమీనెస్, క్యాబిన్ స్టోరేజ్, కార్గో స్పేస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
మారుతీ బ్రీజా..
Maruti Breeza price : మారుతీ బ్రీజా ప్రారంభ(ఎక్స్ షోరూం) ధర రూ. 7.99లక్షలు. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే స్క్రీన్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రేర్ఏసీ వెంట్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రేర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్స్, టాగిల్ కంట్రోల్ ఆటో ప్యానెల్, పెడల్ షిఫ్టర్ కంట్రోల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మీషన్ ఆఫ్షన్స్ ఇందులో ఉన్నాయి.
సంబంధిత కథనం