Best budget cars in India : బడ్జెట్లో దొరుకుతున్న 'బెస్ట్' కార్స్ ఇవే.. ఓ లుక్కేయండి!
Best budget cars in India : బడ్జెట్లో మంచి కార్లను చూడాలనుకుంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.
Best budget cars in India : ఓ కారు కొనాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. బడ్జెట్లో కార్ల కోసం వెతుకుతూ ఉంటారు. వీరిలో మీరూ ఉన్నారా? బడ్జెట్లో ది బెస్ట్ కార్ ఒకటి తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
ట్రెండింగ్ వార్తలు
హుందాయ్ ఐ20 ఎన్ లైన్
Hyundai i20 N Line : సాధారణంగా ఐ20లో 120హెచ్‌పీ 1 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అయితే హుందాయ్ ఐ20 ఎన్ లైన్లో.. దీనికి తోటు సస్పెన్షన్ సెటప్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ ఎన్ లైన్ వేరియంట్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఇది 7 స్పీడ్ డీసీటీ, 6స్పీడ్ ఐఎంటీ గేర్‌బాక్స్ వేరియంట్లో అందుబాటులో ఉంది. ధర రూ. 10లక్షలు- రూ. 12.11లక్షలు
హోండా సిటీ..
Honda City 1.5 litre iVTECH : హోండా సిటీ 1.5 లీటర్ ఐవీటీఈసీ ఇంజిన్.. 121హెచ్‌పీని జనరేట్ చేస్తుంది. 6స్పీడ్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది. ఇందులో 6స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా హోండా సిటీ రైడ్ సాఫీగా సాగిపోతుంది! అందువల్ల ఈ కార్‌ను నడపడం చాలా సులభం. ధర రూ. 11.57లక్షలు- 15.32లక్షలు.
బడ్జెట్లో ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
స్కోడా స్లావియా..
Skoda Slavia price : స్కోడా స్లావియాకు అదిరిపోయే డిమాండ్ ఉంది. 1లీటర్ టీఎస్ఐ ఇంజిన్.. 115హెచ్‌పీని జరేట్ చేస్తుంది. ఇందులో 1.5లీటర్ టీఎస్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంది. ఇది 150హెచ్‌పీ, 250ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. స్కోడా స్లావియా 6స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్, 7స్పీడ్ డీసీజీ యూనిట్‌తో అందుబాటులో ఉంది. ధర రూ. 16.79లక్షలు0 18.39లక్షలు
స్లావియాపై దీపావళి డిస్కౌంట్లు ఇస్తోంది స్కోడా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిట్రోయెన్న్ సీ3..
Citroen C3 price : సిట్రోయెన్ సీ3 1.2లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది 110హెచ్‌పీ, 190 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇందులో రైడ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ కొన్ని ఫీచర్లు ఇందులో మిస్ అయ్యాయి. ధర రూ. 8.15లక్షలు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బోస్పోర్ట్..
Mahindra XUV300 TurboSport :ఇందులో 1.2లీటర్ త్రీ సిలిండర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 131హెచ్‌పీ, 230ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. దీని హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ ఇమ్ప్రెసివ్గా ఉంటుంది. ఎస్యూవీ సెగ్మెంట్‌కు కచ్చితంగా నప్పుతుంది. ధర రూ. 10.35లక్షల నుంచి మొదలు.
టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్..
Tata Punch Adventure Rhytm : టాటా పంచ్‌లో అడ్వెంచర్ రిథమ్ వేరియంట్.. వాల్యూ ఫర్ మనీలాగా ఉంటుంది. దీని 1199సీసీ త్రీ సిలిండర్ ఇన్లైన్ ఇంజిన్ ఉంటుంది. 84బీహెచ్పీ, 113ఎన్ఎం టార్క్‌ని ఇది జనరేట్ చేస్తుంది. 5 గేర్ మేన్యువల్తో పాటు ఆటోమేటిక్ వర్షెన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు సేఫ్టీకి పెట్టింది పేరు. క్రాష్ టెస్ట్‌లో ఇది 5స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ధర రూ. 7.65లక్షల నుంచి మొదలు.
సంబంధిత కథనం
2023 BMW M2 unveiled : బీఎండబ్ల్యూ ఎం2.. అదిరిందిగా!
October 15 2022