Maruti Suzuki's Q2 results: నాలుగు రెట్లు పెరిగిన మారుతి సుజుకి లాభాలు
Maruti Suzuki's Q2 results: భారత ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబర్ తో ముగిసే Q2 ఫలితాలను వెల్లడించింది.
Maruti Suzuki's Q2 results: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(Q2)లో Maruti Suzuki వాహన శ్రేణి అమ్మకాల విలువ రూ. 28,543.5 కోట్లుగా తేలింది. అలాగే, లాభాలు గత సంవత్సరం Q2తో పోలిస్తే.. నాలుగు రెట్లు పెరిగాయి.
Maruti Suzuki's Q2 results: రూ. 2,061 కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సరం Q2 లో Maruti Suzuki లాభాలు రూ. 2,061 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం Q2 లో మారుతి సుజుకి ఆర్జించిన లాభాలు రూ. 475.3 కోట్లు. అంటే, సంవత్సర కాలంలో మారుతి సుజుకి లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి.
Maruti Suzuki's Q2 results: భారతీయుల నమ్మకం
మారుతి సుజుకి భారతీయులు అత్యంత విశ్వసించే కార్ బ్రాండ్. మెరుగైన మైలేజీతో భారతీయ మధ్యతరగతిని కార్లకు ఓనర్లను చేసిన సంస్థ ఇది. సంపన్నుల నుంచి మధ్య తరగతికి కారును దగ్గర చేసింది. అలాగే, ఎప్పటికప్పుడు కొత్త వాహన శ్రేణితో వినియోగదారులకు దగ్గరవతోంది. ఈ Q2లో మారుతి సుజుకి వాహనాల మొత్తం అమ్మకాల విలువ రూ. 28,543.50 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం Q2లో మారుతి సుజుకి మొత్తం రూ. 19297.8 కోట్ల విలువైన వాహనాలను విక్రయించాయి.