Toyota enters CNG Segment: సీఎన్‌‌జీ వాహనాల్లోకి టయోటా ఎంట్రీ.. గ్లాంజా, హైరైడర్ మోడళ్లతో..-toyota enters cng segment with glanza hyryder know price details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Enters Cng Segment: సీఎన్‌‌జీ వాహనాల్లోకి టయోటా ఎంట్రీ.. గ్లాంజా, హైరైడర్ మోడళ్లతో..

Toyota enters CNG Segment: సీఎన్‌‌జీ వాహనాల్లోకి టయోటా ఎంట్రీ.. గ్లాంజా, హైరైడర్ మోడళ్లతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2022 08:56 AM IST

Toyota enters CNG Segment: సీఎన్‍జీ ప్యాసింజర్ వాహనాల విభాగంలోకి టయోటా ప్రవేశించింది. రెండు మోడళ్లకు సీఎన్‍జీ వెర్షన్‍లను ఆ కంపెనీ తీసుకొచ్చింది.

సీఎన్‍జీ సెగ్మెంట్‍లోకి టొయోటా ఎంట్రీ
సీఎన్‍జీ సెగ్మెంట్‍లోకి టొయోటా ఎంట్రీ

Toyota enters CNG Segment: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టయోటా ఎట్టకేలకు సీఎన్‍‍జీ ప్యాసింజర్స్ వెహికల్స్ (CNG Passenger Vehicles) సెగ్మెంట్‍లోకి అడుగుపెట్టింది. సీఎన్‍‍జీ కిట్‍తో కూడిన గ్లాంజా (Glanza) హ్యా‍చ్‌‌బ్యాక్ మోడల్‍ను టయోటా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.43 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్‍కు రూ.9.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. టయోటా గ్లాంజా ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. ఇప్పుడు దీనికి సీఎన్‍సీ వెర్షన్‍ను టోయోటా తీసుకొచ్చింది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ పవర్ ట్రైన్‍తో ఎస్, జీ గ్రేడ్స్ లో ఈ వెర్షన్ వస్తోంది.

తన ఫ్లాగ్‍షిప్ ఎస్‍యూవీ అర్బన్ క్రూజర్ హైరైడర్‍ (HyRyder) కు కూడా సీఎన్‍జీ వెర్షన్‍ను టయోటా ప్రకటించింది. S, G గ్రేడ్స్ లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్‍జీ కిట్స్ ఉంటాయి. నెల క్రితం లాంచ్ చేసిన ఈ SUV హైబ్రిడ్ వేరియంట్స్ తో కలిపే ఇవి సేల్‍కు వస్తాయి. హైరైడర్‍ కు చెందిన సీఎన్‍జీ వేరియంట్ ధరలను టయోటా ఇంకా ప్రకటించలేదు.

Toyota enters CNG Segment: 30.16 కిలోమీటర్ల వరకు మైలేజ్

స్టాండర్డ్ వేరియంట్స్ లో ఉండే 1.2 లీటర్ కే-సిరీస్ పెట్రోలే ఇంజిన్‍నే గ్లాంజా సీఎన్‌జీ మోడల్స్ కూడా కలిగి ఉంటాయి. కొత్త ఈ-సీఎన్‌జీ గ్లాంజా గరిష్ఠంగా 77.5 పీఎస్ శక్తిని జనరేట్ చేస్తుంది. కిలో సీఎన్‌జీకి 30.16 కిలోమీటర్ల మైలేజ్‍ను ఇస్తుంది.

అర్బన్ క్రూజర్ హైరైజర్ (Urban Cruiser HyRyder) సీఎన్‍‍జీ వెర్షన్ కూడా 1.5-లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‍తోనే వస్తోంది. కేజీకి 26.1 కిలోమీటర్ల మైలేజ్‍ను ఇది ఇస్తుంది.

Toyota enters CNG Segment: మారుతీ సుజుకీకి పోటీనిచ్చేలా..

ఓవైపు మారుతీ సుజుకీ దూకుడుగా వ్యవహిస్తున్న నేపథ్యంలో టయోటా కూడా సీఎన్‍జీ సెగ్మెంట్‍లోకి ప్రవేశించింది. మారుతీ సుజుకీ నుంచి ప్రస్తుతం 10 సీఎన్‌జీ ప్యాసింజర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సేల్స్ కూడా దూసుకుపోతున్నాయి.

“లేటెస్ట్ లాంచ్‍లతో మా వినియోగదారులు మార్కెట్‍లో ఎంపిక చేసుకునేందుకు మరిన్ని ఆప్షన్‍లను పొందుతారని భావిస్తున్నాం. మొబిలిటీ ఫర్ ఆల్ అనే మా ఫిలాసఫీని మేం మళ్లీ దీనిద్వారా చాటిచెబుతున్నాం. టయోటా వాహనాన్ని సొంతం చేసుకున్నామన్న సంతోషంతో పాటు తక్కువ ఖర్చు ఓనర్‍షిప్‍ బెనిఫిట్‍ను కూడా మా కస్టమర్లు పొందుతారు. వీటి ద్వారా అందరికీ సంతోషాన్ని అందిస్తున్నాం” అని టయోటా మోటార్ సేల్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ చెప్పారు.

WhatsApp channel

టాపిక్