Upcoming CNG cars in 2023 : ఈ ఏడాదిలో రానున్న టాప్ సీఎన్జీ కార్లు ఇవే..!
Upcoming CNG cars in 2023 in India : 2023లో పలు సీఎన్జీ వాహనాలు పలకరించనున్నాయి. మారుతీ, టాటా, కియా వంటి సంస్థలు.. తమ బెస్ట్ సెల్లింగ్ వెహికిల్స్‌కి సీఎన్జీ టచ్‌ను ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆ వివరాలు..
Upcoming CNG cars in 2023 in India : 2022ను గ్రాండ్‌గా ముగించింది దేశీయ ఆటో పరిశ్రమ. ఇక 2023లోనూ ఇదే జోష్‌ను కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పలు ఆటో సంస్థలు కొత్త కొత్త లాంచ్‌లను సిద్ధం చేసుకుంటున్నాయి. వీటిల్లో సీఎన్జీ వేరియంట్స్ కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..
మారుతీ బ్రెజా సీఎన్జీ..
Maruti Brezza CNG : 2022లో బ్రెజాకు అప్డేటెడ్ వర్షెన్‌ను లాంచ్ చేసిన మారుతీ సుజుకీ.. 2023లో ఈ ఎస్‌యూవీకి సీఎన్జీ వర్షెన్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. సీఎన్జీ కిట్‌తో కూడిన మారుతీ బ్రెజా.. ఇటీవలే డీలర్ యార్డ్‌లో కనిపించింది. 2023 తొలినాళ్లల్లోనే ఈ బ్రెజా సీఎన్జీ మార్కెట్లోకి లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతీ లాంచ్ చేసిన తొలి సీఎన్జీ వాహనం ఇదే అవుతుంది!
మారుతీ బ్రెజాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 7.99లక్షలు- రూ. 13.96లక్షల మధ్యలో ఉంటుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ. 1లక్ష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మారుతీ గ్రాండ్ విటారా సీఎన్జీ..
Maruti Grand Vitara CNG launch in India : 2022లో లాంచ్ అయిన గ్రాండ్ విటారా.. గ్రాండ్ సెక్సెస్‌ను అందుకుంది! ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీకి సీఎన్జీ వర్షెన్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది మారుతీ. గ్రాండ్ విటారా ధర రూ. 10.45లక్షలు- రూ. 19.65లక్షల మధ్యలో ఉంటుంది. కాగా.. గ్రాండ్ విటారా సీఎన్జీ ధర రూ. 95వేలు ఎక్కువగా ఉండొచ్చు.
రూ. 10లక్షలలోపు ది బెస్ట్ సీఎన్జీ కారును తీసుకోవాలని చూస్తున్నారా? అయితే వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టయోటా హైరైడర్ సీఎన్జీ..
Toyota Hyryder CNG launch : సరికొత్త హైరైడర్ ఎస్‌యూవీకి సీఎన్జీ వర్షెన్‌ని కూడా తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేసింది టయోటా. ఇది మిడ్-స్పెక్ జీ, ఎస్ మోడల్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఇందులో 1.5లీటర్ పెట్రోల్, మైల్డ్ హైబ్రీడ్ ఆప్షన్స్ ఉండొచ్చు.
టయోటా హైరైడర్ ఎస్యూవీ 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్ విత్ స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్.. 28కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇస్తుంది. దీని ధర రూ. 10.48లక్షలు- రూ. 18.99లక్షల మధ్యలో ఉంటుంది. ఇక సీఎన్జీ వర్షెన్ ధర రూ. 90వేలు ఎక్కువగా ఉండొచ్చు.
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ..
Tata Altroz CNG: సీఎన్జీ సెగ్మెంట్లో మార్కెట్ షేరును పెంచుకోవాలని చూస్తోంది టాటా మోటార్స్. ఇప్పటికే టియాగో, టిగోర్‌కు సీఎన్జీ వర్షెన్‌ను తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
టాటా ఆల్ట్రోజ్‌లో టర్బోఛార్జ్డ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఏ ఇంజిన్ ఆప్షన్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వర్షెన్ మార్కెట్లోకి వస్తుందో చూడాలి.
టాటా పంచ్ సీఎన్జీ..
TATA Punch CNG : నెక్సాన్ తర్వాత.. టాటా మోటార్స్‌లో ది బెస్ట్ సెల్లింగ్ వెహికిల్‌గా కొనసాగుతోంది టాటా పంచ్. ఈ మోడల్‌కు ఈవీ వర్షెన్‌ను తీసుకొస్తున్నట్టు దిగ్గజ ఆటో సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇక ఇప్పుడు.. టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ కూడా రాబోతోందని తెలుస్తోంది.
ఈ టాటా పంచ్‌లో 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 73పీఎస్ పవర్, 95ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీఎన్జీకి కూడా ఇదే ఇంజిన్ లభించే అవకాశం ఉంది. పెట్రోల్ వేరియంట్‌తో పోల్చుకుంటే.. సీఎన్జీ వర్షెన్ ధర రూ. 90వేలు ఎక్కువగా ఉండొచ్చు.
కియా సోనెట్ సీఎన్జీ..
Kia Sonet CNG launch in India : భారత ఆటో మార్కెట్లోకి అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే భారీగా విక్రయాలు చేపట్టిన సంస్థల్లో కియా ఒకటి! ముఖ్యంగా.. కియా సెల్టోస్, కియా సోనెట్‌కు భారీ స్థాయిలో డిమాండ్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు.. సోనెట్‌కు సీఎన్జీ వర్షెన్ రాబోతోంది. జీటీ లైన్ వేరియంట్‌కు సంబంధించిన సీఎన్జీ వర్షెన్‌ను ఇటీవలే టెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
కియా సోనెట్ ధర రూ. 7లక్షలు- 14లక్షల మధ్యలో ఉంటుంది. ఇక సోనెట్ సీఎన్జీ వర్షెన్ ధర రూ. 1లక్ష ఎక్కువగా ఉండొచ్చు.
* పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్‌షోరూం ప్రైజ్‌లు.
సంబంధిత కథనం