Maruti Suzuki new Brezza: మారుతీ సుజుకీ కొత్త బ్రెజా లాంఛ్.. ధర ఎంతో తెలుసా?-maruti suzuki launches new version of suv brezza prices starting at rs 7 99 lakh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maruti Suzuki Launches New Version Of Suv Brezza, Prices Starting At <Span Class='webrupee'>₹</span>7.99 Lakh

Maruti Suzuki new Brezza: మారుతీ సుజుకీ కొత్త బ్రెజా లాంఛ్.. ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jun 30, 2022 01:55 PM IST

Maruti Suzuki new Brezza : మారుతీ సుజుకీ ఎస్‌యూవీ కేటగిరీలోని బ్రెజా కొత్త వెర్షన్‌ను గురువారం మార్కెట్లో లాంఛ్ చేసింది.

మారుతీ సుజుకీ బ్రెజా కారు
మారుతీ సుజుకీ బ్రెజా కారు (marutisuzuki.com)

న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా కొత్త వెర్షన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన వాటా మెరుగుపరుచుకునేందుకు సరికొత్త వెర్షన్ తీసుకొచ్చింది.

సెకెండ్ జనరేషన్ బ్రెజా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 13.96 లక్షల మధ్య ఉంటుంది.

లాంచ్ సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ సరికొత్త బ్రెజా గత ఎనిమిది నెలల్లో కంపెనీ ఆరో లాంచ్ అని, భారత మార్కెట్‌పై తమ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

మారుతీ అధునాతన డిజైన్, సాంకేతికత, అత్యున్నత ఫీచర్లను పరిచయం చేస్తోందని, కొత్త తరం ఆకాంక్షలను ప్రతిబింబించే ఉత్పత్తులను తీసుకువస్తోందని వివరించారు.

‘ఈ దిశలో ఆల్-న్యూ బ్రెజా ఒక ముఖ్యమైన అడుగు. ఈ మోడల్ మా రాబోయే వైబ్రెంట్ ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో మొదటి ఆఫర్’ అని ఆయన చెప్పారు.

‘బ్రెజా భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన, అభివృద్ధి చేసిన మా మొదటి మోడల్’ అని టేకుచి చెప్పారు.

మారుతి సుజుకి మార్చి 2016లో బ్రెజాతో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఆరేళ్లలో 7.5 లక్షల యూనిట్లను విక్రయించింది.

సెకెండ్ జనరేషన్ బ్రెజా స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, కంపెనీ నెక్స్ట్-జెన్ కె-సిరీస్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 20.15 కిమీల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఈ మోడల్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, డిజిటల్ 360 కెమెరా, 40 కనెక్ట్ చేయబడిన ఫీచర్లతో వస్తుంది.

ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్‌తో సహా 20కి పైగా భద్రతా ఫీచర్లతో వస్తుంది.

దక్షిణ కొరియా కార్ల తయారీదారులు హ్యుందాయ్, కియా నుండి వస్తున్న వెన్యూ , సోనెట్‌‌లతో మారుతీ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో కొత్త బ్రెజా వస్తోంది.

చిన్న కార్ల విక్రయాలు తగ్గిపోవడంతో భారతీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో మారుతి సుజుకి మొత్తం మార్కెట్ వాటా అంతకుముందు దాదాపు 50 శాతం ఉండగా.. 2021-22లో 43.4 శాతానికి తగ్గింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ లేనందున, ఈ సెగ్మెంట్‌లో తన వాటాను పెంచుకునే లక్ష్యంతో కొత్త బ్రెజాను విడుదల చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్