Tata Punch EV : టాటా మోటార్స్​ నుంచి మరో ఎలక్ట్రిక్​ వెహికిల్​.. పంచ్​ ఈవీ వచ్చేస్తోంది!-tata punch ev to launch soon check range features and more details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev : టాటా మోటార్స్​ నుంచి మరో ఎలక్ట్రిక్​ వెహికిల్​.. పంచ్​ ఈవీ వచ్చేస్తోంది!

Tata Punch EV : టాటా మోటార్స్​ నుంచి మరో ఎలక్ట్రిక్​ వెహికిల్​.. పంచ్​ ఈవీ వచ్చేస్తోంది!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 24, 2022 08:07 AM IST

Tata Punch EV launch soon in India : టాటా పంచ్​ ఈవీ వర్షెన్​ను లాంచ్​ చేసేందుకు టాటా మోటార్స్​ ఏర్పాట్లు చేస్తోంది. దీని ధర, రేంజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

టాటా పంచ్​ ఈవీ వచ్చేస్తోంది
టాటా పంచ్​ ఈవీ వచ్చేస్తోంది

Tata Punch EV launch in India : ఇండియా ఈవీ సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. ఆటో సంస్థల్లో పోటీ కనిపిస్తోంది. కాగా దేశ ఈవీ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త కొత్త లాంచ్​లతో కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది ఈ సంస్థ. ఇక ఇప్పుడు టాటా మోటార్స్​ నుంచి మరో ఈవీ రాబోతోంది. అదే.. టాటా పంచ్​ ఈవీ!

టాటా పంచ్​ ఈవీ..

టియాగో ఈవీ లాంచ్​తో ఈవీ సెగ్మెంట్​లో మరింత దూసుకెళ్లింది టాటా మోటార్స్​. ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న అత్యంత చౌకైన ఈవీ ఇదే! ఇక ఇప్పుడు చిన్నపాటి ఎస్​యూవీ అయిన టాటా పంచ్​కు కూడా ఈవీ వర్షెన్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఈ దిగ్గజ ఆటో సంస్థ. టాటా పంచ్​ ఎస్​యూవీ.. సంస్థకు చెందిన వాహనాల్లో సెకెండ్​ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఈవీ వర్షెన్​కు కూడా ఇదే తరహా డిమాండ్​ లభిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Tata Punch EV price in India : ఇండియాలో టాటా పంచ్​ ఈవీని త్వరలో లాంచ్​ చేయనున్నట్టు టాటా మోటార్స్​ ప్యాసింజర్​ వెహికిల్​ బిజినెస్​ యూనిట్​ మార్కెటింగ్​ హెడ్​ వివేక్​ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇంతకు మించి ఆయన వివరాలేవీ చెప్పలేదు. అయితే.. టాటా పంచ్​ ఈవీ.. 2023 రెండో భాగంలో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

టాటా మోటార్స్​ నుంచి ఇప్పటికే నెక్సాన్​, టిగోర్​, టియాగో ఈవీలు ఇండియా రోడ్ల మీద చక్కర్లు కొడుతున్నాయి. ఇక పంచ్​ కూడా చేరితే.. టాటా మోటార్స్​ ఈవీ పోర్ట్​ఫోలియో మరింత శక్తివంతంగా మారుతుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Tata Punch EV launch date : గతేడాది అక్టోబర్​లో ఇండియాలో లాంచ్​ అయ్యింది టాటా పంచ్​. సేల్స్​ విషయంలో ఏడాది కాలంగా దూసుకెళుతోంది. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెయూవీలలో ఒకటిగా నిలిచింది. ఇక టాటా పంచ్​ ఈవీ కోసం ఏఎల్​ఎఫ్​ఏ ప్లాట్​ఫామ్​ను ఆ సంస్థ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక లుక్స్​ విషయానికొస్తే.. టాటా పంచ్​ ఈవీకి టాటా పంచ్​ ఐసీఈ మోడల్​కు పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు. ఈవీ బ్యాడ్జ్​, క్లోజ్​డ్​ గ్రిల్స్​ మాత్రం మారే అవకాశం ఉంది.

రిపోర్టుల ప్రకారం.. టాటా పంచ్​ ఈవీలో డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​తో కూడిన 26కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయన్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. టిగోర్​ ఈవీలో ఉన్న బ్యాటరీ సైజు, టాటా పంచ్​లో ఉండే బ్యాటరీ సైజు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే.. టాటా పంచ్​ ఈవీలో 55కేడబ్ల్యూ పీఎంఎస్​ ఎలక్ట్రిక్​ మోటర్​ ఉండొచ్చు. ఇది 74బీహెచ్​పీ పవర్​, 170 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. టాటా మోటార్స్​ జిప్​ట్రాన్​ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఫలితంగా టాటా పంచ్​ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 300కి.మీల దూరం ప్రయాణిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Tata Punch EV range : ఇక ధర విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న వర్షెన్​తో పోల్చుకుంటే.. టాటా పంచ్​ ఈవీ ధర రూ. 2లక్షలు అధికంగా ఉండొచ్చు. అయినప్పటికీ.. ఇండియాలో లభిస్తున్న చౌకైన ఈవీల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది.

సిట్రోయెన్​ ఈసీ3 ఈవీ కూడా వచ్చే ఏడాదిలోనే లాంచ్​ కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీకి.. టాటా పంచ్​ ఈవీ గట్టి పోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

సంబంధిత కథనం