Tata Punch Camo Edition । రూ. 7 లక్షల బడ్జెట్ ధరలో టాటా పంచ్ SUV కార్..!
టాటా మోటార్స్ సరికొత్త Tata Punch Camo Edition కారును విడుదల చేసింది. రూ. 7 లక్షల బడ్జెట్ ధరలో లభించే ఈ కారు విశేషాలు చూడండి.
టాటా మోటార్స్ తమ కాంపాక్ట్ SUV అయిన టాటా పంచ్ కారులో సరికొత్త కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. టాటా పంచ్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్ వాహనాన్ని కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుత పండుగ సీజన్‌లో తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి టాటా పంచ్ కొత్త ఎడిషన్ మంచి ఆఫర్‌గా ఉండబోతుంది. ఎక్స్-షోరూమ్ వద్ద Tata Punch Camo Edition ధరలు రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ కార్ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇది పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే లభిస్తుంది.
ఈ ప్రత్యేకమైన 'కామో ఎడిషన్' అనేది మొదట టాటా హారియర్‌తో ప్రారంభమైంది. కామో ఎడిషన్‌లో సాయుధ దళాలను ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగుతో పాటు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌లలో కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. కొత్తగా లాంచ్ అయిన టాటా పంచ్ కామో ఎడిషన్‌లో కూడా ఇప్పుడు అవే తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Tata Punch Camo Edition డిజైన్, ఫీచర్లు
టాటా పంచ్ కామో ఎడిషన్ ప్రత్యేకమైన మిలిటరీ గ్రీన్ డ్యూయల్-టోన్ కలర్‌లో వచ్చింది. కారు వెలుపలి డిజైన్ పరిశీలిస్తే సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్రంట్ ఫెండర్‌పై కామో బ్యాడ్జింగ్, 16-అంగుళాల ‘చార్‌కోల్’ అల్లాయ్ వీల్స్. ఫాగ్ లైట్లు, LED DRLలు, LED టెయిల్ లైట్లతో వచ్చింది.
కారు లోపలి భాగంలో మిలిటరీ గ్రీన్ ఇన్సర్ట్‌లు, అద్భుతమైన సీటింగ్ అప్‌డేట్‌లను కలిగి ఉంది. డ్యాష్ బోర్డుకు 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఉది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు కారులో ఉన్నాయి.
Tata Punch Camo Edition ఇంజన్, ఇతర స్పెసిఫికేషన్లు
టాటా పంచ్ కామో ఎడిషన్‌లో అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 84bhp శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా AMT యూనిట్‌తో జత చేసి ఉంటుంది.
Tata Punch Camo Edition ధరలు
టాటా పంచ్ కామో ఎడిషన్ వేరియంట్ వారీగా ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలుగా గమనించాలి.
పంచ్ కామో ఎడిషన్ అడ్వెంచర్ MT: రూ. 6.85 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అడ్వెంచర్ AMT: రూ. 7.45 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అడ్వెంచర్ రిథమ్ MT: రూ. 7.20 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అడ్వెంచర్ రిథమ్ AMT: రూ. 7.80 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అకాంప్లిష్డ్ MT: రూ. 7.65 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అకాంప్లిష్డ్ AMT: రూ. 8.25 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అకాంప్లిష్డ్ డాజిల్ MT: రూ. 8.03 లక్షలు
పంచ్ కామో ఎడిషన్ అకాంప్లిష్డ్ డాజిల్ AMT: రూ. 8.63 లక్షలు
ఇదిలా ఉంటే టాటా మోటార్స్ టాటా పంచ్ కామో ఎడిషన్ లాంచ్ కంటే ముందు Tata Nexon XZ+ (L) వేరియంట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం