Citroen e-C3 electric launch : సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడంటే..-electric citroen e c3 launch in january 2023 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Electric Citroen E-c3 Launch In January 2023 Check Full Details Here

Citroen e-C3 electric launch : సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడంటే..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 25, 2022 08:53 AM IST

Citroen e-C3 electric launch date in India : 2023 జనవరిలో.. సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలు..

సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడంటే..
సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ లాంచ్​ ఎప్పుడంటే..

Citroen e-C3 electric launch date in India : సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​పై గత కొంతగాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రేపో.. మాపో లాంచ్​ అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేసింది సిట్రోయెన్​ సంస్థ. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో.. సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​ వర్షెన్​ను ఇండియాలో లాంచ్​ చేయనున్నట్టు సంస్థ గ్లోబల్​ సీఈఓ కార్లోస్​ టవారెస్​ ప్రకటించారు. ప్రత్యేకంగా డేట్​ని ఇంకా ప్రకటించలేదను కానీ.. 2023 ఆటో ఎక్స్​పో తర్వాత.. అంటే జనవరిలో సిట్రోయెన్​ సీ3 ఈవీ లాంచ్​ కానున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

సిట్రోయెన్​ ఈ సీ3..

ఈ వెహికిల్​కి సిట్రోయెన్​ ఈ సీ3 అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సీ3 మోడల్​ను ఆరు నెలల క్రితమే ఇండియాలో లాంచ్​ చేసింది సిట్రోయెన్​. ఇప్పుడు సీ3కి ఎలక్ట్రిక్​ వర్షెన్​పై ప్లాన్స్​ వేస్తుండటం విశేషం. ఈ సిట్రోయెన్​ ఈ సీ3 ధర రూ. 10లక్షలు- 12లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Citroen E C3 launch in India : "సరసమైన ధరల్లో ఈవీని అందించడమే ఇప్పుడు ముఖ్యమైన విషయం. సరసైన ధరలతో వస్తేనే డిమాండ్​ పెరుగుతుంది. అదే సమయంలో మాకు మార్కెట్​ షేరును హడావుడిగా పెంచేసుకోవాలని ఏం లేదు. సమయంతో పాటు మేము మెరుగుపడతాము," అని కార్లోస్​ టవారెస్​ అభిప్రాయపడ్డారు.

ఈ సిట్రోయెన్​ ఈ సీ3లో 30.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉండొచ్చు. కారులో 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్, సీసీఎస్​2 ఫాస్ట్​ ఛార్జింగ్​ కెపాసిటీ​ కూడా ఉండే అవకాశం ఉంది.

Citroen E C3 : "ఇండియా మార్కెట్​ నుంచే బ్యాటరీని కొనుగోలు చేయాలని నాకు అనిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఎవరు లభించలేదు. మరికొన్నేళ్లల్లో ఇది జరగకవచ్చు," అని కార్లెస్​ టవారెస్​ పేర్కొన్నారు.

సిట్రోయెన్​ ఈ సీ3 సింగిల్​ ఎలక్ట్రిక్​ మోటార్​తో 63కేడబ్ల్యూ పవర్​, 143ఎన్​ఎం టార్క్​ జనరేట్​ అవ్వొచ్చు. టాటా టియాగో ఈవీ.. 74హెచ్​పీ పవర్​ను, 114ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

సిట్రోయెన్​ సీ3తో పోల్చుకుంటే.. సిట్రోయెన్​ ఈ సీ3 ఇంటీరియర్​లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

భారీ డిస్కౌంట్లు..

Discounts on Citroen C3 : మరోవైపు.. సిట్రోయెన్​ సీ3 పెట్రోల్​ వర్షెన్​పై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 10వేల వరకు లభిస్తోంది. కార్పొరేట్​ బోనస్​ కింద మరో రూ. 10వేలను ఆదా చేసుకోవచ్చు. వీటితో పాటు.. వాహనం కొనుగోలు చేసిన వారికి రెండేళ్ల మెయింటేనెన్స్​ ప్యాకేజీని ఉచితంగా ఇస్తోంది సిట్రోయెన్​. దీని విలువ రూ. 10వేల వరకు ఉండొచ్చు. ఈ వాహనంపై సంస్థ.. ఎలాంటి క్యాష్​ డిస్కౌంట్​ను ఇవ్వడం లేదు. అంటే.. సిట్రోయెన్​ సీ3పై రూ. 30వేల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నట్టు అర్థం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం