Maruti Brezza vs Maruti Fronx : మారుతీ బ్రెజా వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​.. ఏది కొంటే బెటర్​?-maruti suzuki brezza vs maruti suzuki fronx check detailed comparison and know which one to buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Brezza Vs Maruti Suzuki Fronx Check Detailed Comparison And Know Which One To Buy

Maruti Brezza vs Maruti Fronx : మారుతీ బ్రెజా వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​.. ఏది కొంటే బెటర్​?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 20, 2023 10:47 AM IST

Maruti suzuki Brezza vs Maruti suxuki Fronx : ఎస్​యూవీ సెగ్మెంట్​లో జోరు పెంచింది మారుతీ సుజుకీ. ఈ క్రమంలో మారుతీ సుజుకీ బ్రెజ్​, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ను పోల్చి.. ఈ రెండింట్లో ది బెస్ట్​ ఏది? అనేది తెలుసుకుందాము.

మారుతీ బ్రెజ్​- మారుతీ ఫ్రాంక్స్​
మారుతీ బ్రెజ్​- మారుతీ ఫ్రాంక్స్​

Maruti suzuki Brezza vs Maruti suxuki Fronx : ఆటో ఎక్స్​పో 2023లో మారుతీ సుజుకీ ప్రదర్శించిన వాహనాలు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారాయి. 5 డోర్​ జిమ్నీతో పాటు ఈవీఎక్స్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ కాన్సెప్ట్​ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఎస్​యూవీ సెగ్మెంట్​లో మార్కెట్​ షేర్​ను పెంచుకోవాలని చూస్తున్న మారుతీ సుజుకీ.. 'ఫ్రాంక్స్​' అనే సబ్​-కాంపాక్ట్​ స్పోర్ట్స్​ యుటిలిటీ వెహికిల్​ను సైతం ప్రదర్శించింది. ఈ ఫ్రాంక్స్​పై కారు ప్రియుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగింది. మరోవైపు మారుతీ సుజుకీ బ్రెజాకు మార్కెట్​లో ఇప్పటికే మంచి డిమాండ్​ ఉంది. ఈ నేపథ్యంలో.. మారుతీ సుజుకీ బ్రెజాతో ఈ ఫ్రాంక్స్​ ఎస్​యూవీని పోల్చి.. ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్​? అని తెలుసుకుందాము.

మారుతీ బ్రెజ్​ వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​- డైమెన్షన్స్​..

Maruti Fronx specifications : మారుతీ సుజుకీ బలెనో, మారుతీ బ్రెజాను కలగలిపితే ఈ ఫ్రాంక్స్​ వస్తున్నట్టుగా దీని డిజైన్​ చూస్తే అనిపిస్తుంది. బ్రెజాను ఎరోనా షోరూమ్​లలో విక్రయిస్తుంటే.. ఫ్రాంక్స్​ను నెక్సా ప్రీమియం సేల్స్​ నెట్​వర్క్​ ద్వారా అమ్మేందుకు మారుతీ సుజుకీ ప్లాన్స్​ చేస్తోంది.

మారుతీ బ్రెజా పొడవు 3,995ఎంఎం, వెడల్పు 1,790ఎంఎం, ఎత్తు 1,685ఎంఎం. ఇక ఈ వెహికిల్​ వీల్​బేస్​ 2,500ఎంఎం ఉంటుంది. మరోవైపు మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ పొడవ 3,995ఎంఎం, వెడల్పు 1,765ఎంఎం, ఎత్తు 1,550 ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,520ఎంఎం. డైమెన్షన్స్​ పరంగా చూస్తే.. బ్రెజా కాస్త పెద్దగా కనిపిస్తుంది!

మారుతీ బ్రెజ్​ వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​- ఫీచర్స్​..

Maruti Fronx features : ఎక్స్​టీరియర్​తో పాటు ఇంటీరియర్​లోను బ్రెజ్​, ఫ్రాంక్స్​కు చాలా వ్యత్యాసం ఉంటుంది. బ్రెజా క్యాబిన్​లో బ్లాక్​- బిజ్​ డ్యూయెల్​ టోన్​ థీమ్​ ఉంటే.. ఫ్రాక్స్​లో బ్లాక్​- బర్గండ్రీ కలర్​ థీమ్​ ఉంటుంది. స్టీరింగ్​ వీల్​, ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. క్యాబిన్​ లేఅవుట్స్​ డిఫరెంట్​గా ఉన్నాయి. బ్రెజాల్​ షార్ప్​, ఎడ్జీ లుకింగ్​ డాష్​బోర్డ్​ ఉండగా.. ఫ్రాంక్స్​లో కర్వీ డాష్​బోర్డ్​ కనిపిస్తుంది.

ఈ రెండు ఎస్​యూవీల్లోనూ 9ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉంటుంది. వయర్​లెస్​ ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే, అర్కామిస్​ ఆడియో సిస్టెమ్​, వయర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​ వంటి ఫీచర్స్​ ఒకే విధంగా ఉన్నాయి. హెడ్స్​ అప్​డిస్​ప్లే కూడా ఉండటం విశేషం. బ్రెజ్​లో సన్​రూఫ్​, యాంబియెంట్​ లైటింగ్​ ఉండగా.. ఫ్రాంక్స్​లో ఈ ఫీచర్స్​ లేవు.

Maruti Brezza features : ఇక సేఫ్టీ విషయానికొస్తే.. మారుతీ బ్రెజా, మారుతీ ఫ్రాంక్స్​లలో 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉంటాయి. కానీ బ్రెజాలో టాప్​ ఎండ్​ మోడల్​కు మాత్రమే 6 ఎయిర్​బాగ్స్​ లభిస్తున్నాయి. ఏబీఎస్​, ఈబీడీ, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ ప్రొగ్రాం, రివర్స్​ పార్కింగ్​ సెన్సార్స్​, 360 డిగ్రీ కెమెరా వంటివి రెండింటికీ ఉన్నాయి.

మారుతీ బ్రెజ్​ వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​- ఇంజిన్​..

స్పెసిఫికేషన్స్​మారుతీ బ్రెజామారుతీ ఫ్రాంక్స్​
ఇంజిన్​1.5 లీటర్​ పెట్రోల్​1 లీటర్​ టర్బో పెట్రోల్​/ 1.2లీటర్​ పెట్రోల్​
ట్రాన్స్​మిషన్​5 స్పీడ్​ ఎంటీ/ 6 స్పీడ్​ ఏటీ5 స్పీడ్​ ఎంటీ/ 6స్పీడ్​ ఏటీ/ 5-స్పీడ్​ ఏఎంటీ
పవర్​103పీఎస్​100పీఎస్​/ 90పీఎస్​
టార్క్​137ఎన్​ఎం148ఎన్​ఎం/ 113ఎన్​ఎం

మారుతీ బ్రెజ్​ వర్సెస్​ మారుతీ ఫ్రాంక్స్​- ధర..

Maruti Brezza on road price in Hyderabad : హైదరాబాద్​లో మారుతీ సుజుకీ బ్రెజా ఎక్స్​షోరూం ధర రూ. 8.19లక్షలు- రూ. 14.18లక్షల మధ్యలో ఉంటుంది.

Maruti Fronx price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ధరకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. మారుతీ బ్రెజా ధరకు సమీపంలోనే రూ. 8లక్షల వద్ద ఈ కారు ప్రారంభ ధర ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel