Auto Expo 2023 : ఆటో ఎక్స్పో 2023కి సర్వం సిద్ధం.. డేట్స్, వెన్యూ వివరాలివే!
Auto Expo 2023 India : ఆటో పరిశ్రమకు సంబంధించి.. దేశంలోనే అతిపెద్ద ఈవెంట్ ‘ఆటో ఎక్స్పో 2023’కి సర్వం సిద్ధమైంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. మీకోసం!
Auto Expo 2023 India : బైక్స్, కార్స్ ప్రియులను ఎంతగానో ఆకర్షించే ఈవెంట్ "ఆటో ఎక్స్పో 2023" త్వరలోనే ప్రారంభంకానుంది. దేశంలోని అనేక ఆటో సంస్థలు.. కొత్త కొత్త లాంచ్‌లు, ఆవిష్కరణల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఆటో ఈవెంట్ డేట్స్, వెన్యూతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఏంటి ఈ ఆటో ఎక్స్పో?
ఇండియాలో ఆటో ఎక్స్పోను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిగా 2020లో ఆటో ఎక్స్పో జరిగింది. కొవిడ్ కారణంగా 2022లో జరగాల్సిన ఆటో ఎక్స్పో ఈవెంట్ వాయిదా పడింది. అంటే.. మూడేళ్ల తర్వాత వస్తున్న ఈ ఆటో ఎక్స్పో 2023పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో సంస్థలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Auto Expo 2023 dates : ఏసీఎంఏ(ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మేన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), సీఐఐ (కాన్ఫెడరషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) మద్దతుతో.. ఈ ఆటో ఎక్స్పోను నిర్వహిస్తోంది ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మేన్యుఫ్యాక్చర్స్). 1986లో తొలి ఆటో ఎక్స్పోను నిర్వహించారు. అంటే.. 2023 ఆటో ఎక్స్పో అనేది 15వ ఎడిషన్ అవుతుంది. వివిధ ఆటో సంస్థలు తమ లేటెస్ట్, బెస్ట్ మోడల్స్‌తోపాటు.. భవిష్యత్తు కార్యచరణలు, ఆకర్షణీయమైన వేరియంట్లను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటాయి.
Auto Expo 2023 timings : 15వ ఆటో ఎక్స్పో.. ఈ నెల 13 నుంచి 18 వరకు జరుగుతుంది. ఈసారి రెండు వేదికల్లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆటో ఎక్స్పో కాంపోనెంట్ షో.. ప్రగతి మైదాన్‌లో, ఆటో ఎక్స్పో- మోటార్ షో.. ఇండియా ఎక్స్పో మార్ట్ (గ్రేటర్ నోయిడా)లో ఏర్పాటు చేశారు.
ఆటో ఎక్స్పో 2023- టైమింగ్స్, టికెట్ ధర..
జనవరి 13:- ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, ధర రూ. 750
జనవరి 14:- ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ధర రూ. 475
2023 Auto Expo details : జనవరి 15:- ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ధర రూ. 475
జనవరి 16:- ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, ధర రూ. 350
జనవరి 17:- ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, ధర రూ. 350
జనవరి 18:- ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ధర రూ. 350
ఆటో ఎక్స్పో 2023 డిస్ప్లే..
ఈ దఫా ఆటో ఎక్స్‌పోలో ఎంయూవీలు/ఎస్‌యూవీలు, టీ వీలర్, 3 వీలర్, స్పెషల్ వెహికిల్స్, కాన్సెప్ట్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్, వింటేజ్ కార్స్, సూపర్ కార్స్, బైక్స్, టైర్స్- ట్యూబ్స్, ఆటోమోటివ్ డిజైన్స్- టెక్నికల్ కాన్సెప్ట్స్, ఇంజినీరింగ్- ఐటీ ఆటోమొబైల్ కంపెనీస్‌కు చెందిన పరికరాలు ప్రదర్శనకు వస్తాయి.
Auto Expo 2023 vehicles : ఈ ఆటోఎక్స్‌పో 2023లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్, టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇండియా, రెనాల్ట్కు చెందిన పలు మోడల్స్‌ను ఆవిష్కరించనున్నారు. ఇంకొన్ని మోడల్స్ లాంచ్ అవుతాయి.
వీటితో పాటు అనేక ఎలక్ట్రిక్ కార్లును కూడా ఆవిష్కరించనున్నారు. బీవైడీ ఇండియా, టార్క్ మోటార్, ఒకినావా ఆటోటెక్, హీరో ఎలక్ట్రిక్, లాగ్9 మెటీరియల్, ఈఎల్మోటో, మాటర్ మోటోవర్క్స్తో పాటు మరికొన్ని సంస్థలు ఈ ఈవెంట్లో పాల్గొననున్నాయి.