Kia Sorento SUV : 'ఆటో ఎక్స్పో'లో కియా సొరెంటో ప్రదర్శన.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
Kia Sorento SUV : కియా సొరెంటోను 2023 ఆటో ఎక్స్పో ప్రదర్శించనున్నారు. ఈ వెహికిల్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Kia Sorento SUV : ఇండియాలో కియా మోటార్స్ వాహనాలు దూసుకెళుతున్నాయి! దేశీయ ఆటో పరిశ్రమలో వేగంగా వృద్ధిచెందుతన్న సంస్థల్లో కియా మోటార్స్ ఒకటి. వివిధ మోడల్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది ఈ సౌత్ కొరియన్ సంస్థ. ఇక ఇప్పుడు.. త్రీ రో- ఫోర్త్ జనరేషన్ కియా సొరెంటో ఎస్‌యూవీని భారతీయుల ముందుకు తీసుకొస్తోంది. ఈ 7 సీటర్ సొరెంటో ఎస్‌యూవీని రానున్న 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించాలని ఈ ఆటో సంస్థ నిర్ణయించింది.
సొరెంటో ఎస్యూవీ ఫోర్త్ జనరేషన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో 2020లోనే లాంచ్ చేసింది కియా. కాగా.. ఇండియాలో ఇప్పటివరకు ఇది లాంచ్ అవ్వలేదు. ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే.. త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించి, కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇక్కడ హిట్ అయితే.. మరి కియా సొరెంటో ఎస్‌యూవీని ఇండియా రోడ్లపై చూసే అవకాశం లేకపోలేదు.
ఇండియాలో సొరెంటో ఎస్‌యూవీని.. కియా ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు. 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో.. థర్డ్ జనరేషన్ సొరెంటోను ప్రదర్శనకు ఉంచింది కియా మోటార్స్.
కియా సొరెంటో ఎక్స్టీరియర్- ఇంటీరియర్..
Kia Sorento India : ఇండియాలో ప్రస్తుతం ఉన్న కియా మోడల్స్ కన్నా.. ఈ ఫోర్త్ జనరేషన్ కియా సొరెంటో ఇంకా బోల్డ్‌గా కనిపిస్తుంది. కియా స్టైల్లో టైగర్ నోస్ గ్రిల్స్ ఫ్రెంట్లో ఉన్నాయి. త్రీ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, టైగర్ ఐలైన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. ఫ్రెంట్ బంపర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇందులో సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. రేర్‌లో వర్టికల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, టెయిల్ గేట్స్ ఉంటాయి.
ఇంకో యాంగిల్ నుంచి చూస్తే.. ఈ కియా సొరెంటోకు.. ఇండియాలో అందుబాటులో ఉన్న కియా సోనెట్‌కు కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఈ కియా సొరెంటో ఎస్‌యూవీలో 10.25 ఇంచ్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వర్టికల్ ఏసీ వెంట్స్, హెచ్‌వీఏసీ కంట్రోల్స్ ఉంటాయి. సోనెట్‌లో ఉన్న విధంగానే.. ఇందులోనూ 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ బినాకిల్కు కనెక్ట్ అయ్యి ఉంటుంది.
Kia Sorento price : యూవీఓ కనెక్టెడ్ కార్ టెక్, 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, పానారోమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరాస్, 12 స్పీకర్ బాష్ సౌండ్ సిస్టెమ్ వంటి ఫీచర్స్.. ఈ కియా సొరెంటో ఎస్యూవీ సొంతం. ఈ వెహికిల్‌లో ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
కియా సొరెంటో ఎస్యూవీ ఇంజిన్..
Kia Sorento features : అంతర్జాతీయంగా.. ఈ కియా సొరెంటో ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ ఆప్షన్స్‌తో పాటు 1.6 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంది. ఇందులో 44.2కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇందులో 1.49కేడబ్ల్యూహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ సెటప్ ఉంది. ఈ వర్షెన్ 230హెచ్‌పీ పవర్‌ను, 350ఎన్ఎం టార్కను జనరేట్ చేస్తుంది. 6స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం. నాన్ హైబ్రీడ్ 2.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 191హెచ్‌పీ పవర్, 246ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 8స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఉంటుంది.
ఇండియాలో ఈ కియా సొరెంటో ఎస్యూవీ అడుగుపెడితే.. జీప్ మెరీడియన్, స్కోడా కుషాక్ వంటి వాహనాలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
కియా సొరెంటోతో పాటు కియా ఈవీ9ని కూడా ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది ఈ ఆటో సంస్థ. ఈ అంశంపై పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
సంబంధిత కథనం