Alto K10 CNG launch : ఆల్టో కే10 సీఎన్​జీ వర్షెన్​ లాంచ్​.. ధర ఎంతంటే!-maruti suzuki alto k10 cng launched in india check price an other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Alto K10 Cng Launch : ఆల్టో కే10 సీఎన్​జీ వర్షెన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Alto K10 CNG launch : ఆల్టో కే10 సీఎన్​జీ వర్షెన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 19, 2022 07:54 AM IST

Maruti Alto K10 CNG launched in India : ఆల్టో కే10లో సీఎన్​జీ వర్షెన్​ను లాంచ్​ చేసింది మారుతీ సుజుకీ. ఈ కొత్త వర్షెన్​కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆల్టో కే10 సీఎన్​జీ వర్షెన్​ లాంచ్​.. ధర ఎంతంటే
ఆల్టో కే10 సీఎన్​జీ వర్షెన్​ లాంచ్​.. ధర ఎంతంటే

Maruti Alto K10 CNG launched in India : మారుతీ సుజుకీ నుంచి మరో సీఎన్​జీ కారు వచ్చేసింది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 సీఎన్​జీని.. ఆ సంస్థ శుక్రవారం లాంచ్​ చేసింది. ఈ సీఎన్​జీ వర్షెన్​ ధర రూ. 5.95లక్షలు(ఎక్స్​షోరూం) ధరగా ఉంది. అయితే.. కేవలం ఒక వేరియంట్​లోనే మారుతీ ఆల్టో కే10 అందుబాటులో ఉంది. ఆల్టో కే10 పెట్రోల్​ వర్షెన్​తో పోల్చుకుంటే.. సీఎన్​జీ వర్షెన్​ ధర రూ. 95,000 అధికంగా ఉంది.

ఈ మారుతీ సుజుకీ ఆల్టో కే10 సీఎన్​జీలో 1.0లీటర్​ కే10సీ ఇంజిన్​ ఉంటుంది. మారుతీకి చెందిన ఇతర వాహనాలు సెలేరియో సీఎన్​జీ, ఎస్​ ప్రెస్సో సీఎన్​జీలోనూ ఇదే ఇంజిన్​ ఉంది. ఆల్టో కే10 సీఎన్​జీలో 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​ బాక్స్​ ఉంది. పెట్రోల్​ ఓన్లీ మోడ్​లో ఈ వాహనం 65హెచ్​పీ పవర్​, 89ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ మోడ్​లో.. 57హెచ్​పీ పవర్​, 82ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఇండియాలో.. రూ. 1లక్షల లోపు లభిస్తున్న టాప్​ సీఎన్​జీ వాహనాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Maruti Alto K10 CNG price : కొత్త ఆల్టో కే10 సీఎన్​జీ మైలేజీ.. 33.85కి.మీ/కేజీగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఆల్టో కే10 సీఎన్​జీ.. ఎస్​ ప్రెస్సో సీఎన్​జీ కన్నా 1.12కిమీ/కేజీ మైలేజీని అధికంగా ఇస్తుంది. కానీ సెలరియా సీఎన్​జీ వర్షెన్​తో పోల్చుకుంటే.. ఇది 1.75కి.మీ/కేజీ తక్కువ.

ఆల్టో కే10 సీఎన్​జీకి.. పెట్రోల్​ వర్షెన్​కు ఉన్న డిజైనే ఉంటుంది. ఎస్​ సీఎన్​జీ బ్యాడ్జ్​ రేర్​లో ఉంటుంది. ఈ హ్యాచ్​బ్యాక్​ మోడల్​ బూట్​లో 55లీటర్​ సీఎన్​జీ ట్యాంక్​ను ఏర్పాటు చేసింది మారుతీ. ఫలితంగా స్టోరేజ్​ స్పేస్​ కాస్త తగ్గింది.

Maruti Alto K10 CNG : ఆల్టో కే10 సీఎన్​జీకి.. ఆల్టో కే10 పెట్రోల్​ వేరియంట్​ ఇంటీరియర్​కి కూడా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. 2డిన్​ స్మార్ట్​ప్లే ఆడియో సిస్టెమ్​, ఏయూఎక్స్​-యూఎస్​బీ పోర్ట్​, స్పీడ్​ సెన్సింగ్​ ఆటో డోర్​ లాక్​, ఇంపాక్ట్​ సెన్సింగ్​ డోర్​ అన్​లాక్​, గేర్​ షిఫ్ట్​ ఇండికేటర్​లు ఇందులో ఉన్నాయి. డ్యూయెల్​ ఎయిర్​బ్యాగ్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, రేర్​ పార్కింగ్​ సెన్సార్​, సీట్​ బెల్ట్​ రిమైండర్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​.. ఈ సీఎన్​జీ వర్షెన్​లో ఉన్నాయి.

మారుతీ ఆల్టో కే10 సీఎన్​జీకి.. ఆల్టో 800సీఎన్​జీ, ఎస్​ ప్రెస్సో సీఎన్​జీలు పోటీగా ఉండనున్నాయి. ఆల్టో 800 సీఎన్​జీ ధర రూ. 5.03లక్షలు(ఎక్స్​షోరూం)గా ఉంది. ఇక ఎస్​ ప్రెస్సో సీఎన్​జీ ధర రూ. 5.90లక్షలు- 6.10లక్షల(ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది.

Maruti Alto K10 CNG launch : సీఎన్​జీ ధరలు పెరుగుతున్నా.. ఈ వర్షెన్​ కార్లకు డిమాండ్​ తగ్గడం లేదని మారుతీ పేర్కొంది. పెట్రోల్​ ధరలతో పోల్చుకుంటే.. దీర్ఘకాలంలో సీఎన్​జీ ధరలతో లబ్ధిపొందవచ్చని కస్టమర్లు భావిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్​కు తగ్గట్టుగానే.. సీఎన్​జీ వేరియంట్లను ఎప్పటికప్పుడు లాంచ్​ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం