Maruti Suzuki S- Presso Xtra edition : ఎస్-ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్ వచ్చేస్తోంది..!
Maruti Suzuki S- Presso Xtra edition : మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ కారును తాజాగా ఆవిష్కరించింది మారుతీ సుజుకీ.
Maruti Suzuki S- Presso Xtra edition : సరికొత్త ఎస్- ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్‌ను ఆవిష్కరించింది మారుతీ సుజుకీ. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ప్రకటన చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్లో కొత్త యాక్ససరీస్ వస్తున్నాయి. ఫ్రెంట్ స్కిడ్ ప్లేట్, గ్రిల్స్‌పై క్రోమ్ గార్నిష్ ఎఫెక్ట్, వీల్ ఆర్చీస్పై బ్లాక్ క్లాడింగ్, డోర్ క్లాడింగ్, కలర్డ్ ఇంటీరియర్ వంటివి ఈ ఎస్- ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్‌లో ఉండనున్నాయి. వీటిని చూస్తే.. డీలర్ వద్దే ఈ యాక్ససరీస్ని ఫిట్ చేసి అమ్ముతారని తెలుస్తోంది.
ఇక మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్ క్యాబిన్ విషయానికొస్తే.. కొత్త సీట్ అప్‌హోలిస్ట్రీ, సెంటర్ కన్సోల్‌పై రెడ్ యాక్సెంట్, డోర్ ప్యాడ్స్, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా కొత్త ఫ్లోర్ మాట్స్ కూడా లభిస్తాయి.
Maruti Suzuki S- Presso Xtra edition price : మెకానిక్స్ పరంగా ఈ ఎస్- ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్‌లో మార్పులు లేవు. ఇవి రెగ్యులర్ ఎస్- ప్రెస్సోతో పోలి ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 65బీహెచ్పీ పవర్‌ను 89ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5స్పీడ్ మేన్యువల్, 5స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి. అధిక మైలేజీని ఇస్తున్న వాహనాల్లో మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో ఒకటి. మేన్యువల్ వేరియంట్.. 24.76 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తే.. ఏఎంటీ వర్షెన్కు అది 25.30 కేఎంపీఎల్గా ఉంది.
ఈ మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సోకు సీఎన్జీ వర్షెన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే.. ఇటీవలే నిర్వహించిన గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో.. మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో దారుణ ప్రదర్శన చేసింది. కేవలం సింగిల్ స్టార్ మాత్రమే సంపాదించుకోగలిగింది.
Maruti Suzuki S- Presso Xtra edition specifications : మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో మేన్యువల్ వేరియంట (ఎంటీ) ప్రారంభ ధర రూ. 4.25లక్షలుగా ఉంటుంది. ఏఎంటీ వేరియంట్ వీఎక్స్ఐ (ఓ) ధర రూ. 5.65లక్షలుగా ఉంటుంది. ఎస్- ప్రెస్సో వీఎక్స్ఐ+ వేరియంట్ ధర రూ. 5.49లక్షలుగా ఉంటుంది. పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్‌షోరూం ధరలు.
ఇక మారుతీ సుజుకీ ఎస్- ప్రెస్సో ఎక్స్ట్రా ఎడిషన్ కాస్త ప్రీమియం ధరకు వచ్చే అవకాశం ఉంది. ఈ వెహికిల్ లాంచ్, ధరతో పాటు పూర్తి వివరాలు.. రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెంపు..
Maruti Suzuki price hike : తమ కంపెనీకి చెందిన అన్ని మోడళ్ల ధరలను మరోమారు పెంచుతున్నట్టు ప్రకటించింది మారుతీ సుజుకీ. ఈ ధరలు.. వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పరిస్థితుల్లో మార్పులు లేవని, అందుకే వాహనాల ధరలను పెంచుతున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం