Hyundai Exter CNG vs Tata Punch iCNG : ఎక్స్టర్ వర్సెస్ పంచ్- సీఎన్జీ మోడల్స్‌లో ఏది బెస్ట్?
Hyundai Exter CNG vs Tata Punch iCNG : హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ వర్సెస్ టాటా పంచ్ ఐసీఎన్జీ. ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Hyundai Exter CNG vs Tata Punch iCNG : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని సీఎన్జీ సెగ్మెంట్లో లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చింది టాటా పంచ్. ఈ మచ్ అవైటెడ్ పంచ్ ఐసీఎన్జీ మోడల్‌పై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీతో పంచ్‌ను పోల్చి, ఈ రెండిట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు వాహనాల డైమెన్షన్స్ ఏంటి..?
హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీలో హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, గ్లాస్ బ్లాక్ గ్రిల్, స్కల్ప్టెడ్ బానెట్, పారామెట్రిక్ డిజైన్ ఎలిమెంట్స్, 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఈ ఎస్యూవీ పొడవు 3,815ఎంఎం. వెడల్పు 1,700 ఎంఎం. ఎత్తు 1,631ఎంఎం. వీల్‌బేస్ 2,450ఎంఎం.
Hyundai Exter CNG price : ఇక టాటా పంచ్ ఐసీఎన్జీలో బంపర్ మౌంటెడ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, క్లామ్‌షెల్ బానెట్, స్లీక్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, వ్రాప్ అరౌండ్ టెయిల్‌లైట్స్, ఎల్ఈడీ ఎలిమెంట్స్, 15 ఇంచ్ డైమెండ్ కట్ అలాయ్ వీల్స్ లభిస్తున్నాయి. ఈ వెహికిల్ పొడవు 3,827 ఎంఎం. వెడల్పు 1,742ఎంఎం. ఎత్తు 1,615 ఎంఎం. వీల్‌బేస్ 2,445 ఎంఎం.
ఈ రెండు మైక్రో ఎస్‌యూవీల ఫీచర్స్ ఏంటి..?
హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ 5 సీటర్ కేబిన్‌లో ఆల్-బ్లాక్ డాష్‌బోర్డ్, సెమీ లెథరేట్ అప్‌హోలిస్ట్రీ, డ్యూయెల్ కెమెరా డాష్‌క్యామ్, వాయిస్ ఎనెబుల్డ్ సింగిల్ పేన్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ వస్తోంది.
మరోవైపు టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 7.0 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్, సన్‌రూఫ్ లభిస్తోంది.
ఇదీ చూడండి:- Hyundai exter price : హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఎక్స్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలివే!
వీటి మైలేజ్ వివరాలివే..
హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీలో 1.2 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 హెచ్‌పీ పవర్‌ను, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్/ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ దీని సొంతం. దీని మైలేజ్ 27.1 కేఎం/కేజీగా ఉంది.
Tata Punch iCNG price : ఇక టాటా పంచ్ ఐసీఎన్జీ మోడల్లో 1.2 లీటర్ రెవెట్రాన్, 3 సిలిండర్ ఇంజిన్ లభిస్తోంది. ఇది 72 హెచ్‌పీ పవర్‌ను, 103 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ దీని సొంతం. దీని మైలేజ్‌పై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే ఇది 26-27 కేఎం/కేజీగా ఉండొచ్చు.
కాగా.. ఎక్స్టర్లో సింగిల్ సీఎన్జీ సిలిండర్ వస్తోంది. టాటా పంచ్ ఐసీఎన్జీలో రెండు చిన్న సైజు సిలిండర్లు వస్తున్నాయి.
ఈ ఎస్‌యూవీల ధరలెంత..?
Hyundai Exter CNG mileage : హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీలోని సీఎన్జీ వర్షెన్ ఎక్స్‌షోరూం ధర రూ. 8.23లక్షలు- రూ. 8.96లక్షల మధ్యలో ఉంటుంది. మరోవైపు టాటా పంచ్ కొత్త సీఎన్జీ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.1లక్షలు- రూ. 9.68లక్షల మధ్యలో ఉంటుంది.
సంబంధిత కథనం