Utility vehicles in India : ఎస్‌యూవీలో రయ్రయ్.. చిన్న కార్లకు భారతీయులు గుడ్ బై!
Utility vehicles growth in India : భారతీయులు.. యుటిలిటీ వెహికిల్స్‌పై మానసు పారేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వీటికి విపరీతమైన క్రేజ్ లభిస్తుండటంతో పాటు.. దశాబ్దకాలంగా దూసుకెళ్లిన చిన్న- ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ పడిపోతోంది.
Utility vehicles growth in India : 2022లో భారత దేశ ఆటో పరిశ్రమ దుమ్మురేపింది! రికార్డు స్థాయి సేల్స్‌తో దాదాపు అన్ని ఆటో సంస్థలు దూసుకెళ్లాయి. అయితే.. గతేడాది ఆటో సేల్స్ డేటాను పరిశీలిస్తే.. భారతీయుల ఆలోచనలు, ఇష్టాలు మారుతున్నట్టు అర్థమవుతుంది. ఎస్యూవీ- సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలతో కూడిన యుటిలిటీ వెహికిల్స్(యూవీ) సెగ్మెంట్‌కు గతేడాది విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఫలితంగా చిన్న- ఎంట్రీ లెవల్ కార్ల డిమాండ్ పడిపోయింది.
చిన్న కార్లపై ప్రేమ తగ్గిపోయిందా?
వాస్తవానికి చిన్న- ఎంట్రీ లెవల్ వాహనాలే.. ఇండియా ఆటో మార్కెట్‌ను ఎన్నో దశాబ్దాలుగా ఏలుతున్నాయి! అలాంటిది.. 2022లో యుటిలిటీ వెహికిల్స్ నుంచి ఈ సెగ్మెంట్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎస్‌యూవీలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. గతేడాది అది భారీ స్థాయిలో పెరగడం, చిన్న కార్లకు ఆశించినంత సేల్స్ రాకపోవడం ఆటో సంస్థను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
TOP SUV's in India : ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మేన్యుఫ్యాక్చరర్స్) డేటా ప్రకారం.. గతేడాది ఎంట్రీ లెవల్ కార్లతో.. దాదాపు సమానంగా యుటిలిటీ వెహికిల్స్ ప్రొడక్షన్ జరిగింది. యూవీల ప్రభావం ఏ రేంజ్లో ఉందంటే.. చిన్న కార్లకు పెట్టింది పేరైన దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ సైతం.. తన యూవీ సెగ్మెంట్‌ను బలపరుచుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే గ్రాండ్ విటారా పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. చిన్న కార్లపైనే దృష్టిసారిస్తామని మారుతీ చెబుతున్నా.. పోటీని ఎదుర్కొనేందుకు అదొక్కటే సరిపోదని ఆ సంస్థకు కూడా అర్థమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రూ. 10లక్షలలోపు అందుబాటులో ఉన్న టాప్ ఎస్‌యూవీల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
TOP SUV's in India in 2022 : ఒక్క యుటిలిటీ వెహికిల్స్ సెగ్మెంట్తోనే మారుతీ సుజుకీ సేల్స్‌లో 22.3శాతం వృద్ధి నమోదైంది! ఇక మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అయితే.. తన వ్యూహాలన్ని మొత్తంగా మార్చేసింది. 'ఎస్యూవీ ఓన్లీ' స్ట్రాటజీతో భారీగా లాభాలు పొందుతోంది. ఎం అండ్ ఎం సేల్స్ 62.2శాతం పెరగడం విశేషం. వెరిటో, మరాజో, కేయూవీ100 వంటి వాహనాలకు ఎప్పుడో డిమాండ్ పోయింది. వీటి స్థానాల్లో.. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్‌తో.. థార్, ఎక్స్‌యూవీ700, బొలేరో, స్కార్పియో ఎన్ వంటి వాహనాలను లాంచ్ చేసి.. తన పోర్ట్‌ఫోలియోను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుంది.
ఎస్‌యూవీల దూకుడు..!
Kia Motors SUV cars : ఇక దేశీయ ఆటో పరిశ్రమలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న సంస్థల్లో కియా మోటార్స్, ఎంజీ మోటార్స్‌లు ముందు వరుసలో ఉన్నాయి. వీటి మోడల్స్‌కు ఉన్న డిమాండ్‌ను చూస్తేనే.. యూవీలకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమైపోతుంది. సెల్టోస్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో ఇండియాలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కియా మోటార్స్.. ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్‌తో పాటు కార్నివాల్, కారెన్స్ వంటి ఎంపీవీలతో భారతీయులను ఆకర్షిస్తోంది. ఎంజీ హెక్టార్ కూడా ఇదే విధంగా ఆస్టర్‌తో పాటు ఇతర ఎస్‌యూవీలతో పోటీపడుతోంది.
ఇక టాటా మోటార్స్‌కు.. నెక్సాన్ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ బెస్ట్ సెల్లింగా ఉంది. హారియర్, సఫారీకి సైతం మంచి డిమాండ్ కనిపిస్తోంది. 2021 చివర్లో లాంచ్ అయిన టాటా పంచ్ సైతం దూసుకెళుతోంది.
2022లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎస్‌యూవీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టయోటా, హ్యుందాయ్ వంటి సంస్థలు కూడా ఎస్యూవీ సెగ్మెంట్‌పై అధిక దృష్టిని సారించాయి. హోండా సంస్థ మాత్రమే ఇప్పటివరకు ఒక్క ఎస్‌యూవీని కూడా లాంచ్ చేయలేదు. ఈ సంస్థ కూడా త్వరలోనే ఓ యుటిలిటీ వెహికిల్‌ను వదులుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి.
Tata motors SUV cars list : లగ్జరీ కార్ల సెగ్మెంట్లో మాత్రం.. సెడాన్, ఎస్‌యూవీల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. మెర్సెడీస్ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ మోడల్ ఆ సంస్థకు బెస్ట్ సెల్లింగా ఉంది. ఆడీకి కూడా.. అప్డేటెడ్ క్యూ3, కయూ5 ఎస్‌యూవీలతో పాటు ఆడీ ఏ8ఎల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది.
వీటన్నింటిని చూస్తే.. సామాన్య భారతీయుడి ఆలోచనలు మారాయా? రూ. 10లక్షలు- రూ. 20లక్షల ప్రైజ్ బ్రాకెట్‌పై ప్రజలు ఎక్కువగా దృష్టిపెడుతున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. 2023లో ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ వస్తుంది. చిన్న కార్ల ఉనికి ఏవిధంగా మారుతోందో తెలిసిపోతుంది!
సంబంధిత కథనం